For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన గ్రేటెస్ట్ పొలిటికల్ లవ్ ఎఫైర్స్

By Super Admin
|

మన రాజకీయాల గురించి ఏమైనా విన్నప్పుడు, మన మనస్సులో రాజకీయం అనే పదం ఒక డర్టీ పదంగా అనిపిస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో ఇతర విషయాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దేశ రాజకీయ నాయకులు ఉన్నారు.

ప్రపంచంలో తమ రాజకీయ సహకారం కంటే మరింత కీర్తిని సంపాదించిన గొప్ప రాజకీయ ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం.

అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి మన దేశ ప్రసిద్ధ రాజకీయ నాయకుల ప్రేమ వ్యవహారాలు మనందరినే కాదు.. ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

జవహర్ లాల్ నెహ్రూ, ఎడ్విన మౌంట్ బాటన్

జవహర్ లాల్ నెహ్రూ, ఎడ్విన మౌంట్ బాటన్

నెహ్రూ ఆకర్షణీయ రూపం, గుడ్ లుక్స్ తో ప్రసిద్ధి పొందారు. అయన చుట్టూ అమ్మాయిలు తేనెటీగలా వాలేవారట. లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్విన మౌంట్ బాటన్ నెహ్రుతో తన ఇష్టపూర్వకంగానే సంబంధాన్ని అంగీకరించింది.

జాన్ ఎఫ్ కెన్నెడీ, మార్లిన్ మన్రో

జాన్ ఎఫ్ కెన్నెడీ, మార్లిన్ మన్రో

ఈ ఎఫైర్ మీడియా, రాష్ట్రపతి భార్య జాకీ అనుమానంతో బయటపడింది. మన్రో జాన్ F. కెన్నెడీ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఆమె విషాద మరణం తర్వాత కెన్నెడీ చాలా రోజులు డిప్రెషన్ లో ఉండిపోయారు.

శశి థరూర్, సునంద పుష్కర్

శశి థరూర్, సునంద పుష్కర్

శశి థరూర్, సునంద పుష్కర్ ప్రేమ వ్యవహారం భారత మీడియాలో చాలా ఫేమస్ అయింది. కానీ సునంద హఠాన్మరణం ఈ రోజు వరకు మిస్టరీగానే ఉంది.

దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్

దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్

సన్నిహిత వర్గాల ప్రకారం మాజీ ఎంపీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆయన భార్య ఆశా మరణం తర్వాత కేవలం ఆరు నెలల్లోనే అమృత రాయ్ కి దగ్గర అయ్యారు. వారి వ్యవహారం మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్

అతను ఒక పనిమనిషితో సంబంధం పెట్టుకున్నాడు. అతను తన ఇంటిలో ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నందుకు విచారం వ్యక్తం చేసాడు. అతను చెప్పిన ఈ 'అవివేకమైన విషయం' కారణంగా అతని భార్య,పిల్లలకు విపరీతమైన బాధ కలిగిందని ఒప్పుకున్నాడు.

English summary

World's Greatest Political Love Affairs

World's Greatest Political Love Affairs.When we hear anything about politics, the only word that strikes our mind is dirty filthy politics the politicians play every single time.
Desktop Bottom Promotion