For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కోటి ఏకాదశి విశిష్టత: పూజా విధానం

|

పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాధవి అంటారు. శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఈ రో జున వైకుంఠంలో మూడు కోట్ల దేవతలు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. భారతీయులందరికీ ఈ దినం ఎంతో శ్రేష్ఠమైనది. మకర సంక్రమణం వరకు ఈ మా సం ధనుర్మాసం, మార్గళి మాసంగా పిలువబడుతుండటంతో ఉషః కాలంలోనే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని వై ష్ణవాలయాల్లో, శ్రీ వైష్ణవ సంప్రదాయపరు ల గృహాల్లో పాశురాలను (తిరుప్పావై) అనుసంధానం చేస్తారు. గృహలను, ఆలయాలను మామిడి తోరణాలు, పూలతో అలంకరిస్తారు. విష్ణు సంబంధ స్తోత్రాలను, అర్చనలు, అభిషేకాలను నిర్వహించి పునీతులౌతారు.

ఈ ఏకాదశి మరియు ద్వాదశలకు కు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముక్కంటి వెంకటేశ్వరుని దర్శనార్ధం వచ్చే భక్తుల కోసం టిటిడి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. నీరు, ఆహారం ప్రత్యేకంగా అందిస్తోంది. వివిధ దర్శన మార్గాల్లో నీరు, ఆహారాల కొరకు కొన్ని స్టాల్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇంకా ప్రత్యేక వైద్యసేవలు మరియు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా టిటిడి ఏర్పాటు చేసింది. మీరు ముక్కోటి ఏకాదశి విశిష్టత పూజా విధానం తెలుసుకోవాలంటే ఈ పూర్తి వ్యాసం చదవాల్సిందే...

Vaikuntha Ekadashi: Significance of Vaikuntha Ekadashi

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

పండగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది శనివారం జనవరి 11 వచ్చింది. శనివారం వైకుంఠ ఏకాదశి రావడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుంది. అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి (జనవరి -11) రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య ఐదుగా ఉండాలి. కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

English summary

Vaikuntha Ekadashi: Significance of Vaikuntha Ekadashi

Vaishnavas (devotees of Lord Vishnu) observe Ekadashi Vrata and engage in remembering the Supreme Lord by chanting His Holy Names and singing His glories. Ekadashi is the eleventh day of the fortnight of waxing or waning moon and occurs twice a month.
Desktop Bottom Promotion