For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేషుడు ఎలుక మీద ఎందుకు సవారీ చేస్తాడు?

|

గణేష్ చతుర్థి వస్తోంది మరియు ఇది సంవత్సరంలో అత్యంత ఉత్సాహంతో ఎదురుచూస్తున్న వేడుక. ప్రాంతాలు మరియు సంస్కృతుల సంబంధం లేకుండా ప్రతి హిందూ గృహంలో ఏనుగు తలతో ఉన్న ఈ దేవుని పూజిస్తారు. గణేషుడు, ఏనుగు తల, పెద్ద బొడ్డు మరియు ఒక ఎలుక మీద స్వారీ వంటి చిహ్నాలతో ప్రజలందరిలో కొలువున్నాడు.

చాలామంది ప్రజలు వినాయకుడు వంటి భారీ దేవుడు ఒక చిన్న చిట్టెలుక మీద ప్రయాణించడం ఎందుకు, ఏ విధంగా అన్నది తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. . నిజానికి, గణేషుడు, తన వాహనమైన ఎలుక గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది. మనందరికీ తెలుసు వినాయకుదు అన్ని అడ్డంకులను తొలగించి మరియు వివక్షత లేకుండా ప్రతి జీవిని దీవిస్తాడని. ఒక ఎలుక మీద స్వారీ చేసే వినాయకుని కథ తెలుపుతుంది, ఎలా మరియు ఎందుకు గణేషుడు దేవతలందరికంటే ముందు పూజలు అందుకోవటానికి అర్హుడయ్యాడో.

మీరు గణేషుడు ఎలుక మీద స్వారి చేయటం గురించిన కథ తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోనవుతారు. నిజానికి పూర్వజన్మలో ఒక యోగి ద్వారా శాపం పొందిన దైవాంశసంభూతుడు ఈ ఎలుక. ఎందుకు గణేషుడు ఎలుక సవారీ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే పూర్తి కథ తెలుసుకోవాలి. చదవండి.

Why Lord Ganesha Rides A Mouse?

క్రోంచ కథ
గణేశ పురాణం ప్రకారం, వినాయకుడు యొక్క ఎలుక, తన పూర్వజన్మలో ఒక దైవాంశసంభూతుడు మరియు అతని పేరు క్రోంచ. ఇంద్రుడి సభలో క్రోంచ అనుకోకుండా సన్యాసి అయిన ముని వామదేవ కాలి మీద అడుగు వేశాడు. ముని వామదేవ, క్రోంచ కావాలనే తన కాలివేళ్ల మీద అడుగు వేశాడని ఆలోచనతో ఆగ్రహం పెంచుకున్నాడు మరియు ఎలుకగా మారమని క్రోంచాను శపించాడు. భయంతో, క్రోంచ ముని కాళ్ళ మీదపడి క్షమాభిక్ష కోరాడు. దీనితో ఆ ముని వామదేవుని కోపం చల్లారింది. కాని అతను తన శాపం వృధా కాదని పలికాడు, కానీ క్రోంచ దైవమైన గణేశుడిని కలుస్తాడని మరియు అతని వాహనంగ మారతాడని తెలిపాడు. ఆవిధంగా అతను కూడా దేవతల పూజలకు పాత్రుడవుతాడని తెలిపాడు. కాబట్టి ఇది. క్రోంచుడు వామదేవ ముని శాపం వలన ఎలుకగా మారాడు మరియు మహర్షి పరాశర ఆశ్రమంలో పడ్డాడు.

క్రోంచ యొక్క ఉగ్రం
క్రోంచ ఒక సాధారణ ఎలుక కాదు. అది నిజానికే, ఒక పర్వతమంత పెద్దది మరియు ఎవరైతే తనను చూస్తారో వారిని భయపెడుతుంది. అతను వినాశనానికి కారణమవుతాడు మరియు అతని మార్గంలో ఏది ఉన్నా దానిని నాశనం చేస్తాడు. భూమిమీద ప్రజల్లో అతను భయానికి మారుపేరుగా నిలిచాడు.


గణేశ వాహనం
ఈ సమయంలో గణేశుడిని ఋషి పరాశరుడు, తన ఆశ్రమానికి ఆహ్వానించాడు మరియు అతను మరియు పరాశరుడు, అతని భార్య వత్సల గణేశు డికి ఆప్యాయంగా సపర్యలు చేశారు. అతిపెద్ద ఎలుక,క్రోంచ మరియు అది సృష్టిస్తున్న భయోత్పతాన్ని విన్న వినాయకుడు క్రోంచను అదుపుచేయాలని నిర్ణయించుకున్నాడు. గణేశుడి ఆయుధాలలో ఒకటి, పాషా (ఉచ్చు)ను క్రోంచ ఉన్న దిశలో ఎగురవేస్తూ పంపాడు. పాషా, దాని ప్రభావం వలన విశ్వమంతా ప్రకాశవంతమైన కాంతితో నిండింది. పాషా ఎలుకను వెంబడించింది మరియు అతని మెడ చుట్టూ ఉచ్చు బిగించింది మరియు గణేశుడి పాదాల వొద్ద పడవేసింది.


ఈ విధంగా క్రోంచ గణేశుడిని శరణు వేడాడు మరియు గణేశుడు క్రోంచాను వాహనంగా అంగీకరించాడు.

Desktop Bottom Promotion