For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమేజాన్ ఫ్యాషన్ వీక్ స్పెషల్: అదిరేటి డ్రెస్సులలో మోడల్స్

By Nutheti
|

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరుగుతోంది. డిజైనర్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడానికి.. ప్రపంచానికి చాటడానికి సరైన స్టేజ్ గా భావిస్తున్నారు. అందుకే తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి.. ట్రెండీగా డ్రెస్సులు డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నారు.

సంచితా అజంపూర్ ముంబై పుట్టి.. మూడేళ్ల వయసులో యూరప్ కి వెళ్లిపోయారు. ఫ్యాషన్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన సంచితా.. పలువురు డిజైనర్ల దగ్గర పని చేశారు. 2005లో సొంతంగా డిజైనింగ్ స్టార్ట్ చేశారు. ఈమె భారతీయులనే కాకుండా.. అంతర్జాతీయులను ఆకట్టుకునే డిజైన్స్ తీర్చిదిద్దుతారు.

సంచితా డిజైన్ చేసే బట్టలు.. చాలా సౌకర్యంగా ఉంటాయి. ట్రెండ్ కి తగ్గట్టు డిజైన్ చేస్తారు. సంచితా అజంపూర్ డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే... ర్యాంప్ కి కొత్త కళ వచ్చింది.

hat

అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో సంచితా డిజైన్ చేసిన హ్యాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ హ్యాట్స్ ట్రెండీగా.. ఆకట్టుకున్నాయి.

tribal

సంచితా షోలో ట్రైబల్ ఆర్ట్ చాలా ఆకర్షణీయంగా నిలిచింది. హ్యాండ్ ప్రింట్స్ తో డిజైన్ చేసిన ఈ డిజైనర్ డ్రెస్సులు సంచితా క్రియేటివిటీని ప్రతిబింబించాయి. చాలా విభిన్నంగా ఆలోచించి డిజైన్ చేశారని ప్రశంసలు అందుకున్నారు సంచితా.

fashion

జియోమెట్రిక్ ప్రింట్స్ తో డిజైన్ చేసిన టాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్, ఇంటర్నేషనల్ మార్కెట్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఈ డిజైన్స్.

fashion

బ్రైట్ కలర్స్ ఎవర్ గ్రీన్. అందుకే సంచితా అజంపూర్ బ్రైట్ కలర్స్ ని ట్రెండీగా డిజైన్ చేశారు. బ్రైట్ కలర్ టాప్స్ ఎంచుకోవడంతో.. అందరినీ ఆకట్టుకున్నాయి.

English summary

Sanchita Ajjampur Surreal Show At The Amazon India Fashion Week 2016

Sanchita Ajjampur was born in Mumbai but moved to Europe at the age of three and has lived most of her life in Europe. She was first educated in Vienna and the United Kingdom, received her degree in arts from the Chambre Syndicale de la Haute Couture Parisienne and her Fashion and Technology Master's degree from Domus Academy in Milan.
Story first published: Saturday, October 10, 2015, 16:34 [IST]
Desktop Bottom Promotion