For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇతరుల మనసు గెలుచుకోవడానికి మార్గాలు

By Nutheti
|

మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ సొంతమైంది. కానీ.. అంతా కొత్త వాతావరణం.. మనుషులంతా భిన్న మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నవాళ్లు.. వీళ్లందరితో ఎలా మెలగాలి.. ఎలా కలిసిపోవాలి.. ఎలా మసలుకోవాలని.. డైలమాలో పడ్డారా ? మీ అభిరుచులు ఎదుటి వాళ్లకు నచ్చుతాయో లేదో అని ఆలోచిస్తున్నారా ? అయితే డోంట్ వర్రీ.. సింపుల్ టిప్స్ ఫాలో అవండి.. మీ చుట్టూ ఉన్న వాళ్ల మనసు గెలుచుకోండి.

ఎదుటి వాళ్ల మనసు అర్థం చేసుకోవడం.. గెలుచుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. మనలో ఉండే క్వాలిటీసే ఎదుటి వాళ్లను ఆకట్టుకునేలా చేస్తాయి. కాబట్టి.. మిమ్మల్ని ఎదుటివాళ్లు ఇష్టపడాలంటే.. మీతో ఆప్యాయతగా, ఫ్రెండ్లీగా ఉండాలంటే.. ఇక్కడ చెబుతున్న టిప్స్ ఫాలో అవండి.. వర్క్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

స్మైల్

స్మైల్

నవ్వు.. అందరినీ ఆకట్టుకునే ఫస్ట్ క్వాలిటీ. కాబట్టి ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు నవ్వుతూ పలకరిస్తే.. ఈజీగా మిమ్మల్ని ఇష్టపడతారు.. మీకు స్నేహితులవుతారు.

ప్రశ్నలు అడగడం

ప్రశ్నలు అడగడం

ఎదుటివాళ్లని ఆకర్షించడానికి మీ గురించి అన్ని విషయాలు వివరించాలి. అలా వివరిస్తూ ఉన్నప్పుడు వాళ్లు మీతో ఎక్కువసేపు మాట్లాడటానికి సమయం కేటాయిస్తారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా మీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది.

శ్రద్ధగా వింటారు

శ్రద్ధగా వింటారు

ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. వాళ్లు ఏం చెబుతున్నా.. జాగ్రత్తగా విని సమాధానం చెప్పాలి. వాళ్లు చెప్పిన విషయాల గురించి మీరు మళ్లీ అడిగితే.. ఎదుటివాళ్లు చిరాకు పడతారు.

పేర్లు గుర్తుపెట్టుకోవడం

పేర్లు గుర్తుపెట్టుకోవడం

పేర్లు గుర్తుపెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తులను ఈజీగా ఆకర్షించవచ్చు. సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ల పేర్లు చెబితే.. తమకు విలువ ఇస్తున్నారని సంతోషపడతారు.

మళ్లీ మళ్లీ చెప్పడం

మళ్లీ మళ్లీ చెప్పడం

ఎదుటివాళ్లు చెప్పిన విషయాన్నిమీరు మళ్లీ వివరించడం వల్ల.. మీ మీద అభిమానం పెరుగుతుంది. తాము చెప్పిన అంశాలను స్వీకరించారని ఆనందపడతారు.

అనవసర సలహాలు

అనవసర సలహాలు

ఎదుటివాళ్లు సలహాలు అడిగినప్పుడే స్పందించాలి. అనవసరంగా మీ అంతట మీరు సలహాలు, సూచనలు ఇస్తే.. మీ మీద చెడు అభిప్రాయం మొదలవుతుంది. ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న అపోహ వస్తుంది.

పోటీ పడకూడదు

పోటీ పడకూడదు

ప్రతి విషయంలోనూ పోటీకి దిగారంటే.. అసలుకే మోసం వస్తుంది. పోటీతత్వం.. ఎదుటివాళ్లలో అయిష్టతకి దారితీస్తుంది.

బాధ్యత తీసుకోవాలి

బాధ్యత తీసుకోవాలి

ఏదైనా పొరపాటు చేసినప్పుడు.. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. దాని పరిష్కారానికి సహకరించాలి. వేరేవాళ్లను నిందించరాదు.

ఫోన్ పక్కనపెట్టడం

ఫోన్ పక్కనపెట్టడం

ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఫోన్ పక్కన పెట్టడం వల్ల ఇంప్రెషన్ కొట్టేయవచ్చు. దానివల్ల తాము చెప్పే విషయాలు ఆసక్తిగా వింటున్నారని ఎదుటి వ్యక్తులు భావిస్తారు. మీరంటే అభిమానం పెరుగుతుంది.

ఇతరులతో పోల్చడం

ఇతరులతో పోల్చడం

ఎదుటివ్యక్తులను ఆకర్షించాలంటే.. ఏ విషయంలోనూ కంప్యారిజన్ చేయకండి. ఎదుటివాళ్లు చెబుతున్న అంశాలు విని తెలుసుకోండి. అనవసరంగా మీ విషయాలతో పోల్చడం వల్ల ఎదుటివాళ్లు ఇబ్బందిగా పీలవుతారు.

మధ్యలో మాట్లాడకూడదు

మధ్యలో మాట్లాడకూడదు

ఇతరులు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి తప్ప.. వాళ్ల సంభాషణ పూర్తి కాకుండానే మాట్లాడకూడదు. దీనివల్ల వాళ్లకు బాధ కలిగించడమే కాదు.. వాళ్లు చెప్పే అంశాలకు ప్రాధాన్యత లేదని ఫీలవుతారు.

ఐ కాంటాక్ట్

ఐ కాంటాక్ట్

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ కరెక్ట్ గా ఉంటే.. వాళ్లు మీతో సత్సంబంధాన్ని కోరుకుంటారు. మీరు నిజాయితీపరులని నమ్ముతారు.

వేలెత్తి చూపకూడదు

వేలెత్తి చూపకూడదు

ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒకోలా ఉంటాయి. కాబట్టి.. ఎదుటివాళ్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపకండి. కొన్ని సందర్భాల్లో మీ అభిప్రాయాలు వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు చెబుతున్న తప్పని వాళ్లు వారించవచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించడం మంచిది.

సానుభూతి కోరుకోరు

సానుభూతి కోరుకోరు

తమపై సానుభూతి ప్రదర్శించడాన్ని చాలా మంది ఇష్టపడరు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ వెంటే ఉంటారు.

ఎక్కువ కష్టపడటం ఇష్టపడరు

ఎక్కువ కష్టపడటం ఇష్టపడరు

మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకుంటూ.. వర్క్ లైఫ్ ఎంజాయ్ చేయండి. మీరు పని ఒత్తిడి ఫీలయితే బావుండదు.

శుభ్రత

శుభ్రత

పరిశుభ్రంగా ఉండే వ్యక్తులే అందరికీ నచ్చుతారు. కాబట్టి శుభ్రంగా ఉండే బట్టలు వేసుకోవడం, పళ్లని శుభ్రంగా తోముకోవడం.. వంటివి చాలా అవసరం. దాంతో పాటు దుర్వాసన రాకుండా చూసుకోవాలి.

చూశారుగా ఈ అంశాలన్నీ మీలో సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మార్చుకోవాల్సిన విషయాలుంటే మార్చుకుని.. ఎదుటివాళ్ల మనసు దోచుకోండి.

English summary

16 Things Extremely Likeable People Do: in telugu

Being likeable has its benefits. you'll have an easier time scoring your dream job and making friends. To be a extremely likeable person you should follow these tips. It will help you.
Story first published: Thursday, October 8, 2015, 13:33 [IST]
Desktop Bottom Promotion