For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయ స్త్రీలు ఒంటరిగా ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలు

|

ఒంటరిగా ఉన్న భారతీయ స్త్రీ యొక్క పోరాటాలను సాధారణ పురుషుడు అర్థం చేసుకోవటం లేదు, కనీసం పట్టించుకోవటం లేదు. భారత దేశంలో స్త్రీకి అనేక అనుకూలతలు ఉన్నా, ఆమె ఎదుర్కునే అననుకూలతలు లెక్కలేని సంఖ్యలో ఉండటం వలన ఆ అనుకూలతలను స్వాగతించలేకపోతున్నది. ఆమె భారతీయ స్త్రీ అయి ఉన్నందున అననుకూలతలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఆమె రాత్రిపూట అనుమతి లేనిదే బయటికి వెళ్ళకూడదు. ఆమెకు స్వతంత్రంగా ప్రయాణించే అనుమతి లేదు. భారతీయ స్త్రీ స్వతంత్రంగా తను కోరుకున్న పురుషుడిని పెళ్ళాడటానికి అనుమతి లేదు, జీవితభాగస్వామిని కూడా వారే నిర్ణయిస్తారు.

ఇది ఒక్కటే కాదు, ఇటువంటివి అనేకమైన ప్రతికూలతలను ఒంటరి భారతీయ స్త్రీ ఎదుర్కుంటున్నది. ఒక స్త్రీ భారదేశంలో ప్రతిరోజూ ఎదుర్కునే సవాళ్ళను నిశితంగా గమనించినప్పుడు, మీలోని ఎముకలు కూడా షాక్ కు గురవుతాయి.

భారతీయ మహిళల యొక్క టాప్ 10 బ్యూటీ సీక్రెట్స్: క్లిక్ చేయండి

భారతదేశంలోని విద్యావంతులు మరియు చాలా మేధావులు అయిన పురుషులు వారి జీవితానికి సంబంధించిన స్త్రీల పట్ల విచక్షణతో వ్యవహరిస్తారని చెప్పనవసరం లేదు. వీరే కొంతమంది స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేట్లుగా మరియు ఒకరకమైన భయాన్ని వారిలో కలిగిస్తారు. ఇక్కడ స్త్రీలు ఎదుర్కునే కొన్ని సమస్యలను ఇస్తున్నాము. వీటిని చదివి ఆ బాధ అంటే ఏమిటో తెలుసుకోండి.

ప్రేమించటం ఒక పాపం


భారతదేశంలో స్త్రీలు తాము ప్రేమించినవారిని పెళ్ళాడటం అన్నది చాలా అరుదైన విషయం. విశాల హృదయం ఉన్న కుటుంబాల్లో మరియు వారి కుటుంబాల్లో అంతక్రితమే ప్రేమవివాహాలు జరిగి ఉంటే, ఆ కుటుంబాలు మాత్రం ప్రేమవివాహాలకు అనుమతినిస్తున్నాయి. ఏదిఏమైనా, భారతీయ స్త్రీలకు వారి పెద్దవారు ఎంపిక చేసిన వారిని పెళ్ళాడటం తప్ప ఇంకో ఎంపిక చేసుకోవటానికి అవకాశం లేదు.

నగరంలో ప్రయాణించటం ఒక బాధ

ఒంటరిగా ఒక భారతీయ మహిళ ప్రయాణం చేయటం అన్నది చాలా పెద్ద బాధ. ఒంటరిగా ప్రయాణం చేయటం ఆమెకు చాలా బాధాకరం మరియు అపాయకరం కూడా. తెలిసిన ఒక పురుషుడితో ప్రయాణం చేస్తే, అది చాలా పెద్ద తప్పు. ఒక భారతీయ మహిళా ఎదుర్కునే సమస్యలలో ఇది ఒకటి.

ఆమెకు యుక్త వయస్సు దాటిపోతే


ఆమెకు యుక్త వయస్సు దాటిపోతే, దేవుడు కూడా అసహ్యించుకుంటాడు. ఆమెను ఒక అసమర్థురాలిగా పరిగనిస్తారు మరియు ఒక అంటరానిదానిలాగా చూస్తారు. యుక్తవయసు దాటటం మరియు ఇంకా పెళ్ళికూతురు కాలేకపోవటం వంటివి భారతీయ మహిళ ఎదుర్కునే సమస్యలలో ఒకటి.

కన్య కాదా?


మొదటి రాత్రి వధువుకు బ్లీడింగ్ కనపడకపోతే దేవుడు కూడా ఆమెను అసహ్యించుకుంటాడు. వధువుకు మొదటి రాత్రి బ్లీడింగ్ అవకపోతే, ఆమెను క్రొత్త కుటుంబం స్వీకరించదు. యోని మీది సన్నని పొర గురించి వాస్తవాలను చదివి అప్పుడు మహిళ యొక్క కన్నెరికం గురించి నిర్ణయానికి రండి.


ఆమె కళ్ళఅద్దాలు ధరిస్తుంటే


స్టీలు ఎవరు కళ్ళ అద్దాలు ధరిస్తారో వారిని చాలా చిన్నచూపుతో చూస్తారు. ఆమెను చాలా అసహ్యంగా మరియు వధువుగా అర్హత లేని స్త్రీలాగా పరిగణిస్తారు. స్త్రీలు ఎవరైతే ఒంటరివారో మరియు ఎవరు అద్దాలు ధరిస్తారో, వారు ఈ బాధను అర్థం చేసుకోగలరు మరియు ఒక భారతీయ మహిళగా ఈ ప్రతికూలత ఎలా ఉంటుందో వారు బాగా అర్థం చేసుకోగలరు.


శరీర రంగు


తెల్లగా ఉన్న తమ కొడుక్కు వధువును వెతుకుతున్న తల్లితండ్రులకు ఈ 'రంగు' అన్న విషయాన్ని చాలా పరిగణలోకి తీసుకుంటారు. వధువు తెల్లగా లేకపోయినట్లయితే, ఆమెను వారి దృష్టిలో నుండి తొలగిస్తారు. ఇది ఒక రకమైన అపరిపక్వత, మీరూ ఏకీభవిస్తారు కదూ! చెప్పాలనుకున్న వాస్తవం ఏమిటంటే, భారతీయ స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలలో ఇది చాలా పెద్దది.

ఆమె డ్రింక్ చేస్తునట్లయితే

The struggles of a single Indian woman

ఒక భారతీయ మహిళ త్రాగకూడదు,ధూమపానం చేయకూడదు, రిసార్ట్స్ కు వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు మరియు మొత్తానికి ఆమె జీవితమంతా 'కూడదు' అన్న పదంతో నిండి ఉన్నది. ఒక చిన్న గమనిక - ఎప్పుడైనా మీకు మూలాన నిలబడి స్మోక్ చేస్తున్న స్త్రీ కనపడితే, ఆమెను చుట్టూరా గమనిస్తున్న వారిని లెక్క పెట్టండి. మీరు దిగ్భ్రాంతి చెందుతారు.

English summary

The struggles of a single Indian woman


 The struggles of a single Indian woman is not at all understood by the common man, leave alone the modern man. Women in India have a lot of advantages before them but are faced with a great number of disadvantages since they are not allowed to welcome the good side of life.
Desktop Bottom Promotion