For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలకూ పీరియడ్స్ ఉంటే!!!

By Super
|

నెల నెలా అమ్మాయిలను పలకరించే పీరియడ్స్ అబ్బాయిలకు గనక ఉంటే అనే కొంటె ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఆర్టికల్. పీరియడ్స్ లో అమ్మాయిలు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఈ పీరియడ్స్ గనక అబ్బాయిలకు ఉంటే వాళ్ళెలా ప్రవర్తిస్తారో తలచుకుంటేనే కొంచెం ఆశ్చర్యమేస్తుంది. అబ్బాయిలు, మీకే పీరియడ్స్ ఉంటే ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు?

అమ్మాయిల విషయానికి వస్తే పీరియడ్స్ రోజుల్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది. చికాకు కలుగుతుంది. పొత్తి కడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్, బ్లోటెడ్ స్టమక్ ఇవన్నీ ఇరిటేట్ చేస్తాయి. మరి అబ్బాయిలకి పీరియడ్స్ ఉండుంటే వారెలా ప్రవర్తిస్తారు. అప్పటికైనా కచ్చితంగా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు.

ఈ రోజు, బోల్డ్ స్కై మీతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటోంది. అబ్బాయిలకే గనక పీరియడ్స్ వస్తే వాళ్ళెలా ప్రవర్తిస్తారు? బ్లీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే కచ్చితంగా వారు నరకాన్ని చూసినంతగా రియాక్ట్ అవడం ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు.

1. అర్థం చేసుకుంటారు

1. అర్థం చేసుకుంటారు

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే అమ్మాయిలను బాగా అర్థం చేసుకుంటారు. పీరియడ్స్ లో అమ్మాయిలు పడే వేదనని గుర్తిస్తారు. ఆ రోజుల్లో అమ్మాయిల అసౌకర్యాన్ని అర్థం చేసుకుంటారు. నొప్పితో కూడా అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉద్యోగంతో పాటు ఇంటి నిర్వహణ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకపోవడాన్ని అర్థం చేసుకుంటారు. తగిన సహకారం అందిస్తారు.

2. హ్యాండిల్ చేయలేరు

2. హ్యాండిల్ చేయలేరు

ఇది ముమ్మాటికీ నిజం. అబ్బాయిలకి పీరియడ్స్ వస్తే వారు ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేరు. ప్రతి నెల మహిళలను పలకరిస్తున్న చుట్టం అబ్బాయిలకు ఎదురైతే కచ్చితంగా ఆ పరిస్థితిని వారు హ్యాండిల్ చేయలేరు.

3. ఎన్నో సాకులు

3. ఎన్నో సాకులు

అబ్బాయిలకే గనక పీరియడ్స్ వస్తే ఎన్నో సాకులు చెప్పడానికి ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుంటారు. ఈ ఆర్టికల్ చదువుతున్న అమ్మాయిలకు అబ్బాయిలకి పీరియడ్స్ వస్తే అనే టాపిక్ కొంచెం థ్రిల్ గా ఉండి ఉంటుంది.

4.మూడ్ స్వింగ్స్

4.మూడ్ స్వింగ్స్

మూడ్ స్వింగ్స్ ను మహిళలు హ్యాండిల్ చేసినంత బాగా పురుషులు హ్యాండిల్ చేయలేరు. పీరియడ్స్ తో పాటు వచ్చే మూడ్ స్వింగ్స్ ని కచ్చితంగా హ్యండీల్ చేయడంలో ఇబ్బంది పడతారు.

5.పరుషంగా ఉంటారు.

5.పరుషంగా ఉంటారు.

పీరియడ్స్ నాడు వచ్చే మూడ్ స్వింగ్స్, నొప్పి తదితర అసౌకర్యాలను తట్టుకునే శక్తి, ధీమా పురుషులలో ఉండదు. అవి తట్టుకోలేక పరుషంగా మాట్లాడతారు. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే వారి ప్రవర్తన తీరులో వచ్చే ప్రధాన మార్పిదే.

6. ప్రశంసల జల్లు

6. ప్రశంసల జల్లు

పీరియడ్స్ వస్తే దాని ద్వారా వచ్చే అసౌకర్యాలను భరిస్తున్నందుకు వారు కాంప్లిమెంట్స్ కోరుకుంటారు. ప్రతి నెల బ్లీడింగ్ ను తట్టుకోవడానికి ప్రశంసల జల్లును ఆకాంక్షిస్తారు.

7.శృంగారం

7.శృంగారం

ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. పీరియడ్స్ లో ఉన్న భార్యను శృంగారం కోసం పీడించే పురుషులు కూడా ఉన్నారు. అయితే, ఇదే పరిస్థితి వారికి ఎదురైతే భార్య నుంచి తప్పించుకు తిరుగుతారు. అబ్బాయిలూ..నిజమేనా?

8. హత్తుకుపోతారు

8. హత్తుకుపోతారు

పురుషులకు తరచుగా పీరియడ్స్ వస్తూ ఉంటే వారు మహిళలతో ఎక్కువగా హత్తుకుపోతారు. రాను రాను వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం బలపడుతుంది. లేడీస్, ఈ విషయంతో ఏకీభవిస్తారా?

9.అసహనం

9.అసహనం

ఒకవేళ పీరియడ్స్ అబ్బాయిలను పలకరిస్తే వారు కచ్చితంగా సగం రోజులు ఏడుపుతోనే గడిపేస్తారు. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే కచ్చితంగా పీరియడ్స్ ద్వారా వచ్చే అసౌకర్యాలను తట్టుకోలేక ఏడుస్తునే ఉంటారు.

10. ఇద్దరూ సమానమే

10. ఇద్దరూ సమానమే

ఇది మీరే డిసైడ్ చేయాలి. అబ్బాయిలకు కూడా పీరియడ్స్ వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు అన్ని విషయాలలోనూ సరి సమానమనే భావనను ఒప్పుకుంటారా? మేము ఒప్పుకుంటున్నాం. మరి మీరు?

English summary

Things Guys Would Experience If They Had Periods

Guys, do you think women crib a lot when they are on their period? What if you were given a chance to experience how it feels at that time of the month? Will you be able to handle it or will you give up and seek a coward's way out?
Story first published: Monday, December 15, 2014, 17:53 [IST]
Desktop Bottom Promotion