For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్ల డైట్ అండ్ గ్లామర్ సీక్రెట్

|

హీరోల హీరోయిజానికి ఫ్లాటైపోయే ఆడియెన్స్... హీరోయిన్ల గ్లామర్‌కి ఫిదా అయిపోతుంటారు. అందుకే అందమంతా పోత పోసినట్టు ఉండే సుందరాంగులను తెచ్చి తెరమీద చూపిస్తుంటారు దర్శకులు.

సినిమా అంటేనే గ్లామర్. గ్లామర్ ని తెరమీదకు మరింత కొత్తగా చూపించాలనేదే దర్శక,నిర్మాతల తాపత్రయం. అలాగే ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. సెక్సీ లుక్ తో కనపడే హీరోయిన్స్ కు బ్రహ్మరంధం పడుతూంటారు. ప్యామిలీ సినిమాలు చేసే హీరోయిన్ కన్నా అందీ అందనట్లు అందాలు ఆరబోసే హీరోయిన్స్ కే ఎక్కువ డిమాండ్.

మరి కొంత మంది హీరోయిన్ల నేచురల్ గానే తమ అందాన్ని, బాడీని బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి వారిలో మన టాలివుడ్ లో చాలా మంది హీరోయిన్లే ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న టాప్ టెన్ హీరోయిన్ల యొక్క బ్యూటీ అండ్ డైట్ సీక్రెట్స్ మీకోసం...

 రెజీనా డైట్ సీక్రెట్:

రెజీనా డైట్ సీక్రెట్:

మాణింగ్ గ్లాసుడు నీళ్లతో నా డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ లేక కాఫీ. {బేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోసె.. ఇలా ఏదో ఒకటి తీసుకుంటా. బేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్య డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు. మధ్యాహ్న భోజనంలో బీట్‌రూట్, క్యారెట్, కీరా ఉండేలా చూసుకుంటాను. కొంచెం రైస్, రోటీ తీసుకుంటా. నాకు పనీర్ అంటే ఇష్టం. నా శరీరానికి కావల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయి.

ఆయిలీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. అందుకని వేపుళ్లను అవాయిడ్ చేస్తాను. నూనె పదార్థాలకు దూరంగా ఉంటాను కాబట్టి, డైట్ పరంగా పెద్దగా నియామలు పాటించాల్సిన అవసరం లేకుండాపోతోంది.

లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య ఫ్రూట్స్, నట్స్ తింటుంటాను. డిన్నర్ లైట్‌గా తీసుకుంటాను.

సీక్రెట్ రివీల్ చేసిన తమ్మూ:

సీక్రెట్ రివీల్ చేసిన తమ్మూ:

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ రహస్యాన్ని బయటపెట్టింది. తనంత అందంగా ఉండడానికి కారణమేంటో వివరించింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండడంవల్లే తాను అంత అందంగా, ప్రశాంతంగా ఉంటానని అసలు రహస్యాన్ని చల్లగా చెప్పింది. సినిమా తారలంటే ఎప్పుడూ చాలా ఖర్చుతో కూడిన క్రీములు అవీ వాడతారనీ, అందుకే అంత అందంగా ఉంటారని చాలామందిలో అపోహ ఉంది. కానీ, ఇందుకు తాను భిన్నమని తమ్మూ బ్యూటీ చెబుతోంది.

స్వీటి అనుష్క బ్యూటీ సీక్రెట్:

స్వీటి అనుష్క బ్యూటీ సీక్రెట్:

అనుష్క..తెలుగు ఇండస్ట్రీలో పేరుగాంచిన అందమైన భామ..ఈమెకు భారీ ఆఫర్లతో సినిమాలు ఒకటి తరువాత ఆఫర్లు వస్తున్నాయి..దీంతో కలెక్షన్ క్వీన్ గా టాలీవుడ్ లో పేరుగాంచింది..తన అందంతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ బెంగుళూరు బ్యూటీ గురించి ఓ నిజం బయటపెట్టింది..తను ఇంత అందంగా ఉన్నందుకు గల సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేసింది..ఇక ఎందుకు ఆలస్యం అసలు ఈ భామ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం..మ‌న అందాన్నీ, ఆరోగ్యాన్న్నీ నిర్ణయించేది ఆహార అల‌వాట్లే, మ‌నం ఏం తింటామో, అదే మ‌న మొహంలో క‌నిపిస్తుంది. అందుకే కూర‌గాయ‌లూ పండ్లు స‌లాడ్స్..జ్యూస్ లు ఎక్కువుగా తీసుకుంటుంద‌ట‌. ఏం తిన్నా ఎనిమిదిలోపే, నిద్ర పోవ‌డానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోద‌ట‌. ఇదే త‌న బ్యూటీ సిక్రెట్ అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ‌. ఓస్ ఇంతేనా అనుకుంటున్నారా..అవును నిజమే కావచ్చు..ఆమె నిజజీవితంలో అలాగే ఫాలో అయింది కాబట్టి చెప్పింది లేకపోతే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం అనుష్కకు ఉండదు గదా..!

 మిత్రవింద కాజల్ అగర్వాల్:

మిత్రవింద కాజల్ అగర్వాల్:

కాజల్ అందమైన చర్మ సౌందర్యం కలదు. ఆమెలో దాగున్న అందం వెనుక స్కిన్ క్వాలిటీ. కాజల్ తన చర్మ, కేశ సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి కేర్ తీసుకుంటుంది. దాంతో ఆమె చర్మం ఎల్లప్పుడు స్కిన్ హైడ్రేషన్ కలిగి ఉండటం వల్ల చర్మం పొడిబారటం, ఆయిల్ కలిగి ఉండటం జరగవు. 1. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతుందట. దాని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. 2. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది అంటోంది ఐష్. 3. అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది. తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు. 4. యోగాసనాలు, వ్యాయామాలు శరీరాకృతిని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. 5. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్రతో పాటు మితంగా ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు మితాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది అందాల కాజల్....

ఇలియానా:

ఇలియానా:

నడుమొంపుల సుందరి ఇలియానా తన బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేసింది. తను నిత్యం అందంగా కనిపించడానికి కారణం మానసిక ప్రశాంతత అని చెప్పింది. మెదడులో లేనిపోని ఆలోచనలను వేసి రుబ్బే వారి ముఖం త్వరగా తెలిసిపోతుంది. అదే ఎలాంటి విషయాన్నైనా సున్నితంగా తీసుకునేవారు చాలా అందంగా ఉంటారు. ‘‘మానసిక సౌందర్యంతో పాటు కొద్దిపాటి జాగ్రత్తలతో శారీరక సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. నేను యోగా చేస్తాను. స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. నా బ్యూటీ సీక్రెట్ అదే'' అని చెప్పింది ఇలియానా.

సమంత :

సమంత :

నాజూకైన శరీరం,క్యూట్ గా ఉండే చిరునవ్వు,ఇంకా యవ్వనం లో ఉన్నట్లుండే ఆమె ఎందరో కాలేజీ అమ్మాయిలకి ఆదర్శం.ఎవ్వరికుండదు చెప్పండి ఆమెలాగ కట్టిపడేసే అందంతో ఉండాలని??నాకు ఆమె ఫిట్ నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్,అందం కోసం తీసుకునే జాగ్రత్తలు తెలిస్తే నేనూ వాటిని తప్పక పాటిస్తాను. ఉపవాసాలు, డైటింగులంటే పెద్దగా ఆసక్తి చూపదు సమంత.అన్ని రకాలా ఆహార పదార్ధాలూ మితం గా తీసుకుంటారామె.తన శరీరం లో క్యాలరీలు చేరతాయన్న భయం లేకుండా తనకి నచ్చింది తింటుంది సమంత.తన వ్యాయామాలకి తగినట్లుగా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాన్ని ఇష్టం గా తింటుందామె.మిగతా సెలిబ్రిటీల లాగె తన డయట్ లో నట్స్,బెర్రీస్,కూరగాయలతో చేసిన సలాడ్లు,పండ్లు,లీన్ మీట్ ఉంటుందంటారు ఆమె ట్రైనర్.కానీ ఈ అందాల సుందరికి సాంబారన్నం ఎంతో ఇష్టం.తమిళ వంటకాలైన దోశ, వడ,ఇడ్లీ,పొంగల్ అంటే ఈమెకి ప్రాణం.వీటిని తినకుండా తనని తాను కట్టడి చేసుకోలేనంటారామె.అంటే భారతీయ ఆహారం విషయంలో తను మామూలు తమిళ అమ్మాయన్నమాట. ఎప్పుడూ లైం లైట్ లో ఉండాలంటే నిత్యం మనల్ని మనం గ్రూం చేసుకోవాలి అంటారామె."ఎప్పటికప్పుడు నేను నా స్టైల్ ని మార్చుకుంటూ ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ సృష్టించాలని చూస్తాను.నాకు వదులుగా ఉండే బట్టలు నచ్చవు.క్లాసీ గా ఉండి స్త్రీ తత్వాన్ని ప్రతిబించించే దుస్తులంటే ఇష్టం నాకు" అంటుంది ఈ అందాల తార. ఎప్పుడూ తన హ్యాండ్ బ్యాగ్ లో సన్ స్క్రీన్ ఉంటుందని చెప్తుందామె. వివిధ రకాలా ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యాల్సిరావడం , ఎండలో పని చెయ్యాల్సి రావడం వల్ల సన్ స్క్రీన్ ని ఎప్పుడూ మర్చిపోనంటుంది సమంత.

రకూల్ ప్రీతి సింగ్:

రకూల్ ప్రీతి సింగ్:

ప్రస్తుతం టాలీవుడ్ ఏలేస్తున్న యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ లో రకూల్ ప్రీతి సింగ్ కూడా ఒక్కరు. అందుకు ఆమె గ్లామర్ అండ్ బ్యూటీయే సిల్వర్ స్క్రీన్ కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. రీసెంట్ గా ఆమె బ్యూటీ సీక్రెట్స్ కొన్ని మీడియాతో షేర్ చేసుకొంది. అవేంటంటే...వారంలో 6రోజులు జిమ్ చేస్తూ, సాధ్యం అయినంత వరకూ ఇంటి ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటాని చెబుతోంది . ముఖ్యంగా భోజనం వేళకు తీసుకుంటానంటోంది. మనం రోజూ మన ముఖంలో ఉండే మురికిని ఎలా తొలగించుకుంటామో..అదే విధంగా శరీరంలో మలినాలను తొలగించుకోవడానికి వర్కౌట్స్ ద్వారా బాడీకి ఎక్కువ పనిచేప్పి, బాడీలోని టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేసి స్ట్రాంగ్ గా, ఫిట్ గా మరియు హెల్తీగా ఉండటానికి సహాయపడుతాయి అనిచెబుతోంది.

శృతిహాసన్:

శృతిహాసన్:

వరుస విజయాలతో దూసుకుపోతున్న శృతిహాసన్ అగ్ర శ్రేణి కథానాయికల లిస్ట్‌లో చేరిపోయింది. శ్రీమంతుడు విజయం తరువాత ఆమె జోరు పెంచింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా వున్న శృతిహాసన్ తన గ్లామర్ సహస్యం ఏమిటో తాజాగా బయటపెట్టేసింది. ఎప్పుడూ స్లిమ్‌గా కనిపించే ఆమె తన గ్లామర్ వెనుక పెద్ద రహస్యమే దాగుందని చెప్పింది.

ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ యోగా చేస్తాను. అంతే కాకుండా జిమ్‌లో ప్రత్యేకంగా ట్రైనర్ సూచించిన వర్కవుట్‌లు క్రమంతప్పకుండా చేస్తుంటాను. డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఒక విధంగా ఎక్సర్‌సైజే కదా. ఇవన్నీంటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను కాబట్టే నేను ఇంత స్లిమ్‌గా...గ్లామర్‌గా కనిపిస్తున్నాను. ఇదే నా గ్లామర్ సహస్యం అని తెలిపింది. ఆమె మరిన్ని విశేషాలు తెలియజేస్తూ నేను యోగాని ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి మనసు తేలికవుతుంది. అలా చేయకపోతే నాకు ఏమీ తోచదు అని తెలిపింది శృతిహాసన్.

తాప్సీ:

తాప్సీ:

డిల్లీలోని పంజాబీ కుటుంబంలో పుట్టిన అందాల బొమ్మ తాప్సీ. ఎప్పుడూ తాజాదం నిండిన అందంతో కనిపించే తాప్సీ సినిమాల్లోకి రాకముందు, వచ్చాక కూడా ఎప్పుడూ డైటింగ్ అనేది చేయలేదట. అసలు అటువంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదని చెబుతోంది. అంతే కాదండోయ్, మంచి తిండితినటమే తన సౌందర్య రహస్యమని కూడా చెప్పింది. తిండిని కంట్రోల్లో పెట్టుకుని డైటింగ్ చేయడాన్ని నేనస్సులు నమ్మను. నేను పంజాబీ అమ్మాయిని, ఫుడ్ అంటే నాకు చాలా పిచ్చి. తిను బండారం ఏదైనా కంట పడితే ఇక అది మన నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అయితే, ఎంత ఫుడ్ తిన్నా రోజూ వర్కౌట్లు చేస్తే ఎవరికైనా మంచి ఫలితం ఉంటుంది. దాని వల్ల చాలా అందంగా కనిపిస్తారు. అని చెప్పుకొస్తోంది. తాప్సీ.

అవికాగోర్:

అవికాగోర్:

బుల్లి తెర నుండి సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిన అవికాగోర్. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఆమె కూడా ఒకరు. రన్నింగ్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద హంచి ఫామ్ లో ఉన్నది. అమె బ్యూటీ సీక్రెట్ ఆమె క్యూట్ స్మైలే అని సెలవిస్తోంది.

English summary

Top 10 Tolly wood Heroines Fitness and Beauty Secret

Top 10 Tolly wood Heroines Fitness and Beauty Secret, Most of our South actresses have a good physique. They woo the audience with their curves and glam appeal. Maintaining this figure is not an easy task and our heroines do take up some hard exercises to achieve the target. Here are the fitness secrets of s
Story first published: Monday, October 19, 2015, 16:38 [IST]
Desktop Bottom Promotion