For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవి నవరాత్రి సెలబ్రేషన్స్ కు అవసరం అయ్యే కొన్ని పదార్థాలు

|

దసరా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుండి ఘనంగా ప్రారంభము కానున్నాయి. తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.

నవరాత్రులు ఒక్కో రోజు.. ఒక్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి. మరి ఈ దేవీ నవరాత్రులు ప్రారంభ కాకముందే మీ వంటగదిలో ఈ వస్తువులన్నీ ఉన్నాయో లేదా ఒక సారి చెక్ చేసుకోండి. తొమ్మిది రోజుల పాటు అనుసరించే ఉపవాస దీక్షలకోసం మీకు ఖచ్చితంగా కొన్ని పదార్థలు అవసరం అవుతాయి. అలాగే నవరాత్రి రోజుల్లో పూజ చేయడానికి కూడా ఇవి అవసరం అవుతాయి. దుర్గాదేవీ ఒక్కోరోజూ ఒక్కోరూంలో మన పూజించేటప్పుడు, ప్రతి రోజూ డిఫరెంట్ గా నైవేద్యం కూడా పెట్టాల్సి వస్తుంది. అయితే మనకు ఈ తొమ్మిది రోజులకు అవసరం అయ్యే 9వంటగది పదార్థాలను ఈరోజే సమకూర్చుకోండి. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం..

కుట్టూక అట్ట

కుట్టూక అట్ట

నవరాత్రికి మీరు ఉపవాస దీక్షలు చేస్తున్నట్లైతే ఇది ఖచ్చితంగా మీకు అవసరం అవుతుంది. ఉపవాసం ఉండే వారు రోజులో ఒక్క సారి మాత్రమే అదీ అల్పాహారాన్ని తీసుకుంటారు. అందుకు గోధుమ పిండితో తయారుచేసే కుట్టు అనే అల్పాహారంతో ఉపవాసం తీర్చుకుంటారు. అందుకు తప్పనిసరిగా గోధుమ పిండి అవసరం అవుతుంది.

రాక్ సాల్ట్

రాక్ సాల్ట్

నవరాత్రి ఫెస్టివల్ 9 రోజుల పాటు ఉపవాసం ఉండే వారు కొంత మంది వెజిటేరియన్ డైట్ కు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. అలాంటి వారు తయారుచేసుకొనే వంటల్లో రాక్ సాల్ట్ ను ఉపయోగించాలి.

బ్లాక్ లేదా బ్రౌన శెనగలు

బ్లాక్ లేదా బ్రౌన శెనగలు

నవరాత్రి పండుగ పర్వదినాలను మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లైతే, అందులోనూ కుమారి పూజకు మీకు తప్పనిసరిగా బ్లాక్ గ్రామ్ అవసరం అవుతుంది. కుమారి పూజకు వీటితో స్పెషల్ గా నైవేద్యం తయారుచేసి దేవికి సమర్పిస్తారు.

వ్రతానికి అవసరం అయ్యే బియ్యం

వ్రతానికి అవసరం అయ్యే బియ్యం

నవరాత్రి వ్రతాలు చేసేవారి కోసమని, కొన్ని ప్రత్యేకమైన బియ్యం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపవాసం ఉన్నవారు వండుకొని తింటారు. నార్మల్ రైస్ కంటే ఈ బియ్యం(వ్రత్ కా చావల్) నవరాత్రుల్లో తీసుకుంటారు.

సింగార్ క అట్ట

సింగార్ క అట్ట

గోధుమ పిండి కాకుండా, మరో విధమైన పిండి కూడా నవరాత్రి పండుగ పర్వదినాల్లో ఉపయోగిస్తారు. దీన్ని సింగార్ క అట్ట అనిపిలుస్తారు. ఈ పిండి ఉపయోగించే ఫాస్టింగ్ రిసిపిలను తయారుచేస్తారు.

సాబుదాన(సగ్గుబియ్యం)

సాబుదాన(సగ్గుబియ్యం)

నవరాత్రులకు ఉపవాసం ఉండే వారు తీసుకొనే మరో ఆహార పదార్థం సగ్గుబియ్యం. అంతే కాదు, ఈ సగ్గుబియ్యంతో వడ, కట్ లెట్, మరియు కిచిడి వంటివి తయారుచేస్తారు. కాబట్టి, వీటిని నిల్వచేసుకోవడం అవసరం.

వేరుశెనగలు

వేరుశెనగలు

నవరాత్రి సెలబ్రేట్ చేసుకొనే వారు, ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే వంటల్లో ఎక్కువగా వేరుశెనగలను కూడా వినియోగిస్తారు. ముఖ్యంగా కట్ లెట్, ఉప్మా లేదా కిచిడికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి, వీటిని కూడా నిల్వ చేసుకోవాలి.

చిప్స్ లేదా మిక్చర్:

చిప్స్ లేదా మిక్చర్:

వత్రం చేసే రోజుల్లో స్పెషల్ గా ఉప్పు లేకుండా తయారుచేసే మిక్చర్ లేదా చిప్స్ వంటివి తీసుకుంటారు. కాబట్టి, వీటిని కూడా తీసుకొచ్చి నిల్వ చేసుకోవచ్చు.

కోవా

కోవా

కోవా చాలా ఉపయోగకరమైన పదార్థం. నవరాత్రి సమయంలో ఇది ఎక్కువగా అసవరం అవుతుంది . కోవ ఉపయోగించే వివిధ రకాల స్వీట్స్ ను తయారుచేస్తారు కాబట్టి, కోవ తప్పనిసరిగా అవసరం అవుతుంది.

English summary

9 Things You Need To Buy For Navratri


 Before the 9 days long festivities start, you must have the things needed for Navratri in your kitchen. If you follow the nine days of Navratri fast religiously, then you should ideally have certain ingredients while cooking. You also need the things required for Navratri Puja quickly. If you are devout follower of Goddess Durga, then stock on these ingredients quickly.
Story first published: Wednesday, September 24, 2014, 18:23 [IST]
Desktop Bottom Promotion