For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నెలవారి జీతంను నిర్వహించడానికి 5 చిట్కాలు

By Super
|

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇల్లు నడవడానికి బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆర్థిక విషయాలపై సరైన అవహనతో అలాగే ఇంటి అవసరాలపై కొంచెం కంట్రోల్ తో ప్రణాళికను రుపొందించుకుంటే ఇబ్బందులుండవు.

ఇల్లు నడపడమనేది సాముహిక ప్రయత్నం. సేవింగ్స్ గురించి ఆలోచించేటప్పుడు మీ ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలి. ఖర్చులను గుర్తుంచుకోవాలి. మీ బడ్జెట్ ను ఏ విధంగా ప్లాన్ చేయాలో కొన్ని టిప్స్ చూడండి.

5 tips to manage your monthly budget

1. ఏటీఎం నుంచి శాలరీని విత్ డ్రా చేసేటప్పుడు ఆ నెలకు కావాల్సిన ముఖ్యమైన అవసరాల జాబితాను రూపొందించుకోవాలి. హోం లోన్స్ ఈఎంఐలతో పాటు ఇతర పెట్టుబడులేవైనా ఉంటే వాటిని కూడా ఆ జాబితాలో చేర్చాలి.

2. ఖర్చులు పోనూ కొంత డబ్బును మీ వద్ద అదనంగా ఉంచుకోండి. కనీసం రూ.500 అయినా అదనంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేటప్పుడు మీ వద్ద కొంచెం సొమ్ము ఉండేలా చూసుకోండి.

3. పిల్లల ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యతనివ్వండి. అదే సమయంలో మీ ఖర్చులకు కూడా ప్రాధాన్యతనివ్వండి.

4. మార్కెట్ లోని ఆఫర్స్ కు ఎక్కువగా టెంప్ట్ కాకుండా ప్రయత్నించండి. మీకు నిజంగా ఏదైనా ప్రోడక్ట్ అవసరం లేకపోతే విండో షాపింగ్ తో తృప్తి పడండి.

5. ఎక్కడికైనా వెళ్ళాలని మీరు ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. తద్వారా అప్పటికప్పుడు బుక్ చేసుకోవడంవల్ల పడే అదనపు ఖర్చును మిగుల్చుకున్నవారవుతారు.

Story first published: Saturday, December 13, 2014, 17:48 [IST]
Desktop Bottom Promotion