For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందుమతంలో స్త్రీల రుతుక్రమాన్ని అపవిత్రంగా భావిస్తారు ఎందుకనీ?

|

పీరియడ్స్ సమయంలో మమ్మల్ని మా ఇంటిలోని పూజ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళవద్దని మా పెద్దవారు గద్దిస్తారు. బహిష్టు అనేది ఎక్కువగా బాధించే విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు.

సంప్రదాయాల ప్రకారం,ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోకూడదు. కాజల్ లేదా ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు. వంటగదిలోకి వెళ్ళకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే,ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాలి.

వాస్తవానికి పాత కాలం రోజుల్లో,బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతో ఉంటుంది. ఎవరు మాట్లాడకుండా తప్పించుకుంటారు. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని మరియు పూజ చేయటం నుంచి ఎందుకు మినహాయింపు ఉందో కారణం ఉంది.

కానీ మీరు హిందూమతం ప్రకారం బహిష్టు సమయంలో మహిళలను ఎందుకు అపవిత్రంగా భావిస్తారో కారణాల గురించి తెలుసుకోవాలి. మీరు దీనిని చదివితే కొన్ని అద్భుతమైన నిజాలను కనుగొనవచ్చు.

ద్రౌపది వస్త్రహపరణ

ద్రౌపది వస్త్రహపరణ

మహాభారతంలో ధర్మరాజు పాచికల ఆటలో ద్రౌపదిని కోల్పోయెను. అప్పుడు దుశ్శాసనుడు బహిష్టు సమయంలో ఉన్న ద్రౌపదిని రాజసభకు లాక్కొని వచ్చెను. ఆమె ఆ సమయంలో ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి ఒక ఏకాంత గదిలో ఉండెను. ఆ సమయంలో బహిష్టు గురించి అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక మహిళను అవమానపరిస్తే ఎక్కువ పాపంగా పరిగణించబడుతుంది.

ఇంద్రుడు యొక్క పాపము

ఇంద్రుడు యొక్క పాపము

ఇంద్రునికి ఒకసారి అహంకారం బాగా పెరిగి,తన గురువైన బృహస్పతిని కోపంలో స్వర్గం నుండి వెళ్ళకొట్టెను. దాని ఫలితంగా,రాక్షసులు దాడి చేసి ఇంద్రుడు సింహాసనంను స్వాధీనం చేసుకొనెను. ఇంద్రుడు తన మూర్ఖత్వంను తెలుసుకొని సహాయం కోసం లార్డ్ బ్రహ్మ వద్దకు వెళ్ళెను. బ్రహ్మ ఇంద్రుడికి తన గురువును శాంతింపచేయతనికి బ్రహ్మజ్ఞాని సేవ చేయాలని చెప్పారు.కాబట్టి,ఇంద్రుడు బ్రహ్మ జ్ఞాని సేవ చేయటానికి వెళ్ళెను. బ్రహ్మ జ్ఞాని వలన అసుర కుమారుడు జన్మించెను. దానికి బదులుగా అతను అసురులకు స్వర్గంను త్యాగం చేసెను. దాని పలితంగా ఇంద్రునికి చాలా కోపం వచ్చి బ్రహ్మ జ్ఞానిని హత్య చేసెను.

 ఇంద్రుడు ఒక పువ్వులో దాక్కోనెను

ఇంద్రుడు ఒక పువ్వులో దాక్కోనెను

ఇంద్రుడు బ్రహ్మ జ్ఞానిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాపం ఇంద్రుని వెంట ఒక భూతం రూపంలోవెంటాడెను. అందువలన ఇంద్రుడు ఒక పువ్వులో దాక్కొని కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుని ప్రార్ధించెను. విష్ణువు ప్రత్యక్షమయ్యి భూతం నుంచి అతనికి విముక్తి కలిగించెను. కానీ అతని తల మీద ఈ పాపం ఇప్పటికి ఉంది.

ఇంద్రుని పాపము విభజించబడింది

ఇంద్రుని పాపము విభజించబడింది

ఈ పాపం వదిలించుకోవటానికి,ఇంద్రుడు తన పాపమును బాగాలుగా విభజించి చెట్లు,భూమి,నీరు మరియు మహిళలు తీసుకువెళ్ళాలని వేడుకొనెను. ఇంద్రుడు దానికి బదులుగా ఒక వరం ఇస్తానని వాగ్దానం చేసెను. అందువలన,చెట్లు అతని పాపంలో నాల్గవ వంతు తీసుకున్నాయి. ఇంద్రుడు చెట్లకు మీ వేళ్ళు మళ్లీ మళ్లీ పెరుగుతాయని హామీ ఇచ్చెను. తదుపరి నీరు తన పాపంలో భాగంను తీసుకొనెను. నీటికి ప్రతి వస్తువును శుభ్రపరిచే శక్తిని ఇచ్చెను. తర్వాత భూమి తన పాపంలో భాగంను తీసుకొనెను. భూమిపై దెబ్బ తగిలినప్పుడు స్వంతంగా మరియు సులభంగా నయం చేసుకొనే శక్తిని ఇచ్చెను.

మహిళలు ఎందుకు దేవాలయాలలోకి వెళ్ళకూడదు?

మహిళలు ఎందుకు దేవాలయాలలోకి వెళ్ళకూడదు?

చివరగా మహిళలు బహిష్టు సమయంలో ఇంద్రుని పాపంను తీసుకొనెను. ఆమె బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉంటుంది. దానికి బదులుగా ఇంద్రుడు మహిళలకు పురుషుల కంటే ఎక్కువ లైంగిక ఆనందం కలుగుతుందని వరం ఇచ్చెను. అందువలన ఆ సమయంలో మహిళలు ఇంద్రుని పాపం తీసుకోవటం వలన,మహిళలు ఒక నెలలో ఒకసారి రుతుక్రమాలు మరియు ఒక బ్రహ్మ హత్య పాతకం అభియోగాన్ని కలిగి ఉన్నారు. అందువలన వారు ఆ సమయంలో దేవాలయాలలోకి వెళ్ళరు.

ఏకాంతంగా ఉండటానికి గల కారణాలు

ఏకాంతంగా ఉండటానికి గల కారణాలు

బహిష్టు సమయంలో మహిళలు ఏకాంతంగా ఉండటానికి మొదటి కారణం ఏమిటంటే,మహిళలు ఇన్ఫెక్షన్లకు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో ఉంటాయి. అందువలన ఆమె వాటి బారిన పడకుండా నివారించేందుకు వేరే గదిలో ఉంచుతారు. రెండవది,మహిళలు ఈ సమయంలో ఇంట్లో పని చేయడం నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఒక మహిళ యొక్క శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల తగిన రీతిలో విశ్రాంతి అవసరం. అందువల్ల మహిళలు ఇంటి పని నుండి తమకు తాముగా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు. బహిష్టు సమయంలో ఇతరుల నుండి దూరంగా ఉండమని సలహా కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక మహిళ యొక్క శరీరం తన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేసే ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

వక్రీకృత సాంప్రదాయాలు?

వక్రీకృత సాంప్రదాయాలు?

కొన్ని బహిష్టు సంప్రదాయాలను మహిళలను ఆరోగ్యంగా ఉంచటానికి అనుసరిస్తున్నారు. కానీ చాలా సంప్రదాయాలు మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక మహిళ బహిష్టు సమయంలో ఊరగాయ సీసాను తాకినట్లయితే అది చేడిపోతుందని నమ్ముతారు. ఆ సమయంలో మహిళను దాయటం మరియు అంటరానివారిగా వారితో ప్రవర్తించటంలో అర్థం లేదు. బహిష్టు అనేది ఒక ఆరోగ్యకరమైన స్త్రీ యొక్క ఒక సంకేతం. ఇది ఒక స్త్రీ సిగ్గు పడాల్సిన విషయం కాదు. కేవలం మూఢనమ్మకాలను ఆధారంగా ఇటువంటి ఆంక్షలను పెట్టటం వలన మహిళ యొక్క అస్థిత్వంనకు మరింత అవమానకరంగా ఉంటుంది.

మీరు బహిష్టు సమయంలో ప్రార్థన చేయవచ్చా?

మీరు బహిష్టు సమయంలో ప్రార్థన చేయవచ్చా?

దీనికి ఒక సాధారణ సమాధానం ఉంది. మీరు మంచి లేదా చెడు దేని గురించైనా ఆలోచించవచ్చు. అలాగే తియ్యగా లేదా కఠినంగా మాట్లాడటం లేదా ఆనందం లేదా బాదను వ్యక్తం చేయవచ్చు. అదే విధంగా మీరు ఈ పరిస్థితిలో మీకు ఇష్టం అయిన విధంలో దేవుని ప్రార్థన చేయవచ్చు. సంప్రదాయాల కారణంగా విగ్రహం తాకడానికి మినహాయింపు ఉంటే,అప్పుడు మీ మనసులో దేవుని పేరు వల్లించండి. మీ ఆధ్యాత్మికతకు మీ భౌతిక పరిస్థితిని కలుషితం చేయటం సాధ్యం కాదు.

ఇస్లాం మతంలో బహిష్టు

ఇస్లాం మతంలో బహిష్టు

ఒక మహిళ బహిష్టు సమయంలో ఉన్నప్పుడు ఇస్లాం మతంలో కూడా ఆ మహిళ అపవిత్రంగానే పరిగణించబడుతుంది. బహిష్టు సమయంలో మహిళకు ప్రార్థన లేదా ఖురాన్ తాకే అనుమతి లేదు. ఆమె బహిష్టు సమయాలలో రంజాన్ యొక్క పవిత్ర నెల సమయంలో ఉపవాసాలు కూడా చేయకూడదు. ఆమె ఏడవ రోజున స్నానం అయిన తర్వాత మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్ళుతుంది. అప్పుడు ఆమెకు శుద్ధి జరిగినదిగా భావిస్తారు.

కాలంలో మార్పులు

కాలంలో మార్పులు

ప్రస్తుతం ఒక నాగరిక ప్రపంచంలో బహిష్టు ఆంక్షలు నెమ్మదిగా కనుమరుగు అవుతున్నాయి. ఉదాహరణకు ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లో ఉండడానికి మరియు మిగిలిన ప్రపంచం నుండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అయితే ఇప్పటికి మహిళలకు ఆ సమయంలో దేవాలయాల సందర్శన మరియు పూజ నిర్వహించడానికి అనుమతి లేదు. సామాజిక ఒంటరితనం మరియు అవమానాలు చాలా వరకు తగ్గాయి. మెరుగైన ప్రపంచంలో నా కుమార్తెలకు మంచి శ్వాస కనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మిగతా వాటి కన్నా దీని గురించి సిగ్గు పడవలసిన అవసరం లేదు. బహిష్టు ఒక ఆరోగ్యకరమైన స్త్రీ యొక్క ఒక సంకేతం.


Story first published: Thursday, July 31, 2014, 17:09 [IST]
Desktop Bottom Promotion