For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మమ్మల తీపి జ్ఞాప‌కాలు

By Nutheti
|

టెక్నాలజీ, గ్లోబలైజేషన్ మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాయి. 21వ శతాబ్ధంలో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. ఒక సరదా లేదు.. సంబరం లేదు. లగ్జరీ లైఫ్ లో ఆర్టిఫిషియల్ అలంకారాలకే.. ఆనందపడిపోవాల్సి వస్తోంది. నోరూరించే వంటలైనా.. అలంకరణ వస్తువులైనా.. స్వయంగా చేసుకుని తృప్తి పడే టైమూ లేదు. ఓపికా లేదు. ఇండస్ట్రియలైజేషన్ కారణంగా.. ఏ వస్తువు కావాలన్నా.. కోరుకున్నది తినాలన్నా.. ఈజీగా అందుబాటులోకి వచ్చేశాయి.

కానీ మన అమ్మమ్మలు, బామ్మలు.. తమ జీవితాలను సంపూర్ణంగా ఎంజాయ్ చేశారు. విభిన్నంగా.. కళాత్మకంగా రకరకాల వస్తువులను తామే డిజైన్ చేసేవాళ్లు. మెట్రో లైఫ్ స్టైల్ కి అలవాటు పడిన మనకు ఇవి తీపి జ్ఞాప‌కాలు మాత్రమే. ఆ కాలానికే విభిన్నంగా ఆలోచిస్తూ.. కొత్త కొత్త ఐడియాలకు పురుడుపోసేవాళ్లు. సహజత్వంలోనే ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకునేవాళ్లు. అమ్మమ్మలు, బామ్మలు చేసిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఐడియాస్ ఏంటో ఒక్కసారి తనువుతీరా తలుచుకుందాం...

పచ్చళ్ల తయారి

పచ్చళ్ల తయారి

సమ్మర్ వచ్చిందంటే చాలు.. పచ్చళ్ల తయారీలో అమ్మమ్మలు బిజీగా ఉండేవాళ్లు. పెద్ద పెద్ద పరిమాణంలో.. ఎంతో ఆప్యాయంగా చేసిన ఆ పచ్చళ్ల రుచే వేరులే. గాజు జార్లలో దాచిన ఆ పచ్చళ్ల రుచి ఇప్పటికి నాలుకకు గుర్తే. మార్కెట్లో ఎన్ని రుచుల్లో పచ్చళ్లు కనిపించినా.. ఇంట్లో అమ్మమ్మ చేత్తో చేసిన రుచి ఎప్పటికీ రాదు. అందుకే అమ్మమ్మల అలవాట్లు ఇప్పటికీ.. ఎప్పటికీ మధురజ్ఞాపకాలే.

మసాలాలు దంచడం

మసాలాలు దంచడం

అమ్మమ్మలు, బామ్మల అలవాట్లలో మసాలాలు దంచడం ఒకటి. అప్పట్లో ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇంట్లో ఉండే ఆడవాళ్లంతా కలిసి.. మసాలా దినులన్నింటినీ సహజంగా దంచి తయారు చేసుకునేవాళ్లు. కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి వంటి వాటిని దంచడం వల్ల వంటలు కూడా ఘుమఘుమలాడేవి. అంతేకాదు.. గోధుమపిండి వంటి వాటిని కూడా రుబ్బుకోవడం బామ్మలకు అలవాటు. ఇలాంటి పనులు చేసేటప్పుడు.. ఆడవాళ్లంతా సరదాగా పాటలు పాడటం, పురాణాల గురించి మాట్లాడటం వల్ల శారీరక శ్రమ తెలిసేది కాదు.

వడియాలు పెట్టడం

వడియాలు పెట్టడం

ఎన్ని రకాల వంటలు వండినా.. చిప్స్ ఉంటేగానీ భోజనం పరిపూర్ణం కాదు. అందుకే మార్కెట్ లో దొరికే అప్పడాలు, చిప్స్, వడియాలను డబ్బులు పెట్టి కొనుక్కుని తింటున్నాం. కానీ.. మన ఇంటి వరండాలో అమ్మమ్మ చేత్తో పెట్టిన వడియాల రుచి మాత్రం ఎన్ని వెరైటీలు తిన్నా దొరకడం లేదు. అప్పడాలైనా.. వడియాలైనా.. స్వయంగా తయారు చేసేది అమ్మమ్మ.

గార్డెనింగ్

గార్డెనింగ్

ఇంటికి అందం.. అందమైన పూదోట. ఆ కాలంలో ప్రతి ఇంటి ముందు.. పచ్చగా పందిరి వేసినట్టు పూదోట దర్శనమిచ్చేది. రంగురంగుల పూలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మూలికల మొక్కలు నాటేవాళ్లు. ఈ పూలతోటలు ఇంటికి ఆకర్షణీయతనే కాదు.. ఆరోగ్యాన్ని చేకూర్చేవి. మేడలు.. మిద్దిలు వచ్చాక పూదోటలే కరువయ్యాయి.

కుట్లు, అల్లికలు

కుట్లు, అల్లికలు

డిజైనర్ స్వెట్టర్లు, జాకెట్లు ఇప్పుడు మార్కెట్ లో బోలెడన్ని దొరుకుతున్నాయి. అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెల్లండి.. మీ అమ్మమ్మ లేదా బామ్మ అల్లిన కలర్ ఫుల్ స్వెట్టర్ ని గుర్తు చేసుకోండి. ఎంత బావుందో అనిపిస్తుందా. నిజమే.. ఇప్పుడు ఎన్ని రకాల స్వెట్టర్లు, జాకెట్లు మార్కెట్లో ఉన్నా.. ఎంతో ఆప్యాయతతో.. అందంగా.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన అమ్మమ్మ స్వెట్టర్లకు దీటు రావంటే మీరూ అంగీకరిస్తారు కదూ. శీతాకాలం సెలవులకు వెళ్లే సరికి మీ కోసం అమ్మమ్మ ప్రేమతో తయారు చేసిన స్వెట్టర్ బోలెడంత సంతోషాన్ని నింపిన విషయం చిరకాలం గుర్తుండిపోవాల్సిందే.

అలంకరణ

అలంకరణ

రంగురంగుల కుండీలు, గ్లాస్ పెయింటింగ్స్, చేత్తో తయారు చేసిన అందమైన బొమ్మలు మీకు గుర్తున్నాయా ? అవన్నీ అమ్మమ్మ కాలానికి చెందిన అలంకరణాలు. ఎంతో సృజనాత్మకంగా.. ఆకర్షిణీయంగా ఇంటి అలంకరణ వస్తువులు తీర్చిదిద్దడం మన బామ్మలు, అమ్మమ్మలకే సాధ్యం. నేటి తరం ఆలోచనలు, అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చేశాయి. అందుకే.. మార్కెట్లో దొరికే ఖరీదైన క్యాండిల్ స్టాండ్స్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలకే ఆకర్షితులవుతున్నాం.

ఎంబ్రైడరీ

ఎంబ్రైడరీ

స్కూల్ కి వెళ్లేప్పుడు మీ అమ్మమ్మ ఇచ్చిన తీపి గుర్తు జ్ఞాప‌కమొచ్చిందా. అదేనండి.. తెల్లటి కర్చీఫ్ లో దాగున్న ఎంబ్రైడరీ బొమ్మలు. అమ్మాయిలకు పింక్ రోజ్ ఫ్లవర్, అబ్బాయిలకు బ్లూ కలర్ కార్ బొమ్మ ఎంబ్రైడరీ కర్చీఫ్ లు చేసి ఇచ్చేది. అవే కాకుండా.. టేబుల్ క్లాత్స్, బెడ్ షీట్లు, గౌన్లు, డోర్ కర్టన్స్ కి రకరకాల ఎంబ్రైడరీలు చేసేవాళ్లు. వాళ్లు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా.. క్రియేటివ్ గా డిజైన్ చేసేవాళ్లు.ఇప్పటికి ఎంబ్రైడరీలు ఉన్నాయి కానీ.. కొన్ని మార్పులు వచ్చాయి. వాటి ప్లేస్ లో మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చాయి.

రంగవల్లులు

రంగవల్లులు

అప్పట్లో పెద్ద పెద్దవి రంగువల్లులను.. రంగులతో అందంగా తీర్చిదిద్దితే.. ఇంటికే కొత్త శోభ వచ్చేది. రథాల వంటి ముగ్గులు మన పురాణాలను గుర్తు చేసేవే. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ.. పెద్ద ముగ్గులను అద్భుతంగా వేసేవాళ్లు మన అమ్మమ్మలు, బామ్మలు.

ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిందే తప్ప ప్రయత్నించలేము.. సమయం కూడా సరిపోదు. వంట చేసుకోవడానికి, మసాలాలు దంచుకోవడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి.. ప్రతి దానికి మనం మిషిన్లపైనే ఆధారపడుతున్నాం. అన్నీ సౌకర్యవంతంగా మార్చుకున్నాం.. దేనికి స్వతహాగా ఆలోచించడం లేదు.. తయారు చేసుకోవడం లేదు. అందుకే ఆ రోజులు ఆణిముత్యాలు. ఇకపై అలాంటి రోజులు చూడలేమేమో..

English summary

Interesting Ideas of Older Generation Houseold Women

Interesting Ideas of Older Generation Houseold Women
Story first published: Friday, October 9, 2015, 15:28 [IST]
Desktop Bottom Promotion