For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి ఆరోగ్యం కోసం అనుసరించవలసిన 20 చిన్న విషయాలు

|

చిన్న వయస్సు నుండి అన్ని అంశములలోను ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే వాటిని కొనసాగించటానికి సులభతరంగా ఉంటుంది.ప్రస్తుత రోజుల్లో ఈవిధంగా ఉండుట వల్ల సాధ్యమైనంత మెరుగైన భవిష్యత్ ను పొందవచ్చు. మీరు మంచి ఆరోగ్యంగా ఉండటానికి 20 చిన్న విషయాలను పాటిస్తే సరిపోతుంది.అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మంచి ఆరోగ్యం కోసం 20 చిన్న పెట్టుబడులు

ఆరోగ్య భీమా

ఆరోగ్యవంతమైన జీవితం కొరకు ఆరోగ్య భీమా అనేది ఒక ముందడుడు.ఆరోగ్య భీమా కొనుగోలు చేయండి. మీ జీవితంలో తప్పనిసరిగా ఆరోగ్య సంరక్షణ బీమా ఉండాలి.మీకు ఎప్పటికైనా ఆరోగ్య భీమా ఉండుట అనేది చాలా ముఖ్యమైనది.

మంచి ఆరోగ్యం కోసం 20 చిన్న పెట్టుబడులు

హెల్త్ చెక్ అప్

మీరు భీమా తీసుకున్న తర్వాత, మీరు క్రమం తప్పకుండా హెల్త్ చెక్-అప్ కు వెళ్ళి మెరుగైన ఆరోగ్యాన్ని పొందండి. ఈవిధంగా క్రమం తప్పకుండా హెల్త్ చెక్-అప్ చేయించుకోవటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు దిగజారకుండా అడ్డుకోవడం వంటి వాటి ద్వారా మీ జీవితకాలం పెరుగుతుంది.

పండ్లు

పండ్లు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పండ్లు శరీరనిర్వహణ కొరకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అందువలన, మీరు ప్రతిరోజూ పండ్లు కొనడం మరియు క్రమం తప్పకుండా వాటిని తినటం మర్చిపోవద్దు. అతి తక్కువ ధరలో అరటిపండు అందుబాటులోఉంటుంది. కనుక ప్రతి రోజు ఒక అరటిపండు తినడం వల్ల మీ ఆరోగ్యానికి వచ్చే ప్రయోజనాలను గుర్తించవచ్చు.

తగినంత కార్బోహైడ్రేట్స్

కార్బోహైడ్రేట్లు శరీరంలో శక్తి యొక్క ముఖ్యమైన వనరు మరియు క్యాన్సర్, డయాబెటిస్ మరియు రక్తనాళాలకు సంబంధించిన గుండెజబ్బులను తగ్గించటానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో తృణధాన్య కార్బోహైడ్రేట్లను మరియు కూరగాయలు, పప్పు దినుసులు, బీన్ కార్బోహైడ్రేట్ల యొక్క సముదాయము ఉండేటట్లు చూసుకోవాలి.

ఆరోగ్యకరమైన అల్పాహారం

మీరు ప్రతి రోజు ఒక మంచి మరియు ఆరోగ్యవంతమైన అల్పాహారం తీసుకోవాలి. మంచి ఆరోగ్యవంతమైన అల్పాహారం మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అల్పాహారం మీ శరీరానికి ఇంధనంగా పనిచేస్తూ, మరియు ప్రతి రోజు మీ పనితీరును మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ఒక క్రమ పద్దతిలో బరువు,మరియు ఎక్కువ తినకుండా నివారించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యవంతమైన నూనె వినియోగం

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మొదలైన ఆరోగ్యవంతమైన నూనెలను వాడాలి. శుద్ధి మరియు అధికంగా ప్రాసెస్ చేసిన నూనెలను వాడకూడదు. ఆరోగ్యకరమైన నూనె వాడకం వల్ల ఒక ఆరోగ్యవంతమైన భోజనం ను తయారుచేసుకోవచ్చు.

మంచి నోటి పరికరాలు

పంటి బ్రష్లు మరియు టంగ్ క్లీనర్లు లను తరుచుగా మార్చాలి. మీ దంత వైద్యుడు సిఫార్సు చేసిన కాలపరిమితి వరకు పంటి బ్రష్ లను ఉపయోగించండి. దంతాల ఉపరితలంను సమర్థవంతంగా శుభ్రపరచడానికి బ్రష్ కుంచె పొడవుగా,మెత్తగా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా ఫ్లోరైడ్ టూత్ పేస్టులను వాడాలి.

U.V. చలువ కళ్ళజోడు

మంచి నాణ్యత గల U.V. సన్ గ్లాసెస్ ను వాడాలి. ఈ సన్ గ్లాసెస్ అందానికే కాదు, సూర్యుని కిరణాల నుండి మీ కళ్ళను రక్షించటానికి ఉపయోగపడతాయి.

గుడ్ మ్యాట్రెస్

ఆరోగ్యమైన జీవితాన్ని గడపటానికి మంచి నిద్ర అవసరము. మెత్తని మ్యాట్రెస్ వాడటం వల్ల మీకు నిద్ర సమయంలో అనవసరమైన బ్యాక్ నొప్పులు మరియు స్థిరమైన మెళుకువలను తప్పించుకొని విశ్రాంతిగా పడుకోవచ్చు.

సన్ స్క్రీన్

మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చర్మానికి రక్షణగా సన్ స్క్రీన్ వాడాలి. కనీసం 15 SPF ఉండే సన్ స్క్రీన్ ను ఎంచుకోండి.

ఒక వ్యాయామ చాప కొనండి

యోగ సాధన, ఒక మంచి స్ట్రెచింగ్ ప్రోగ్రామ్ మరియు రొటీన్ అంశాలకు సహాయంగా ఉండటానికి ఒక వ్యాయామ చాప కొనండి.

ఒక స్పా కు వెళ్ళండి

అప్పుడప్పుడు స్పాకు చికిత్స లేదా శరీర మర్దన కొరకు వెళ్ళండి. శరీరంలో మసాజ్ మీకు రిఫ్రెష్ అయ్యి శక్తిని కలిగిస్తుంది. మీ వీపు, మెడ బాగాల్లో మసాజ్ చేయటం వల్ల ఒత్తిడి తీవ్రత తగ్గటానికి సహాయపడుతుంది.

:కొన్ని ప్రాథమిక హోం వ్యాయామం పరికరాలు కొనండి

సాదారణంగా ప్రతి రోజు 30 నిమిషాల వ్యాయామం మీ జీవన ప్రమాణంను పెంచుతుంది. మీకు బయటకు వెళ్లి వ్యాయామం చేయటానికి సమయం లేనప్పుడు కొన్ని ప్రాథమిక హోం వ్యాయామం పరికరాలు కొనండి. మీకు సాదారణ స్కిపింగ్ తాడు కూడా సహాయం చేస్తుంది.

సరదాగా బయటకు వెళ్ళండి

వారమంతా అలసిన శరీరానికి స్వాంతన చేకుర్చటానికి వారాంతపు సెలవుల్లో అలా సరదాగా బయటకు వెళ్లి తిరిగి రావాలి.

ఆరోగ్యకరమైన ఆహారం

మీ ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రధాన భాగం అయిన భోజనం, స్నాక్స్ లలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా మీ ఆహారంలో తాజా కూరగాయలు, ప్రోటీన్ లను చేర్చాలి.

సేంద్రీయ ఆహారం ఎంచుకోండి

ప్రాసెస్డ్ ఫుడ్ ను వీలైనంతవరకూ తగ్గించి సేంద్రీయ ఆహారంను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం వల్ల ఊబకాయం మరియు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల తాజా ఉత్పత్తులను మరియు తృణధాన్యాలు ఎంచుకోవాలి.

మీ ఆహారం తగినంతగా లేకుంటే సప్లిమెంట్స్ చేర్చండి

ఒక ఆరోగ్యకరమైన జీవితాన్నిగడపటానికి మీ ఆహారంలో తగినంత పోషకాలు లేనప్పుడు వాటిని పొందడానికి కొన్ని సప్లిమెంట్స్ ను సూచించటానికి మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు ఎప్పుడు సొంతంగా సప్లిమెంట్స్ ను వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

స్విమ్మింగ్ క్లాస్ లో చేరండి

స్విమ్మింగ్ వ్యాయామం అనేది ఉత్తమ వ్యాయామాలలో ఒకటి. కనీసం వారంలో మూడు సార్లు స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ చేయటం వల్ల కండరాల స్థాయి నిర్మించడానికి మరియు అస్థిపంజర నిర్మాణాన్ని బలంగా మరియు సౌకర్యవంతమైన ఉంచడానికి సహాయపడుతుంది.

మంచి నాణ్యత గల ఉత్పత్తులు

కొన్ని ఉత్పత్తులు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ ఆ ఉత్పత్తులలో వినియోగించే రసాయనాలు మీ చర్మం pH సంతులనంను నాశనం చేయవచ్చు. అందువలన, ఎల్లప్పుడూ చర్మానికి మంచి చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.

మంచి ఆరోగ్యం కోసం 20 చిన్న పెట్టుబడులు

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ లను మీ సీసాలలో నింపి ఉంచండి .రోజువారి అల్పాహారంలో బాదంపప్పులు మరియు ఆక్రోటుకాయలు వంటి నట్స్ ను కనీసం కొన్ని ఉపయోగించండి.నట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

English summary

20 little investments for good health | మంచి ఆరోగ్యం కోసం 20 చిన్న పెట్టుబడులు

A healthy lifestyle is easier to achieve and maintain if one makes regular investments in all aspects from healthy living from a young age. As with any kind of investments, the objective is to make a better future possible through present day action.
Desktop Bottom Promotion