For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొగసుగా విమర్శించడానికి సాధారణ మార్గాలు

By Lakshmi Perumalla
|

మీరు ఎప్పుడైనా ఎవరినైనా సరిదిద్దటానికి సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించారా? వ్యక్తులను విమర్శించినప్పుడు వాటిని సరిదిద్దడానికి ఒక కళ ఉంటుంది. ఒక వ్యక్తీ కేవలం నేరుగా మరియు కరకుగా మాట్లాడటం ఎల్లప్పుడూ మంచిది కాదు. ఇది కేవలం అసూయ పడటం ద్వారా కలుగుతుంది. ప్రత్యేకించి కార్పొరేట్ ప్రపంచంలో విమర్శించటానికి ఒక సరైన మార్గం ఉండాలి. మీరు విమర్శించే సమయంలో అణుకువ మరియు మర్యాద కలిగి ఉండాలి.

మొదట మీరు విమర్శించడానికి జాగ్రత్త అవసరం. తరువాత మొత్తం పరిస్థితి మరియు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఒక మంచి విమర్శకుడు అవ్వాలంటే చాలా కష్టం అని చెప్పవచ్చు. ఇక్కడ ఎవరి మనోభావాలు లేదా భావోద్వేగాలు దెబ్బతీయకుండా సొగసుగా విమర్శించడానికి సాధారణ మార్గాలు ఉన్నాయి. సొగసుగా విమర్శించడానికి ఉన్న సాధారణ మార్గాల్లో కొన్ని ఈ క్రింద చర్చించబడ్డాయి: -

Simple ways to criticise gracefully

1. మర్యాదపూర్వకంగా ఉండండి
విమర్శలను స్వీకరించినప్పుడు అవి ఎప్పుడు కఠినముగా మరియు మొరటుగా ఉంటాయి. దాని ఫలితంగా వ్యతిరేక వ్యక్తికి చెరుపుట మరియు నిరుత్సాహపరచడం అనే భావన కలిగించటం కూడా మంచి పద్దతి కాదు. దానికి బదులుగా మర్యాద మరియు నిగూఢమైన పదాలు ఉపయోగించి విమర్శించవచ్చు. అప్పుడు ఆ వ్యక్తీ వ్యాఖ్యలు సానుకూల దృక్పదంతో ఉంటాయి. అంతేకాక వారి లోపాలను కూడా సరిచేయవచ్చు. మృదువైన పదాలు కూడా మెరుగైన పనితీరు కొరకు ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తాయి.

2. పరిస్థితిని అర్థం చేసుకోండి
ఎవరినైనా విమర్శించటానికి ముందు పని దాఖలు మరియు పరిస్థితిని విశ్లేషించాలి. కొన్నిసార్లు ఇది పూర్తిగా లేదా సంతృప్తికరంగా ఉండదు. ఈ సమయంలో సొగసుగా విమర్శించడంను ఒక సాధారణ మార్గంగా ఉపయోగించవచ్చు. అంతేకాక పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్తులో ఏ తప్పులు జరగకుండా నివారించేందుకు ఏమి చేయాలో వివరించండి.

3. ఊహలు
మీరు ఒక మంచి మరియు కరుణ రసాత్మక విమర్శకుడుగా ఉండాలని అనుకుంటే మొదటి విషయం ఏమిటంటే మీరు అనుసరించడానికి ఎప్పుడూ ఊహలు ఉండకూడదు. విమర్శలు నిరాధారమైన మరియు నిస్సారంగా ఎప్పటికీ ఉండకూడదు. ప్రతి పని వెనుక సంబంధిత కారణం మీద విమర్శలు లేదా వ్యాఖ్యానాలు ఉండాలి. ఒక చెడు విమర్శకుడు కరకుగా మరియు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తాడు. కాబట్టి ఏదైనా ఊహిస్తూ మరియు మంచి పనిని విమర్శించటానికి ముందు మీరు వాస్తవాలను తప్పకుండా అధ్యయనం చేయాలి.

4. డైరెక్ట్ గా చెప్పటం
కొంత మంది పనిని నేరుగా విమర్శించడం అనేది సాదారణ మార్గంగా చెప్పవచ్చు. మీ విమర్శలను వ్యతిరేక వ్యక్తి ఎక్కువ కంగారు మరియు మరింత సంక్లిష్టంగా భావిస్తారు. ఎవరైనా పనిని వ్యాఖ్యానిస్తూ మరియు విమర్శ చేసినప్పుడు ఎల్లప్పుడూ నేరుగా ఉండాలి. కానీ మీరు విమర్శించడం కూడా చాలా కరుకుగా మరియు కఠినముగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విమర్శ ఎప్పుడూ నిర్మాణాత్మక మరియు సృజనాత్మకంగా ఉండి ఇతరులను కష్టపెట్టకుండా ఉండేలా చూసుకోవాలి. దీనిని అందరు సానుకూలంగా తీసుకోకపోవచ్చు.

5. రెండు వైపులా చెప్పాలి
విమర్శ ఎప్పుడూ ప్రశంస రూపంలో ఉండాలి. మీరు ఒక ఆర్టికల్ మీద విమర్శ చేయవలసి వచ్చినప్పుడు మీరు ప్రతికూల పాయింట్లు మరియు వ్యాసంలో సానుకూల పాయింట్లు రెండింటిని పేర్కొనాలి. ఇది సొగసుగా విమర్శించడానికి చాలా సులభమైన మార్గం. మీ విమర్శ భవిష్యత్తులో వాటి పని నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు ఖచ్చితంగా విశ్వాసం పెంచడానికి ఉంటుంది. కాబట్టి మీ విమర్శలు ప్రతికూలముగా ఉండకూడదు. విమర్శలను మరియు ప్రశంసలను పరిపూర్ణ సమ్మేళనంగా బ్యాలెన్స్ చేయండి.

ఒక మంచి మరియు కరుణ రసాత్మక విమర్శకు కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. ఒక విమర్శకుడు ఎప్పుడూ మంచి అవగాహన కలిగి ఉండాలి. ఒక విమర్శకుడు యొక్క ఉద్యోగం ఎవరైనా చేసిన తప్పులను ఎత్తి చూపటం మాత్రం కాదు. ఒక విమర్శకుడు ఆ వ్యక్తి తన చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ఉండేలా చేయగలగాలి. ఒక విమర్శకుడు కేవలం ఆమోదయోగ్యమైన పనిని చేసి అవసరమైన ముగింపు చేస్తాడు. విమర్శలను ఎప్పుడు వినయంగా మరియు సొగసుగా చేయాలి.

English summary

Simple ways to criticise gracefully

Have you ever felt the need to correct somebody or give advice? There is an art of criticising people and correcting them. Just being blunt and direct is not always appreciable by the persson at the other end.
Story first published: Saturday, December 7, 2013, 14:39 [IST]
Desktop Bottom Promotion