For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇచ్చే బహుమతులే దీపావళి మరింత సంతోషకరం...

|

బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ఇతర దేశాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉన్న సాంప్రదయకరమైన పద్దతి. బహుమతులను ఇచ్చుపుచ్చుకొనే సందర్భం ఇప్పుడు రానే వచ్చింది. సాధారణంగా సందర్భాన్ని బట్టి మాత్రమే బహుమతలును తీసుకెళుతుంటారు చాలా మంది. అయితే ఈ దీపావళికి చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బహుమతులు ఇచ్చుపుచ్చుకోవడమనేది దీపావళి ప్రత్యేకతే.

బహుమతులు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చిపుచ్చుకోవడానికి దీపావళి ఒక సందర్భం. చాలా మంది దీపావళికి బహుమతులను పంచుతుంటారు. అయితే దీపావళికి ఎటువంటి బహుమతులను ఇవ్వాలి, ఎటువంటి బహుమతులను ఇవ్వకూడదనేది చాలా మందికి తెలిసిండకపోవచ్చు. అయితే దీపావళికి ఇచ్చుకొన్ని బహుమతులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకు ఈ సీజన్ లో చాలా మంది బహుమతల కోసం బయట మార్కెట్లో సందడి సందడిగా ఉంటుంది.

బహుమతులు ఎంపిక చేసుకోవడంలో వివిధ రాకలుగా ఉన్నాయి. బహుమతులను ఇవ్వాలనుకొన్నప్పుడు చాయిస్ వారి స్త్రీ పురుషులక ప్రత్యేకంగా, వయస్సును బట్టి కూడా ఉంటాయి. దీపావళి రోజున అందరూ సంతోషంగా గడపడం కోసమే చాలా మంది బహుమతులు ఇస్తుంటారు. కాబట్టి బహుమతులు ఎటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలి చూద్దాం...

బహుమతులు ఎంపికలో గణేషుని విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు, మరికొన్ని ఫోటో ఫ్రేములు వంటివి పెద్దవారికి ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా చిక్ స్టాండ్, గ్లాస్ ఫ్లవర్ వాజ్, సిల్వర్ స్పూన్ కట్లర్ వంటివి హోంమేకర్స్ కు ప్రెజెంట్ చేయొచ్చు. ఇక టీనేజ్ లో ఉన్నవారికి మేకప్ కిట్స్ మరియు కాస్మోటిక్స్, డ్రెస్సులు, జువెలరీలు వంటివి బహుమతులుగా ఇవ్వొచ్చు. డిజైన్ చేసి సిల్వర్ క్రస్టర్డ్ డైరీలు బిజినెస్ మ్యాన్స్ కు ఇవ్వొచ్చు. పిల్లలకు కొన్ని ఫన్నీ గిఫ్ట్ ను ప్రత్యేకంగా సెలక్ట్ చేసి ఇస్తే దీపావళిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకొంటారు. అయితే బహుమతులు ఇచ్చేటప్పుడు అది మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా ఉండాలి...

గణేషుని విగ్రహాలు

గణేషుని విగ్రహాలు

గణేషుని విగ్రహాలు దివాళికి ఫర్ ఫెక్ట్ గిఫ్ట్ లుగా ఎంపిక చేసుకోవచ్చు. లక్ష్మీ దేవితో పాటు, గణేషున్ని కూడా పూజలు చేస్తారు కాబట్టి. వీటికి సిల్వర్, గోల్డ్ కోటింగ్ ఇచ్చినవి మరింత ఆకర్షనీయంగా కనబడుతుంటాయి.

ఓరిప్లేమ్ స్కిన్ కేర్ బ్యూటీ కిట్

ఓరిప్లేమ్ స్కిన్ కేర్ బ్యూటీ కిట్

టీనేజర్స్ కు ఇచ్చేటటువంటి బహుమతుల్లో, బ్యూటీ గిప్ట్స్ తో పోల్చితే మరింత అందమైన గిఫ్ట్ ఉండవనే చొప్పొచ్చు. కాబట్టి అలాంటి చర్మసంరక్షణకు ఉపయోగపడే బ్యూటీ కిట్ తీసుకెళ్ళి భార్యకో, గర్ల ఫ్రెండ్ కో లేదా కూతురికో ఇచ్చి ఇంప్రెస్ చేయొచ్చు .

కృష్ణుని విగ్రహం

కృష్ణుని విగ్రహం

విష్ణువే, కృష్ణుని అవతారమెత్తినప్పుడు ఎలా వుంటాడో అలాంటి ఈ విగ్రహాన్ని బహుమతిగి ఇవ్వొచ్చు.

ఓరిఫ్లేమ్ మేకప్ కిట్

ఓరిఫ్లేమ్ మేకప్ కిట్

గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చే బహుమతుల్లో ఆమె ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలంటే ఇలాంటి విలువైన, నాన్యమైన ఓరిప్లేమ్ మేకప్ కిట్ ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. కాబట్టి, భార్యకు కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ ఇచ్చేటప్పుడు ఓరిఫ్లేమ్ న్యూ లిప్స్ కలర్స్ సెలక్ట్ చేసి ఇవ్వండి.

స్టైయిన్డ్ గ్లాస్ వాజ్

స్టైయిన్డ్ గ్లాస్ వాజ్

ఇంట్లో వారికి, ముఖ్యంగా హౌస్ వైఫ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలనుకొన్నప్పుడు, ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువులు కానీ, గ్లాస్ ఫ్లవర్ వాజ్ లు కానీ ప్రెజెంట్ చేయొచ్చు.

ఫోసిల్ వాచ్ కలెక్షన్స్

ఫోసిల్ వాచ్ కలెక్షన్స్

మహిళలకు లాగే పురుషులకు కూడా బహుమతులు ఎంపిక చేసుకొనేటప్పుడు అతను కూడా మరిచిపోలేని గిప్ట్ ప్రెజెంట్ చేయాలి. కాబట్టి దీపావళి గిప్ట్ గా వాచ్ లు బహుమతిగా ఇవ్వొచ్చు.

చీరలు

చీరలు

దీపావళికి స్త్రీలు, టీనేజ్ గర్ల్ ఎక్కువగా సాంప్రదాయంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతారు. కాబట్టి మహిళలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు, టీనేజ్ గర్ల్స్ కు చీరలు, డ్రెస్స్ లు ప్రెజెంట్ చేయొచ్చు.

నగలు

నగలు

స్త్రీకైనా, పురుషులకైనా విలువైన బహుమతులు ఇవ్వాలనుకొన్నప్పుడు సిల్వర్, గోల్డ్ జువెలరీస్ బెస్ట్ ఆప్షన్. వీటిని చిరకాలం బద్రపరుచకొని ఆనందం చెందుతారు.

డైరీ-కార్డ్ హోల్డర్

డైరీ-కార్డ్ హోల్డర్

స్నేహితులు, బిజినెస్ మ్యాన్, ఫ్రెండ్స్, బందువులకు ఆమె లేదా అతనికి ఇటువంటి బహుమతులు బాగా నప్పుతాయి. సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్ డైరీలను ఎంపిక చేసుకోవడంతో మరింత ఆకర్షనీయంగా ఉంటాయి.

స్వీట్స్

స్వీట్స్

దీపావళి హిందూ సాంప్రదాయంలో జరుపుకొనే అతి పెద్ద పండగ. కాబట్టి తీపి పదార్థాలు బహుమతులు ఇచ్చి వారి ప్రేమను, ఇష్టాన్ని తియ్యగా తెలియజేస్తారు.

డ్రైఫ్రూట్స్

డ్రైఫ్రూట్స్

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇతరుకు ఇచ్చే బహుమతుల్లో వీటిని చేర్చడం వల్ల వారు, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనేదానికి చిహ్నంగా భావిస్తారు.

చాక్లెట్స్

చాక్లెట్స్

పిల్లలు, పెద్దలు అత్యంత ఇష్టంగా తినే చిరుతిండ్లలో చాక్లెట్స్ కూడా ఒక్కటి. కాబటి చాక్లెట్స్ ను బహుమతిగా ఇచ్చి ఎదుటివారిని సంతోషపెట్టవచ్చు.

English summary

Diwali Gift Ideas For 2012 |ఈ దీపావళికి అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్|

Giving away gifts is a part of the Diwali rituals and celebration. This is the time of the year when we exchange gifts with friends and family. However, you cannot give just any thing as a Diwali gift.
Desktop Bottom Promotion