For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రియతములు కోసం దీపావళి స్పెషల్ గిప్ట్ ఎంపిక

|

బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ఇతర దేశాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉన్న సాంప్రదయకరమైన పద్దతి. బహుమతులను ఇచ్చుపుచ్చుకొనే సందర్భం ఇప్పుడు రానే వచ్చింది. సాధారణంగా సందర్భాన్ని బట్టి మాత్రమే బహుమతలును తీసుకెళుతుంటారు చాలా మంది. అయితే ఈ దీపావళికి చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బహుమతులు ఇచ్చుపుచ్చుకోవడమనేది దీపావళి ప్రత్యేకతే.

ఈ దీపావళి రోజు మాత్రం, బహుమతులు చేతిలో లేకుండా ఏ ఇంటికి వెళ్ళలేము. ముఖ్యంగా పిల్లలు మరియు వయస్సైన వారు ఉన్న ఇళ్ళకు, గిఫ్ట్ లేకుండా వెళ్లాలంటే మరీ మొహమాటం ఎక్కువ. బహుమతులు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చిపుచ్చుకోవడానికి దీపావళి ఒక సందర్భం. చాలా మంది దీపావళికి బహుమతులను పంచుతుంటారు. అయితే దీపావళికి ఎటువంటి బహుమతులను ఇవ్వాలి, ఎటువంటి బహుమతులను ఇవ్వకూడదనేది చాలా మందికి తెలిసిండకపోవచ్చు. అయితే దీపావళికి ఇచ్చుకొన్ని బహుమతులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకు ఈ సీజన్ లో చాలా మంది బహుమతల కోసం బయట మార్కెట్లో సందడి సందడిగా ఉంటుంది.

Awesome Gift Ideas For Diwali

బహుమతులు ఎంపిక చేసుకోవడంలో వివిధ రాకలుగా ఉన్నాయి. బహుమతులను ఇవ్వాలనుకొన్నప్పుడు చాయిస్ వారి స్త్రీ పురుషులక ప్రత్యేకంగా, వయస్సును బట్టి కూడా ఉంటాయి. దీపావళి రోజున అందరూ సంతోషంగా గడపడం కోసమే చాలా మంది బహుమతులు ఇస్తుంటారు. కాబట్టి బహుమతులు ఎటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలి అని బోల్డ్ స్కై కొన్ని అద్భుతమైన బహుమతుల లిస్ట్ ను ఇక్కడ తయారుచేసింది. అయితే బహుమతులు ఇచ్చేటప్పుడు అది మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా ఉండాలి... అవేంటో ఒక సారి చూద్దాం...

1. స్వీట్స్: ఇది ఒక క్లాసిక్ గిప్ట్ ఐడియా. స్వీట్ బహుమతిగా ఇవ్వడం అనేది దీపావళికి మాత్రమే కాదు, ఇతర పండుగలకు కూడా ఇవ్వొచ్చు. స్వీట్స్ బహుమతిగా ఇచ్చేటప్పుడు, స్వీట్ బాక్స్ ను అందంగా అలంకరించి, గిప్ట్ ప్యాక్ చేసి అందివ్వాలి. కాబట్టి మీకు నచ్చిన ఒక బెస్ట్ ప్యాకెట్ ను ఎంపిక చేసుకోండి. మీరు పిల్లలకు స్పెషల్ గా బహుమతి ఇవ్వదల్చుకుంటే, దీవాళి స్పెషల్ చాక్లెట్స్ ను అందివ్వండి.

2. క్య్రాకర్స్: దీపావళి అంటేనే టపాకాయలు కాల్చడం. కాబట్టి మీరు ఎకో ప్రెండ్లీ మరియు సింపుల్ క్య్రాకర్స్ ను కొని పిల్లలకు బహుమతిగా ఇవ్వొచ్చు. వారు తప్పనిసరిగా ఆనంపడుతారు.

3. సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్: దీపావళి రోజును సిల్వర్ మరియు బంగారు నాణెంను కొనడం, బహుమతిగా ఇవ్వడం అదృష్ట భావిస్తారు. అంతే కాదు ఇది శ్రేయస్సు మరియు సంపదను తీసుకొస్తుందని నమ్మకం. మరియు మీరు మీ స్నేహితులకు దగ్గరి బందువులకు కూడా వీటి గిప్ట్ గా ఇవ్వొచ్చు.

4.డ్రై ఫ్రూట్స్: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇతరుకు ఇచ్చే బహుమతుల్లో వీటిని చేర్చడం వల్ల వారు, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనేదానికి చిహ్నంగా భావిస్తారు.

5. ఇంటి వస్తువులు: ఇంటికి సంబంధించిన మరియు నిత్యం ఉపయోగపడే వస్తువులు లెక్కలేనన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు టోస్టర్, మైక్రోవేవ్, మొదలగునవి దీపావళి సందర్భంగా బహుమతిగా ఇవ్వొచ్చు. అలాగే కొన్ని డిన్నర్ సెట్, గ్రైండర్ వంటి వాటిని కూడా గ్రిప్ట్ గా ఇవ్వొచ్చు.

6. కొత్త బట్టలు: దీపావళికి స్త్రీలు, టీనేజ్ గర్ల్ ఎక్కువగా సాంప్రదాయంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతారు. కాబట్టి మహిళలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు, టీనేజ్ గర్ల్స్ కు చీరలు, డ్రెస్స్ లు ప్రెజెంట్ చేయొచ్చు. అలాగే పురుషులకు నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకొని అందివ్వ వచ్చు.

7. ఆభరణాలు: స్త్రీకైనా, పురుషులకైనా విలువైన బహుమతులు ఇవ్వాలనుకొన్నప్పుడు సిల్వర్, గోల్డ్ జువెలరీస్ బెస్ట్ ఆప్షన్. వీటిని చిరకాలం బద్రపరుచకొని ఆనందం చెందుతారు.

8. మేకప్ కిట్: మహిళలు అందం విషయంలో ఏ మాత్రం రాజీ పడరన్న విషయం మీకు తెలిసిందేగా, అటువంటప్పుడు ఒక అద్భుతమైన మేకప్ కిట్ ను ప్రెజెంట్ చేస్తే చాలా సంతోషపడుతారు. మీ పార్ట్నర్ కు నచ్చిన ఒక బెస్ట్ మేకప్ కిట్ ఎంపిక చేసుకొనే అంధించండి.

English summary

Awesome Gift Ideas For Diwali

Diwali is the festival where all family members gather and celebrate this festival together with joy. It is a festival where you get a chance to meet your relatives, close friends and enjoy the festive mood to the fullest.
Story first published: Tuesday, October 29, 2013, 12:54 [IST]
Desktop Bottom Promotion