For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్..

By Swathi
|

స్టార్స్, సూపర్ స్టార్స్ గా వెండితెరపై వెలిగిపోతున్న తారలు.. కొన్నేళ్ల క్రితం సాదాసీదాగా బతికినవాళ్లే. పుట్టుకతోనే స్టార్స్ అయినవాళ్లు కాదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. వాళ్ల కల నిజం చేసుకున్నారు. కన్న కల నిజం చేసుకుని వెండితెర స్టార్స్ మనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచారు.

ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న సూపర్ స్టార్స్

చాలా కష్టపడి పైకి వచ్చారు మన స్టార్స్. కొంతమంది స్టార్ గా రాణించాలనుకున్నారు. మరికొంతమంది.. ఇంత పాపులారిటీ సంపాదిస్తామని కూడా ఊహించలేదు. వాళ్ల హార్డ్ వర్కే వాళ్లకు సక్సెస్ తీసుకొచ్చింది. పట్టుదల, సక్సెస్ అవ్వాలనే డ్రీమ్.. వాళ్లను ఇంత గొప్ప స్థానానికి చేర్చింది. అలా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్న, ఫ్యాన్స్ లో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

చిన్న చిన్న ఉద్యోగాలతో జీవితం స్టార్ట్ చేశాడు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో రిజెక్ట్ కూడా అయ్యాడు. కానీ.. ఇప్పుడు అమితాబ్ వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం అమితాబ్ కి ఫ్యాన్స్ అవడంతో.. మెగా స్టార్ అయ్యారు.

MOST READ:మీ రాశిని బట్టి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు-పరిష్కార మార్గంMOST READ:మీ రాశిని బట్టి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు-పరిష్కార మార్గం

రజనీకాంత్

రజనీకాంత్

సింప్లిసిటీకి మారుపేరు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ ఇన్స్పిరేషన్ అయ్యారు. మనందరికి తెలుసు మొదట్లో బస్ కండక్టర్ గా ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఆఫ్ స్క్రీన్ పై సింప్లిసిటీ, ఆన్ స్క్రీన్ పై స్టైలిష్ గా ఆకట్టుకునే రజనీకి ఫ్యాన్స్ భారీగా ఉన్నారు.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

బ్యాంకాక్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని.. ఇండియాలో ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఒక స్టూడెంట్ అతనికి ఒకరోజు మోడలింగ్ లో ట్రై చేయవచ్చు కదా అని సజెస్ట్ చేయడంతో.. అలా బాలీవుడ్ జర్నీ స్టార్ట్ అయింది.

బొమన్ ఇరాని

బొమన్ ఇరాని

బొమన్ ఇరాని వెయిటర్ అంటే నమ్ముతారా ? నిజమే ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో వెయిటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తర్వాత సినీరంగంలో అడుగుపెట్టాడు.

నవాబుద్దీన్ సిద్దిఖ్

నవాబుద్దీన్ సిద్దిఖ్

గ్యాంగ్స్ ఆఫ్ వాస్సెపూర్ 2 సినిమా చూస్తే నవాబుద్దీన్ యాక్షన్ కి ఫిదా అయిపోతారు. కానీ ఇతరు ఢిల్లీలో థియేటర్ ముందు వాచ్ మెన్ గా పనిచేశాడు. అలా చిన్న ఉద్యోగంతో కష్టపడి పైకి వచ్చి.. ఇప్పుడు ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ అవుతున్నాడు.

MOST READ:అంతర్ముఖ వ్యక్తిత్వం కలవారిలో ఉండే కొన్ని సాధారణ అపోహలుMOST READ:అంతర్ముఖ వ్యక్తిత్వం కలవారిలో ఉండే కొన్ని సాధారణ అపోహలు

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

బాలీవుడ్ లో తనకంటూ.. ఓ స్థానాన్ని సంపాదించుకున్న రణవీర్ సింగ్ మొదట్లో కాపీ రైటర్ గా పనిచేశాడు.

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్ మల్హోత్రా.. మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. కానీ.. మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. కానీ.. ఇప్పుడు యంగ్ యాక్టర్స్ ఒకడిగా.. సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

మార్కెటింగ్ ఇన్ టర్న్ గా పరిణీతి చోప్రా వర్క్ చేసిందంటే నమ్ముతారా ? కానీ.. మార్కెంటింగ్ ఫీల్డ్ నుంచి ఈ బ్యూటీ బీటౌన్ లోకి రాకపోతే.. ఈ అమ్మడి అందాన్ని మిస్ అయిపోయేవాళ్లు కదూ.

జాన్ అబ్రహాం

జాన్ అబ్రహాం

సక్సెస్ ఫుల్ మోడల్, బాలీవుడ్ స్టార్ కాకముందు.. జాన్ అబ్రహాం.. మీడియా ప్లానర్ గా వర్క్ చేశాడు.

అర్షద్ వర్సీ

అర్షద్ వర్సీ

ఇంటింటికీ తిరిగి.. కాస్మొటిక్స్ అమ్మిన వాడు అర్షద్ వర్సీ. కానీ.. డాన్సింగ్ స్కిల్స్ ఇతన్ని కొరియోగ్రాఫర్, యాక్టర్ గా మార్చాయి.

మాధవన్

మాధవన్

మాధవన్ ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని లక్ష్యముండేది. కానీ.. 6 నెలలు వయసు తేడా వల్ల రిజెక్ట్ అయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ స్పీకింగ్ కోచ్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోచ్ గా పనిచేశాడు. ముంబైలో పనిచేస్తున్నప్పుడు పోర్ట్ ఫోలియో క్రియేట్ చేసి.. మోడలింగ్ ఏజెన్సీకి పంపాడు.

MOST READ:ప్రతి రోజూ స్నానం ఎందుకు చేయాలి? ఎందుకంత ప్రాధాన్యతMOST READ:ప్రతి రోజూ స్నానం ఎందుకు చేయాలి? ఎందుకంత ప్రాధాన్యత

విక్రమ్

విక్రమ్

సినీ వినీలాకాశంలో మెరిసిపోతున్న హీరో విక్రమ్. విక్రమ్ మొదట్నుంచి.. మోడలింగ్ రంగలోనే ఉన్నాడు. పలు ప్రచార కార్యక్రమాల్లో నటించాడు. చోలా టీ, టీవీఎస్ ఎక్సెల్, ఆల్విన్ వాచ్ వంటి బ్రాండ్స్ కి ప్రచారం చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సక్సెస్ అయ్యాడు.

అజిత్ కుమార్

అజిత్ కుమార్

ప్రస్తుతం కోలీవుడ్ లో చెరగని స్థానం కొట్టేసిన స్టార్ అజిత్ కుమార్ మొదట్లో మోడలింగ్ లో పనిచేశాడు. అలాగే.. మెకానిగ్ గా ఫుల్ టైమ్ పనిచేశాడు. 1990లో మెకానిక్ పనిచేసి డబ్బులు సంపాదించి.. మోడలింగ్ లో సక్సెస్ అయ్యాడు. అలా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు.

సూర్య

సూర్య

సూర్య సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో వస్ర్తవ్యాపారవేత్తగా ఉండేవాడు. 3ఏళ్లు ఈ బిజినెస్ చేశాక.. ఇక జీవితంలో ఈ వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో.. నటనలో తన సత్తా నిరూపించుకున్నాడు.

English summary

10 Celebrities Whose Stories Will Inspire You

10 Celebrities Whose Stories Will Inspire You. There are some celebrities who have become stars and super stars today but they were not so decades ago.
Desktop Bottom Promotion