For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీరిక సమయాల్లో టీనేజ్ గర్ల్స్ చేసేటటువంటి 10 అభిరుచులు..!

By Super
|

నిత్యం స్కూలు ప్రాజక్టులు, ఉపాధ్యాయులు మీకు అప్పగించే వివిధ ఇంటి పనులు తో సంవత్సరం అంతా గడిచాకా వేసవి శలవులు వస్తాయి. క్షణం తీరిక లేకుండా గడిపిన మీకు శలవుల్లో ఏం చెయ్యాలా అని ఆలోచనలు రావడం సహజమే! ఒక్క వేసవి శలవులే కాదు, ఏ ఒక్క రోజు విశ్రాంతి దొరికినా ఏంచేద్దామా అన్న ఆలోచన వస్తుంది. అలా శలవు వచ్చినపుడు ఏమేమి చెయ్యాలో ఒక ప్రణాళిక ఉంటే శలవుల్ని ఎంతో సరదాగా, ఆసక్తికరంగా గడపవచ్చు. అంతే కాదు సమయాన్ని వృధాగా ఖర్చు చేసుకుని ఆ తర్వాత బాధపడాల్సిన పని ఉండదు. మన అభిరుచుల్ని ఒకచోట రాసిపెట్టుకుని ఖాళీ సమయాల్లో వాటిపై మరింత శ్రద్ధ కనబరిస్తే మేధస్సుకి పని చెప్పినట్లవుతుంది, సమయమూ వృధాపొదు.

ఇవిగో ఇక్కడ ఖాళీ సమయాల్లో టీనేజీ అమ్మాయిలు ( యుక్త వయస్సు అమ్మాయిలు) కోసం వివిధ అభిరుచుల ( హాబీలు) జాబితా!

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

పుస్తక పఠనం : చిన్న చిన్న కధలు లేదా ఒక ప్రేమ కావ్యం వంటి మీ అభిరుచిని బట్టీ ఒక చక్కటి పుస్తకాన్ని ఎంచుకోండి. ఎంచుకున్న పుస్తకం లో విషయాలు మీ పాఠ్య ప్రణాళికకు దగ్గరగా లేనివైతే మరీ మంచిది. అలాకాకుంటే తీరిక సమయాల్లోనూ మళ్ళీ అవే చదువుతున్నామనే భావనతో అసలు పుస్తక పఠనం అంటేనే విసుగు వచ్చే ప్రమాదం ఉంది.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

డైరీ రాయడం అలవాటు చేసుకోండి / మీ కలానికి పని చెప్పండి : ప్రతీ రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు మీ దినచర్య ను రాసే అలవాటు చేసుకోండి. ఇలా రాయడం మీకు మీ పాత జ్ఞాపకాలను తిరిగి చూసుకోవడానికే కాదు మీ భవిష్యత్ ను రూపొందించుకోవడం లోనూ సహకరిస్తుంది. ఒకవేళ దినచర్య ను రాయడం అంత ఆసక్తికరంగా లేదు అని మీరు భావిస్తే మీకు నచ్చిన ఏదైనా అంశం మీద వ్రాయడం అలవాటు చేసుకోండి.మీ కలానికి పని చెబితే మీరు వ్రాత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేనా, భవిష్యత్ లో మీరే ఓ హారీ పాటర్ లాంటి నవలనే రాస్తారేమో ఎవరు చెప్పగలరు!

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

ఫొటోగ్రఫీ : ప్రస్తుత ప్రపంచంలో ఫొటోలు తీయడం ఎంతో సులభం! ఆసక్తి ఉండాలే కానీ చేతిలో ఇమిడే చిన్న సెల్ ఫోన్ తో మన కళ్ళముందున్న అధ్భుతాల్ని కెమెరాలో బంధించేయవచ్చు. అలా బంధించిన ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ చూసుకున్నపుడు ఆ అనుభూతి గొప్పగా ఉంటుంది.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

డ్యాన్స్ / నృత్యం: వివిధ నాట్యరీతుల్లో మీకు ఇష్టమైన నాట్యరీతిని ఎంచుకుని నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆసక్తి ఉందాలే కానీ అందమైన భరతనాట్యం, కూచిపుడి వంటి శాస్త్రీయ నృత్య రీతులనుంచీ సాల్సా, జాజ్ వంటి పాశ్చ్యాత్య నృత్య రీతులవరకూ ఎన్నో ఎన్నెన్నో నాట్య రీతులు ఉన్నాయి. ఇవి ఆస్వాదించడానికే కాదు మన శరీరాకృతినీ అందంగా తీర్చిదిద్దుతాయి.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

గాత్రానికి పదును పెట్టండి: మీకు చక్కటి గొంతు ఉండి, పాటలు పాడే అలవాటు ఉంటే ఆ అభిరుచిని మరింత సాధనతో మెరుగు పరచుకోవచ్చు! అంత బాగా పాడలేను ఏదో బాత్ రూం సింగర్ ని అంటారా! అయినా ఫరవాలేదు,కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టూ ఎవరి స్వరం వారికి ఇంపుగానే అనిపిస్తుంది. పాట మొత్తం కాకపోయినా మీకు నచ్చిన ఆ పాటల పల్లవులన్నీ అలా పాడుకుంటూ ఉంటే సమయం తెలీకుండా గడిచిపోవడమే కాదు ఎంతో హాయిగా ఉంటుంది. సంగీతానికున్న మహత్యమే అది!

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

సంగీత సాధన / సంగీత వాయిద్యాల పై పట్టు సాధించండి: మీకు ఏమైనా సంగీత వాయిద్యాలను పలికించగలిగే నైపుణ్యం ఉంటే దానికి మరింత పదును పెట్టండి, ఆసక్తి ఉంది కానీ నేర్చుకోలేదు అంటారా, ఏమీ ఫరవాలేదు నేర్చుకోవలనుకునే ఆసక్తి ఉంటేచాలు సమయం మించిపోలేదు ఎప్పుడైనా మొదలుపెట్టి నేర్చుకోవచ్చు.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

గరిట తిప్పండి : వంట చెయడం గొప్ప కళ అంతే కాదు ప్రతీవారూ తప్పక నేర్చుకోవాల్సిన విద్య కుడా! ఎన్ని రోజులు అమ్మ లేదా వంటవాడు మనతో ఉంటారు? ఎప్పటికైనా విందు భోజనం కాకపోయినా కనీసం అన్నం పప్పు వండడం అయినా నేర్చుకోవాలి. మరో సంగతి వంట చేయడం లో ఉన్న మజా ఆ తర్వాత మనం వండిన వంటకాన్ని మనమే తినడం లో ఉన్న మజా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నే బావుంటుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళూ సైతం గరిట తిప్పడం తో తమ ఒత్తిడి బలాదూర్ అంటున్న రోజులివి!

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

కుట్లు అల్లికలు: ఈ కాలం అమ్మాయిలు సూదీ దారం పట్టుకోవడం తక్కువే! అయినా ఓసారి ఆ కళ ను తరచి చూస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి. పెద్ద పెద్ద వస్తువులు కాకపోయినా చిన్న వస్తువులు చేయడం, అల్లడం, బట్టలపై తేలికగా అయ్యే ఎంబ్రాయిడరీ నేర్చుకుని మీ బట్టలు , బ్యాగ్గు లు మీరే రూపొందించుకునే ప్రయత్నమూ చేయవచ్చు.లేదా బహుమతిగా ఇవ్వడానికి అనువైన వస్తువుల్ని తయారు చేసే ప్రయత్నమూ చెయ్యవచ్చు.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

స్వఛ్ఛంద సేవ చెయ్యండి: మీరు జంతు ప్రేమికులైతే జంతు సంరక్షక గృహాల్లో పని చేయవచ్చు. పేదలకు, అవసరార్ధులకు సహాయం చేయాలనుకుంటే వివిధ స్వచ్చంద సంస్థలకు వెళ్ళి అక్కడ మీ సేవను అందించే ప్రయత్నం చేయండి.

టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

స్నేహితులతో గడపండి: కష్టమైనా సంతోషమైనా పంచుకోగలిగే స్నేహితులు ఉన్నారా! అలాంటి గొప్ప వ్యక్తులను సంపాదించే ప్రయత్నమూ చేయండి, మీరూ ఓ గొప్ప స్నేహితురాలిగా మెలిగే టట్లు చూసుకోండి. మిత్రులు, శ్రేయోభిలాషులతో సరదా విహార యాత్రలు, సినిమాలు, షికార్లు ఇచ్చే గొప్ప అనుభూతి మాటల్లో వర్ణించతరమా!


English summary

10 Hobbies for Teenage Girls | టీనేజ్ గర్ల్స్ కు ఉండే 10 హాబీలు...!

You yearn for leisure when your teachers terrorize you with all those assignments and projects. But when you actually have a holiday, you have no clue how to spend it. Nothing can be more boring and frustrating than spending the entire vacation idling in your room as the days go by and all of a sudden its study time again.
Desktop Bottom Promotion