For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపానవాయువు సమస్య నివారణ ఎలా ?

By Mallikajuna
|

సహజంగా చాలా మంది ఉన్న ప్రదేశంలో మీరు గట్టిగా అపానవాయువును వదిలాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా మరియు ఏప్రదేశంలో అయినా ఎదురయ్యే సమస్య ఇది. ఇది ప్రక్రుతి సహజం. ఇది ఒక ముఖ్యమైన బిజినెస్ మీటిలో జరగవచ్చు లేదా ఒక డేటింగ్ సమయంలో జరగవచ్చు. బహిరంగ ప్రదేశంలో అందరిలో ఉన్నప్పుడు ఇలా అపానవాయువు వదిలినప్పుడు చాలా అవమానకరంగా ఉంటుంది. అటువంటి సందవర్భల్లో ఆప్రదేశంలో ఉన్నవారు ముఖం ఒకలాగా పెట్టుకోవడం వల్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. వెంటనే తాజాగాలికోసం చూస్తారు. లేదా బయటకు వెళుతారు.

అపానవాయు అలా రావడానికి కూడా అనేక కారణాలున్నాయి. అందులో జీర్ణక్రియ సరిగా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మరియు లిమిట్ లేకుండా తినడం వల్ల కొన్ని సందర్బాల్లో ఇలా జరగుతుంటుంది. అపానం చెడు అయినా కూడా, అది కావాలని, ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు. ఇది ఒక నేచురల్ విషయం, కాబట్టి దీన్ని నియంత్రించడం కూడా కొంచెం కష్టం. అయితే కొన్ని అపానవాయుకువు నివారించేందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి.

how to stop farting

1. షుగర్ ఫుడ్స్: షుగర్ ఫుడ్స్. పంచదారతో తయారుచేసిన ఆహారాలో అకాల సందర్భాల్లో అపానవాయు ఉత్పన్నం అవ్వడానికి గురిచేస్తుంది . అపానవాయువు నివారించడానికి ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్నప్పుడు నివారించడానికి షుగర్ తో తయారుచేసిన ఆహారాలను తగ్గించాలి . షురగ్ బ్యాక్టీరియాను చాలా సులభంగా బ్రేక్ చేసి, చెడు వాసన వచ్చేలా చేస్తుంది. కాబట్టి, షురగ్ కంటెంట్ ఉన్న పదార్థాలను తినడం తగ్గించండి . ఏవైనా ముఖ్యమైన ప్రజా కార్యక్రమాలకు హాజరయ్యే ముందు చక్కెర తినడం నివారించండి.

2.కార్బోహైడ్రేట్స్: బ్యాక్టీరియా జీర్ణం అయ్యేప్పుడు పిండిపదార్థలు కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ ఫౌల్ స్మెల్ కలిగి ఉండి, అది బయటకు వచ్చేటప్పుడు ఒక శబ్దాన్ని చేస్తుంది . దీన్ని నివారించాలంటే, కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి. కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ లో గ్యాస్ ఉత్ప్రేతి లక్షణాలు ఉంటాయి . మరియు చెడు అపానవాయకు సోడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి సోడా మరియు ఫిజ్ ఫిల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.

3. స్ట్రార్చ్: స్టార్చ్ నిండిన ఆహారాలు అంటే బంగాళదుంపలు, గింజలు వంటి స్టార్చ్ కలిగిన ఆహారాలను తినడం వల్ల అపానవాయుకు ఉత్పత్తికి కారణం అవుతుంది. కాబట్టి అటువంటి ఆహారాలను తినడం నివరించండి . ముఖ్యంగా ఏవైనా కార్యక్రమాలకు మరియు నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆహారాలను తినడం మానేయండి. అన్నం ముక్యంగా ఇది కూడా కడుపులో గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ప్రధానకారణంగా ఉంది . కాబట్టి మీకు కడుపు ఉబ్బరం సమస్యలున్నప్పుడు అన్నం తినడం మానేయండి.

4. ధూమపానం: - ధూమపానం మీరు అపానవాయువుకు కారణమయ్యే అంశాల్లో ఒకటి . అపానవాయువు సమస్యతో పాటు, ధూమపానం వల్ల ఆరోగ్యపరంగా మరికొన్ని ఇతర చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. అందువల్ల, ఆరోగ్య సలహా ప్రకారం, ధూమపానం నిలిపివేయడం ఆరోగ్యానికి క్షేమం. ధూమపానం వల్ల కడుపులో అనవసరంగా గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది . దాంతో చెడు అపానవాయువు విడుదల చేస్తుంది . కాబట్టి, సాధ్యమైనంత వరకూ స్మోకింగ్ ను నిపివేయండి.

5.యాంటీ బ్లోటింగ్ మెడిసిన్స్: కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకునేందుకు అనేక సిరప్స్, పిల్స్ మరియు పౌడర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి . అవి కడుపులు నిండి ఉన్నా గ్యాస్ మొత్తంను తొలగించడానికి సహాయపడుతుంది . ఈ మందులు చాలా ఉపయోగకరం మరియు వీటిని ఎప్పుడు దగ్గర ఉంచుకోవడం వల్ల ఎప్పటికప్పుడు సమస్యను నివారించుకోవచ్చు.

English summary

how to stop farting

It is one embarrassing moment if you fart aloud at a place filled with many people. This is one situation that can happen to anybody and anywhere. This can happen in a important business meeting as well as a romantic date.
Story first published: Thursday, January 23, 2014, 18:19 [IST]
Desktop Bottom Promotion