For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజంగా ఎడమచేతివాటం వారు మేధావులని భావిస్తారా?

|

ఎడమచేతి వాటం వాళ్ళు నిజంగా మేధావులా అన్న విషయం మీద అనేక పరిశోధనలు జరిగాయి. ఎడమచేతి వాటంవాళ్ళు వాళ్ళ ఎదమచేతితోనే వంట , వ్యక్తిగతమైన పనులను మరియు ఇంకా అనేక కార్యకలాపాలను కూడా చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఎడమచేతివాటంవారు వ్రాయటానికి తమ కుడి చేతిని ఉపయోగిస్తుంటారు..

ఒక వ్యక్తి కుడిచేయి కంటే, తన ఎడమచేయి ఎక్కువగా ఉపయోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. యుద్దవీరులు వారి గుండెను రక్షించుకోవడానికి ఎడమవైపు రక్షణకవచాన్ని ఉపయోగిస్తారు. మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జనాభాలో పోరాడేవారిలో అత్యధికంగా కుడిచేతివాటం వారికన్నా ఎడమచేతివాటంవారు ఎక్కువగా ఉన్నారు.

ఒక సిద్ధాంతం ప్రకారం పుట్టకముందు టెస్టోస్టెరోన్ అధిక రెట్లు బహిర్గతం అవటం వలన పిల్లలలో ఎడమచేతివాటం ఉంటుంది. పిల్లల జన్మించేపుడు కలిగే ఒత్తిడి మరొక కారణం. తల్లులు సాధారణం కంటే ఎక్కువ అల్ట్రాసౌండ్లు చేయించుకోవటం కూడా కారణం అని.పరిశోధనలు చెపుతున్నాయి.

Are Left Handers Geniuses?

ఎడమచేతివాటం వారి సంఖ్య, కుడిచేతివాటం వారితో పోలిస్తే చాలా తక్కువ ఎందుకంటే ప్రపంచంలో కుడిచేతివాటం వారికి అనుకూలంగా అవకాశాలు, సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. కత్తెర వంటి చిన్న వస్తువులు కూడా కుడిచేతివాటం వారికోసం రూపొందించబడ్డాయి. ఎడమచేతివాటం వారు ఇన్ని అసౌకర్యాలు ఉన్నా, వారు మేధావులుగా కీర్తింపబడటానికి గల కారణాలను క్రింద వివరిస్తున్నాము.

1.మంచి జ్ఞాపకశక్తి
ఎడమచేతివాటం వారిలో మెదడు యొక్క రెండు అర్ధగోళాలు కలిపే ఒక పెద్ద కార్పస్ కాల్లోసుం ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. చూపించడానికి. ఈ ప్రాంతంలో అంతా మెమొరీ నిల్వచేసి ఉంటుంది. ఈ రకమైన మెమరీ ఉన్నవారిలో ప్రధానమైన సమస్య ఏమిటంటే వీరు తాళాలు ఎక్కడ పెట్టారో గుర్తు ఉండదు కాని రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తేదీలు గుర్తుంటాయి.

2.గణిత సామర్థ్యం
అనేక భిన్న అధ్యయనాలు ఉన్నప్పటికీ, చాలా పరిశోధనలు ఎడమచేతి మేధావికి మరియు అధిక గణిత సామర్థ్యం మధ్య సంబంధం ఉన్నదని చెపుతున్నాయి. ఈ వ్యక్తులకు, నిర్దిష్ట ప్రాంతాల్లో జ్ఞానం జతచేయబడి ఉంటుంది.. వీరియొక్క దృశ్య అంతరాళ నైపుణ్యాలు కూడా ఎక్కువే.

3.ఇంటెలెక్చువల్ జీనియస్
ఎడమచేతివాటం వారిలో ప్రముఖులు మరియు మేధావుల జాబితా చాలా పెద్దదిగానే ఉన్నది. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ మొదలైన వారందరూ ఎడమచేతివాటం వారే. ఈ మేధావులు ఎడమచేతివాటంతో ఎలా అనుసంధానమయ్యారో స్పష్టంగా తెలీదు, కాని అయినట్లుగా కనపడుతున్నది.

4.సంపాదన
వింత విషయం ఏమిటంటే, ఎడమచేతివాటం పురుషులు, కళాశాల విద్యాభ్యాసం చేసినవారు, కుడిచేతివాటం పురుషులు,వారి సహచరుల కంటే సుమారు 15 శాతం ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ వాస్తవం, అదే విద్య మరియు ర్యాంకింగ్ తో కలిసి పని చేసిన వారికి కూడా వర్తిస్తుంది. అయితే, ఈ వేతన వ్యత్యాసం మహిళలకు వర్తించదు. ఈ విషయంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

5.అధిక సృజనాత్మకత
ఒక సిద్ధాంతం ప్రకారం, ఎడమచేతివాటం వారి మెదడు భిన్నంగా పని చేస్తుంటుంది మరియు అందుకే వారిలో కుడిచేతివాటం వారికంటే ఎక్కువ సృజనాత్మకత ఉంటుంది. మీరు మీ ఎడమ చేతిని ఉపయోగించినప్పుడు, మీరు సృజనాత్మకత కోసం ఉపయోగించే మెదడు కుడి వైపు ఉపయోగిస్తున్నారని చెపుతున్నారు.

English summary

Are Left Handers Geniuses?

A lot of research has been done to understand if left handers are true geniuses. A left hander is a person who uses his left hand for his personal care, cooking and many more activities. However, in some cases, left handers use their right hand to write.
Story first published: Tuesday, October 21, 2014, 19:25 [IST]
Desktop Bottom Promotion