For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందే అమ్మ పిలుపుకు దగ్గరైన సెలబ్రెటీలు..

|

ఒకప్పుడు వాళ్లంతా తమ అందం, అభినయంతో వెండి తెరను ఓ ఊపు ఊపి, ప్రేక్షకులను రంజింప చేసిన హీరోయిన్లు. వాళ్లకు ఆ కెరీర్ ఎంత సంతృప్తిని ఇచ్చిందనే విషయం పక్కన పెడితే....అమ్మతనంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదంటున్నారు. అమ్మగా మారిన తర్వాత కొందరు తమ కెరీర్‌‌కు గుడ్ బై చెబితే, మరికొందరు మాత్రం తల్లిగా తన బాధ్యతలను, ఇటు ఆర్టిస్టులగా తమ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

సినిమాల్లో కథానాయకుల ప్రేమలో తడిసి ముద్దయ్యే తారలకు, నిజ జీవితంలోనూ ప్రేమించడం, ఆ ప్రేమను పంచడం బాగా తెలుసు. కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలోనే, తమకు ఏమాత్రం సంబంధంలేని చిన్నారులను పెంచి పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. ఆడతనం, అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో కొందరి మీకోసం పరిచయం చేస్తున్నాము...

హన్సిక:

హన్సిక:

యువ నటి హన్సికను ‘నీకెంత మంది పిల్లలు' అని అడిగితే ‘28మంది' అని టక్కున చెబుతుంది. ఇరవై ఏళ్ల వయసుకే ఇరవై మంది పిల్లల బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టిన హన్సిక, ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది చిన్నారులకు అన్నీ తానై ఆహారం, బట్టలూ, చదువూ, వైద్యం లాంటి అన్ని అవసరాలనూ చూసుకుంటోంది. చాలా ఏళ్లుగా పుట్టినరోజూ, పండగలనూ వాళ్ల మధ్యే జరుపుకుంటోన్న హన్సిక ఏడాదికి రెండు సార్లయినా వాళ్లతో కలిసి టూర్లకు వెళ్తుంది. ప్రస్తుతం ఓ స్థలం కొని పిల్లల కోసం భవనం నిర్మించే పనిలో ఉన్న ఆమె, భవిష్యత్తులో ఏడాదిలో కొన్ని నెలలు వాళ్లతోనే ఉంటానంటోంది.

సమంత:

సమంత:

అధికారికంగా ఎవరినీ దత్తత తీసుకోకపోయినా, అనధికారికంగా పదుల సంఖ్యలో పిల్లల బాగోగులు చూస్తోంది సమంత. నాలుగేళ్ల క్రితం అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో రెండు వారాలు ఉండాల్సొచ్చినప్పుడు, డిశ్చార్జ్‌ అయ్యాక తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనుకుంది. అలా ‘ప్రత్యూష' అనే సంస్థను మొదలుపెట్టి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స చేయించడంతో పాటు బట్టలు కొనిస్తూ, చదువు చెప్పిస్తూ వాళ్లకు పూర్తి స్థాయి కేర్‌ టేకర్‌గా మారింది. ప్రకటనలూ, షోరూం ఓపెనింగ్‌ల ద్వారా వచ్చే డబ్బుకు తోడు, తన అవార్డులూ, ఇతర వస్తువులనూ తరచూ వేలం వేస్తూ ఆ డబ్బునూ పిల్లల కోసమే సమంత ఖర్చు చేస్తోంది.

శ్రుతిహాసన్:

శ్రుతిహాసన్:

కమల్‌ హాసన్‌ కుమార్తె ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటుంది. అయినా కాని సమాజ సేవ చేయాలన్న దృక్పథం తనకు చాలా ఎక్కువని చెబు తుంది. తన తండ్రి నుంచే ఈ దృక్పథాన్ని అలవర్చు కున్నానని చెబుతోం ది. ఈ హీరోయిన్‌ హెచ్‌ ఐవీ వ్యాధితో బాధప డుతున్న చిన్నారులకు చేదో డుగా ఉంటుంది. ఎయిడ్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తోంది. అంతే గాకుండా ఇటువంటి వ్యాధిగ్రస్తులం దరికీ ఒక ఫ్లాట్‌ పారాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది.

సుస్మితాసేన్:

సుస్మితాసేన్:

దేశానికి మొట్టమొదటి ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటాన్ని అందించిన సుస్మితా సేన్‌, అంతకంటే మంచి కారణంతోనే చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. పాతికేళ్ల వయసులో, టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తొన్న సమయంలో ఓ అనాథ చిన్నారిని దత్తత తీసుకుంది. కానీ పెళ్లి కాని అమ్మాయి, మరో చిన్నారి బాగోగులు చూసుకోవడం వీలుకాదంటూ కొందరు కోర్టులో అప్పీలు చేశారు. అయినా బొంబే హైకోర్టు దాన్ని కొట్టేసి చిన్నారి రెనీ బాధ్యతను సుస్మితకు అప్పగించింది. ఇంకొన్నేళ్ల తరవాత మరో మూడు నెలల చిన్నారిని దత్తత తీసుకొని ముద్దుగా అలీసా అని పేరు పెట్టుకుంది.

రవీనా టాండన్ : సొంత పిల్లలతో సమానంగా...

రవీనా టాండన్ : సొంత పిల్లలతో సమానంగా...

‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులూ పాండవులూ తుమ్మెద’ లాంటి సినిమాలతో తెలుగు వాళ్లకూ పరిచయమైన బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, ఇరవై ఒక్కేళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే పూజ(8), ఛాయా(11) అనే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుంది. తరవాత ఆమె పెళ్లి చేసుకుని మరో ఇద్దరు పిల్లలకు తల్లయినా, వాళ్లతో సమానంగానే దత్త పుత్రికలనూ పెంచి పెద్ద చేసింది. ఉన్నత చదువులు చదివించింది. అంగరంగ వైభవంగా వాళ్లిద్దరి పెళ్లిళ్లు కూడా చేసి తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చింది.

శోభన:

శోభన:

జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్న శోభన అందం అభినయంతో పాటు వ్యక్తిత్వంతోనూ బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆరేళ్ల క్రితం మూడు నెలల పసికందును దత్తత తీసుకున్న శోభన ఓ భారీ వేడుకను ఏర్పాటు చేసి ఆ విషయాన్ని ప్రకటించింది. అనంత నారాయణి అని ఆ చిన్నారికి పేరు పెట్టి అన్నప్రాసన నుంచి పుట్టినరోజు వేడుకల వరకూ ప్రతిదీ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ‘ఇప్పుడిప్పుడే నారాయణి నాట్యం నేర్చుకుంటోంది. భవిష్యత్తులో తను నన్ను మించిపోవాలన్నదే నా కోరిక’ అంటుంది శోభన.

ప్రీతీ జింతా :

ప్రీతీ జింతా :

‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ లాంటి చిత్రాల్లో సందడి చేసిన సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింతా ఏకంగా 34మంది పిల్లల బాధ్యతలు భుజాన వేసుకుంది. రిషికేష్‌లోని ‘మదర్స్‌ మిరాకిల్‌ స్కూల్‌’లోని 34మంది అమ్మాయిలకు తిండీ, బట్టలూ, చదువుకు సంబంధించిన అన్ని వ్యవహారాలూ ఏడేళ్లుగా ఆమే చూసుకుంటోంది. అప్పుడప్పుడూ విహార యాత్రలకు తీసుకెళ్తూ వాళ్లకెవరూ లేరనే లోటును దూరం చేస్తోంది. ‘మా పిల్లలంతా హాస్టల్లో చదువుకుంటున్నారు. నాకున్న బిజీ కారణంగా వాళ్లతో ఇంటిదగ్గర గడుపుతూ, బాగోగులు చూసుకోవడం కుదరదు. భవిష్యత్తులో వాళ్లతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తా’ అంటుంది ప్రీతి.

మంచులక్ష్మి

మంచులక్ష్మి

మంచులక్ష్మి కూడా పేద పిల్లల చదువుకు కావాల్సిన సాయం అందిస్తోంది. అనాథ ఆశ్రమాలకు తన వంతుగా సాయమందిస్తుంది. ఇటీవల స్వచ్ఛ భారత్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఆ రకంగా కూడా అక్కడ సామాజిక సేవలందించనుంది.

 ఏజిలినా జోలి:

ఏజిలినా జోలి:

ఏంజెలినా జోలి. ఈ పేరు వింటే కోట్లాది మంది ఫ్యాన్స్ ఆరాధ్య దేవత కళ్లముందు కదలాడుతుంది. శృంగార తార కనిపిస్తుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కాదు మానవత్వం పరిమళించిన మహిళగానూ జోలీకి పేరుంది. మూడు దేశాలు, మూడు జాతులకు చెందిన పిల్లలను దత్తత తీసుకొని జాతులే కాదు దేశాల సరిహద్దులను చెరిపేసింది. మానవత్వానికి మతం అక్కర్లేదని చాటిచెప్పింది.

English summary

Celebrities Who Adopted Kids

Adoption is an option for couples who are unable to have biological children. But many couples, single men and women have come ahead to adopt kids whenever they have heard of celebrity adoption despite of having biological kids or being able to have biological kids.
Story first published: Tuesday, April 19, 2016, 11:26 [IST]
Desktop Bottom Promotion