For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రులకు అతి పెద్ద పండుగ ‘సంక్రాంతి’

|

ఆంధ్రులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు..అంబరాన్నంటేలా జరుపుకే ఈ పండుగ ‘భిన్నత్వంలో ఏకత్వం' అనే పదానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే ‘మారడం' అని అర్థం. సూర్యడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఈ పన్నెండు సంక్రాంతుల్లోనూ పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఈ సంక్రాంతి పండుగను ఆంధ్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతిని కోస్తా జిల్ల ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకోవడం ఆనాటి కాలం నుండి ఆనవాయితి.

Pongal: The Four Days Big Festival

ఈ పండుగను జరుపుకొనే మూడు రోజుల్లో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. ఇలా మూడు రోజులు ఎంతో అత్యంత వైభవంగా జరుపుకొనే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. ఇంకా మరికొంత మంది కనుమ తర్వాత నాలగవ రోజును ముక్కనుమని అని నాల్గవ రోజూనూ సెలబ్రేట్ చేసుకొంటారు. ముక్కనుమ రోజు బంధువులు, స్నేహితులతో కలిసి వారి బహుమతులను అంధించడం ఆనవాయితి. వారికి మాత్రమే కాదు, వ్యవసాయధారులకు, పనివారికి కూడా మంచి బహుమతులను అంధిస్తారు. నిజం చెప్పాలంటే ఈ ధనుర్మాస నెల ప్రారంభం కాగానే నెల రోజుల పాటు వాతావరణం చలిచాలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులూ తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరాల్సిందే...

సంక్రాంతి నెల ఆరంభం కాగానే ప్రతీ రోజూ తమ ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు, ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసే గొబ్బెమ్మలతో రకరకాల పువ్వులతో అలంకరిస్తారు. మరో ప్రక్క బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారుల, వివిధ రకాలజానపద వినోద కళాకారలు నెలమొత్తం వీధుల్లో అలరిస్తుంటారు. ఇక భోగి రోజు భోగి మంట విధిగా వేయవలసిందే. ఆ రోజు సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు తప్పవు. ఈ పెద్ద పండగకు కొత్త అల్లుడు అత్తవారింటికి వస్తాడు.

ఈ సంక్రాంతికి మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఏ పల్లెలో చూసినా కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుపుకొంటారు. ఇంట్లో ఉన్న పశువులను పువ్వులు, బెలూన్స్ తో అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వ సామాన్య విషయాలు.

English summary

Pongal: The Four Days Big Festival | భిన్నత్వంలో ఏకత్వం..సంక్రాంతి

Pongal is a very important Hindu festival which is celebrated with great joy in Tamil Nadu. Also known as the Tamil harvest festival, Pongal is a four day long festival for thanking the nature. Pongal falls in the harvesting month of January-February (season when rice, sugarcane, other cereals are harvested). Typically, Pongal falls on 14-15 January and apart from thanking the nature, it is also a month of weddings.
Desktop Bottom Promotion