For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్ఛితంగా టేస్ట్ చూడాల్సిన 10 వెరైటీ దోసెలు

|

దోస(dosa)చాలా పాపులర్ అయినటువంటి సౌత్ ఇండియన్ ఫుడ్. ప్రస్తుతం ఈ దోసె ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది. ఫుడ్ లవర్స్ లో మీరు ఒక్కరైతే, డిఫరెంట్ వెరైటీ దోసలను రుచిచూడాలనుకుంటే, మీకు సంతోషకరమైన విషయం ఏంటే మీకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. వంటలు అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫుడ్ లవర్స్ కు ఈ ట్రెడిషనల్ రిసిపి చాలా ఎక్కువగా నచ్చుతుంది.

దోస వివిధ రకాల వంటలను ఆఫర్ చేస్తుంది. వాటిలో ఒకదానికొకటి పూర్తి విభిన్నంగా ఉంటాయి. ఒక్కో రకమైన దోసెలో ఒక్క విధమైన ఫ్లేవర్ మరియు రుచి మరియు రంగు కూడా కలిగి ఉంటుంది. కుక్కింగ్ ఎక్స్ పర్ట్స్(వంటల్లో ఆరితేరిన వారు)ఒక దోసెలోనే 100రకాల వెరైటీ దోసెలున్నాయని చెబుతారు. వెరైటీ దోసెలను తయారుచేయడానికి తయారుచేసుకొనే పదార్థాల్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది.

భారత్ లో ఏఏ సిటీ -ఏఏ ఆహారానికి ఫేమస్ చూడండి:క్లిక్ చేయండి

వంటల్లో వివిధ రకాల వినూత్నమైన వంటలను ఎంపిక చేసుకొనే వ్యక్తులు ఎల్లప్పుడూ, వంటల్లో కొత్తవంటలు, కొత్త పద్దతులను ఆసక్తి కరంగా తెలుసుకోవడాని ఉత్సాహం చూపెడుతారు. కాబట్టి సాధారణంగా మనం తయారుచేసుకోగల కొన్ని కామన్ వెరైటీ దోసెలను మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాం...

ప్లెయిన్ దోస:

ప్లెయిన్ దోస:

ఇది ఒక సింపుల్ దోస. దీన్నిబియ్యం పిండితో తయారుచేస్తారు. ఈ దోసెను చాలా సాధారణంగా మన ఇల్లల్లో తయారుచేసుకుంటారు. ఈ ప్లెయిన్ దోసెకు వివిధ రకాల చట్నీలను మీరు తయారుచేసుకోవచ్చు.

మసాలా దోస:

మసాలా దోస:

వివిధ రకాల దోసెలు వెరైటీస్ లో ఇది చాలా పాపులర్ అయినటువంటిది. ఈ మసాలా దోసెను(ప్లెయిన్ దోసె మద్యలో బంగాళదుంప స్టఫ్ చేసి తయారుచేస్తారు). ఈ మసాలా దోసెను చట్నీ మరియు సాంబార్ తో సర్వ్ చేస్తారు. చాలా వరకూ రెస్టారెంట్లలో సైడ్ కాంబినేషన్ గా వడను కూడా సర్వ్ చేస్తారు.

బట్టర్ లేదా వెన్న దోసె:

బట్టర్ లేదా వెన్న దోసె:

ఈ దోసె చాలా వెరైటీగా ఉంటుంది. ప్లేట్ లో దోసెను పూర్తిగా తినేవరకూ ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. ముఖ్యంగా ఈ దోసెను ఆయిల్ కు బదులుగా బట్టర్ లేదా వెన్నను ఉపయోగించి తయారుచేస్తారు.

రవ్వ దోస:

రవ్వ దోస:

సాధారణంగా తయారుచేసుకొనేటువంటి దోసెలో ఇది ఒక వెరైటీ దోసె. ఈ దోసెను నార్త్ ఇండియాలో ఎక్కువగా తయారుచేసుకుంటారు. రవ్వదోసెను గోదుమ రవ్వ లేదా సూజి రవ్వతో తయారుచేసుకుంటారు . ఈ దోస ఇతర దోసెల కంటే వెరైటీ టేస్ట్ కలిగి ఉంటుంది.

పేపర్ దోస:

పేపర్ దోస:

ఈ పేపర్ దోసను మీరు ఎప్పుడైనా తినడానికి ప్రయత్నించారా. ఇది మీ ప్లేట్ కంటే పెద్దదిగా ఉంటుంది, మరియు మీ టేబుల్ కంటే చిన్నదిగా ఉంటుంది?ఈ పేపర్ దోసె చాలా పల్చగా అచ్చం పేపర్ లాగే క్రిస్పీగా ఉంటుంది.

నీర్ దోసె:

నీర్ దోసె:

కర్నాటకాలో ఈ నీర్ దోసె చాలా ఫేమస్. దోసెలలో చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది దోసె పిండిని అప్పటికప్పుడు రుబ్బి, చాలా పల్చగా తయారుచేసుకుంటారు. ఇది చాలా లైట్ గా మరియు టేస్టీగా పేపర్ దోసెలాగే ఉంటుంది.

అమెరికన్ చోప్సూయే దోస:

అమెరికన్ చోప్సూయే దోస:

వావ్!పేర్లోనే దోసె స్పెషాలిటీ తెలుస్తోంది. ఈ దోసె మల్టీ నేషనల్ దోస, ఈ దోసెను ఇండియ, చైన, అమెరికా మూడు దేశాల యొక్క మిళితంగా తయాచేసినట్లు ఉంటుంది. ఈ దోసె మద్యలో నూడిల్స్ ను స్టఫ్ చేసి తయారుచేస్తారు. కాస్త వెరైటీ కోరుకొనే వారు దీన్ని ప్రయత్నించవచ్చు.

ఆనియన్ దోసె:

ఆనియన్ దోసె:

ఈ దోసెను తయారుచేయడం చాలా సులభం. ముందుగా దోసె పిండిని దోసె పెనం మీద స్ప్రెడ్ చేసి తర్వాత పిండి వేడికాకముందే

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

ఎగ్ దోసె:

ఎగ్ దోసె:

మీరు నాన్ వెజిటేరియన్ దోసను ప్రయత్నించాలంటే, ఎగ్ దోసెను ట్రై చేయండి. ఇది ఒక మంచి ఎంపిక. దోసె పిండిని దోసెలా వేసిన తర్వాత గుడ్డలోని సొనను దోసె మీద వేసి దోసె మొత్తం స్ప్రెడ్ చేస్తారు.

వెజిటేబుల్ దోస:

వెజిటేబుల్ దోస:

మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే, వెజిటేబుల్ దోసకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వెజిటేబుల్ దోసె తీసుకుంటే మీకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ పుష్కలంగా అందుతాయి.

English summary

10 Varieties Of Dosa You Must Try

Dosa is the most popular south Indian food item, which is now popular all over India. If you are one among those food lovers who want to try different varieties of dosa, then be happy to know that you have too many options. This traditional food has been the favourite of all those who love cooking.
Desktop Bottom Promotion