For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వివిధ రకాల కాఫీలు

By Derangula Mallikarjuna
|

కాఫీ (కెఫిన్)ఒక రోజువారి అవసరమయ్యే వ్యసనం. ఒత్తిడిలో ఉన్నప్పడు లేదా అలసినప్పుడు మీకు ఒక కప్పు కాఫీ త్రాగాలనుకుంటారు. మనస్సును తక్షణ మార్చే ఒక పానీయి. మరియు ఇది ఒక ఎనర్జీ బూస్టర్ వంటిది. కాఫీ గురించి చెప్పాలంటే, కాఫీ ఊదారంగులో ఉంటుంది. ఈ కాఫీ గింజలు, పింక్ కలర్ మొక్క నుండి పండేటివి. కాఫీ పండించే వివిధ ప్రాంతాలను బట్టి కాఫీ గింజల వివిధ రకాల్లో ఉంటాయి.

ఈ అన్నిరకాల కాఫీబీన్ ఒకే విధమైన కాఫీని చేయడానికి ఉపయోగిస్తారు . వస్తువులను ఉపయోగించే విధానాన్ని బట్టి కాఫీ టైప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ వస్తువులను కాఫీ మరింత రుచిగా మరియు సువాసన కలిగి ఉండటానికి ఉపయోగిస్తారు.

1.Espresso

1.Espresso

బ్లాక్ కాఫీని కాఫీ బీన్ ను ఉపయోగించి అధిక ప్రెజర్ స్టీమ్ లో తయారుచేస్తారు. ఇది అత్యంత ప్రసిద్ది చెందిన ఒక ప్రాధమిక కాఫీ రకం. ఎస్ప్రెస్సో కాఫీలో కేవలం నీరు మరియు కొద్దిగా చక్కెర మాత్రమే ఉంటుంది . బలమైన ఎస్ప్రెస్సో కాఫీకి చాలా తక్కువ నీరు మరియు దాదాపు చక్కెర లేకుండా ఉపయోగిస్తుంది; ఈ కాఫీ అధిక ప్రాధాన్యం కలిగినదిగా ఉంది .

2.Espresso Macchiato

2.Espresso Macchiato

ఎస్ప్రెస్సో కు కొద్దిగా ఉడికించిన పాలు కలుపడం వల్ల , మీరు ఎస్ప్రెస్సో మషియాటో గా పిలిచే ప్రసిద్ధ కాఫీ రకం చేయవచ్చు . Macchiato గురించి చెప్పుకోదగ్గది ఏం లేదు, ఇది ఒక ఎస్ప్రెస్సో రకాని చెందినదే , ఎస్ప్రెసో కాఫీని కొంచెం మాడిఫై చేశారు. ఎవరైతే స్ట్రాంగ్ కాఫీని ఇష్టపడరో, అటువంటి వారి ఈ కాఫిని ఎంపిక చేసుకోవచ్చు. మరియు మంచిది కూడా .

3.Cappuccino

3.Cappuccino

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ మరియు సాధారణంగా అందుబాటులో ఉండే కాఫీ, cappuccino కాఫీ. ఈ రకమైన కాఫీ ప్రతి కాఫీ షాప్ లోనూ అందుబాటులో ఉంది. ఇది ఎస్ప్రెస్సో కాఫీకి సమానంగా ఉంది , పాలు, పాల నురుగు ఉపయోగించి తయారుచేస్తారు . ఈ కాఫీకి చాక్లెట్ సిరఫ్ లేదా కాఫీ పౌడర్ తో అందంగా అలంకరించి అందిస్తారు.

4.Cafe Latte

4.Cafe Latte

ఈ రకం కాఫీ ఎస్ప్రెస్సో పరిమాణం కంటే మూడు రెట్టు పాలు ఉపయోగించి తయారు చేస్తారు . ఇది చూడటానికి మిల్కీగా ఉంటుంది మరియు పంచదార జోడించడం వల్ల ఒక మంచి డ్రింక్ గా కుక్కీస్ తో పాటు తీసుకోవచ్చు.

5. మోచా చినో:

5. మోచా చినో:

ఈ రకం కాఫీని కప్పుసినో కాఫీకి కోకోపౌడరన్ ను గణనీయంగా గా జోడించి తయారుచేస్తారు. ఈ కాఫీకి కోక సిరఫ్ లేదా కోకో పౌడర్ జోండించడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ ను అంధిస్తుంది. అలాగే క్రీమ్ కూడా గార్నిష్ చేసి అంధిస్తారు.

6. అమెరికా

6. అమెరికా

ఎస్ప్రెస్సో కాఫీకి అరకప్పు వేడి నీళ్ళు కలుపుతారు , చాలా కొద్దిగా పాలు మరియు పంచదార కలపడం వల్ల ఈ కాఫీ తయారవుతుంది. దీని పేరు 'అమెరికా నో' . అమెరికన్లు త్రాగడానికి ఇష్టపడే విధంగా ఎస్ప్రేస్సోను తయారుచేసి "అమెరికా నో" కాఫీ ఇవ్వబడుతుంది . ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఒక ప్రముఖ కాఫీ .

7. ఐరిష్ కాఫీ

7. ఐరిష్ కాఫీ

ప్రతి మూలలో కాఫీ కొట్లలలో అందుబాటులో ఉండే మరొక ప్రసిద్ధ కాఫీ . ఈ మంచి ఐరిష్ కాఫీ తయారుచేయడానికి ఒక ట్రిక్ ఏంటంటే , కాఫీని విస్కీ, ఎస్ప్రేసోస్సో, సుగర్ వేసి అంధిస్తారు.

8. ఇండియన్ ఫిల్టర్ కాఫీ

8. ఇండియన్ ఫిల్టర్ కాఫీ

ఈ విలక్షణమైన ఇండియన్ కాఫీని మన ఇండియాలో సౌత్ స్టేట్స్ లో తయారుచేయబడింది . ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ది చెందిన కాఫీ ఇది. ఈ కాఫీని ఎండిని కాఫీ గింజల పౌడర్, నీళ్ళు మరియు పాల మిశ్రమంతో తయారుచేస్తారు. ఇది ఇతర కాఫీ రకాల కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది

9. టర్కిష్ కాఫీ

9. టర్కిష్ కాఫీ

టర్కిష్ బీన్స్ ను బాగా ఎండబెట్టి మరియు మెత్తగా పౌడర్ చేస్తారు. ఈ పౌడర్ ను వేడినీళ్ళలో వేసి బాగా కరిగిన తర్వాత బాగా మరిగిచి తయారుచేస్తారు.కాఫీ రుచి నీటి ద్వారా విస్తరించింది మరియు పూర్తిగా సేకరిస్తారు . పిల్టర్ అయిన కాఫీకి కొద్దిగా పంచదార మిక్స్ చేసి తయారుచేస్తారు. ఈ టర్కిష్ కాఫీ నురుగనురగా ఉంటుంది.

10.White కాఫీ

10.White కాఫీ

ఈ ఫేమస్ కాఫీ ఒరిజినల్ గా మలేషియాలో పుట్టింది . ఈ కాఫీని బీన్ ను పామాయిల్ లో రోస్ట్ చేసి తర్వాత తయారుచేస్తారు . ఈ రకమైన కాఫీకి వెన్న తీసిన పాలు మరియు పంచదార వేస్తారు.

Story first published: Monday, December 2, 2013, 20:20 [IST]
Desktop Bottom Promotion