For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివుడి చిహ్నాలకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి ?

|

శివుడు, పవరమేశ్వరుడు, భోలాశంకరుడు, నీలకంఠుడు, ముక్కంటి ఇలా.. ఏ పేరుతో పిలిచినా.. సర్వం నేనేనన్న భావన కలిగిస్తాడు ఆ శివుడు. పరమశివుడు అత్యంత పవర్ ఫుల్ గాడ్. ఈ భోలాశంకరుడిని ఒక్కసారి మనసారా స్మరించినా, తలచినా, వేడుకున్నా బాధలన్నీ తొలగిపోయాయన్న భావన భక్తుల్లో కలిగిస్తాడు. లింగరూపంలో, విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివుడు ముళ్లోకాలాను ఏలుతారని భక్తుల నమ్మకం.

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?

తలలో గంగాదేవి, అట్టకట్టుకుని ఉన్న వెంట్రుకలు, మెడలో పాము, చేతిలో త్రిశూలం, ముక్కంటి అవతారమై.. ఆ పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా శివుడికి ప్రత్యేకమైన ప్రతి దాంట్లోనూ ఒక్కో పరమార్థం దాగుంది. ఒక్కొక్కటి ఒక్కో ఆరోగ్య రహస్యాలను తెలుపుతాయి. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం మన చేతుల్లోనే, మన ఆలోచనల్లోనే ఉందని ఈ ఆయుధాలు, రూపాలే సూచిస్తాయి.

ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందిన శివును దేవాలయాలు..! ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందిన శివును దేవాలయాలు..!

మనం చేసే పనులే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏ పని చేసినా.. అది సరైనదా, కాదా అని ఒక్కసారి ఆలోచించి ముందడుగు వేయాలని శివుని చిహ్నాలు చెబుతున్నాయి. ఈ నియమాలు పాటిస్తే ఎలాంటి బాధలు లేకుండా.. ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవిస్తారని తెలుపుతాయి. ఇంతకీ పవిత్రంగా భావించే పరమేశ్వరుడి ఆయుధాలు లేదా చిహ్నాలు తెలిపే ఆరోగ్య రహస్యాలు, విలువలు ఏంటో ఒక్కసారి స్మరించుకుందాం..

జుట్టు

జుట్టు

శివుడిని తలవగానే ముందుగా కనిపించేది అట్టకట్టుకుని ఉండే జుట్టు. ఈ చిహ్నం యునిటీని తెలుపుతుంది. మన ఆలోచనలను సరైన క్రమంలో ఉంచుతూ, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది. అందరితో కలిసి మెలిసి మెలిగితే.. ప్రశాంత పొందుతాం. గుండె సంబంధిత వ్యాధులు, ఎసిడిటీ, తలనొప్పి దూరంగా ఉంటాయి.

మూడో కన్ను

మూడో కన్ను

శివుడి మూడో కన్ను ముందుచూపును తెలుపుతుంది. దీనిద్వారా ముందు జాగ్రత్త వహిస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి పనుల నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామో ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఏది తప్పు, ఏది కరెక్ట్ అన్నది ముందుగానే గ్రహించగలగాలి.

త్రిశూలం

త్రిశూలం

శరీరం, మెదడు, అహం వంటివన్నీ తెలివితో కంట్రోల్ చేసే శక్తిని త్రిశూలం సూచిస్తుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా తెలివిగా ఆలోచించి మొదలుపెడితే మంచి ఫలితాలు పొందుతారు. ఇలాంటి పద్ధతి ఫాలో అవడం వల్ల మెరుగైన ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. కరెక్ట్ అనిపించినది చేస్తూ, తప్పు అనిపించినది వదిలేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు.

ధ్యానం

ధ్యానం

యోగముద్రలో కూర్చుని ధ్యానించడం శివుడిలో చూసే మరో చిహ్నం. ఇది మీకోసం కొంత సమయాన్ని కేటాయించమని సూచిస్తుంది. ఈ బిజీ లైఫ్ లో మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతూ ఉంటాం. అయితే ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం ఒంటరిగా, ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మనం చేస్తున్నది కరెక్టా, కాదా అన్నది తెలుసుకోవచ్చు. మన ప్రవర్తనను అంచనా వేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. మరోవిషయమేంటంటే ధ్యానం వల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండవచ్చు.

పవిత్ర విభూతి

పవిత్ర విభూతి

ద్వేషం, స్వార్థం వల్ల మనమంతా అనారోగ్యాలకు గురవుతూ ఉంటాం. జీవితంలో ఏది శాశ్వతం కాదని ఈ పవిత్ర విభూతి తెలుపుతుంది. స్వార్థం, ద్వేషం వల్ల పొందే లాభమేమీ ఉండదు.. కేవలం మానసిక ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. మనలో వచ్చే అనారోగ్య సమస్యలను పారద్రోలాలంటే.. పాజిటివ్ ఆటిట్యూడ్ చాలా అవసరం.

నీలకంఠం

నీలకంఠం

శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం వల్ల నీలకంఠుడిగా పిలుస్తాం. ఈ నీలకంఠం కోపాన్ని అణచుకోవాలని సూచిస్తుంది. ఆందోళన, ఒత్తిడికి, డిప్రెషన్ వంటివి కోపం ద్వారా మొదలవుతాయి. కోప పడటం వల్ల మరింత ఆందోళనకు గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. కోపం కంట్రోల్ లో ఉంటే ఆస్తమా, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవని తెలుపుతుంది.

ఢమరుకం

ఢమరుకం

కోరికలపై కంట్రోల్ ఉండాలని ఢమరుకం హెచ్చరిస్తుంది. అనవసర కోరికలను అదుపులో పెట్టుకుంటూ మనసుని ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచుకోవాలని ఢమరుకం తెలుపుతుంది. జంక్ ఫుడ్, ఆందోళలకు దూరంగా ఉండాలి. దీనివల్ల సరైన ఆరోగ్యం, ప్రశాంతత పొందగలుగుతాం.

గంగ

గంగ

శరీరం, మనసులో పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేసుకోవాలని పరిశుభ్రతకు చిహ్నమైన శివుడి తలపై ఉన్న గంగ సూచిస్తుంది. శరీరం, మనసు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకోవచ్చని, ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులకు మంచిదని, శారీరక శ్రమ వల్ల చర్మం, కండరాలకు, దైవనామస్మరణ ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తుంది.

పాము

పాము

శివుడి మెడలో చుట్టూ పెనవేసుకున్న పాము నిగ్రహాన్ని కోల్పోకుండా చూస్తుంది. దీనివల్ల హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజ్ లు రాకుండా ఉంటాయి.

మూసి ఉన్న కళ్లు

మూసి ఉన్న కళ్లు

కొన్ని సందర్భాల్లో జీవితం చాలా తికమక పెడుతూ ఉంటుంది. చెడు అలవాట్లు, అనారోగ్యకరమైన పనులకు ఆకర్షితులవుతూ ఉంటాం. మూసి ఉన్న శివుని కళ్లు చెడు అలవాట్లుకు, చెడు పనులకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లతో ముందుకు వెళ్లాలని సూచిస్తాయి.

English summary

Lord Shiva Teaches You About Your Health in telugu

Lord Shiva's form can also open up our eyes regarding some important aspects of our health.
Story first published:Wednesday, November 25, 2015, 14:00 [IST]
Desktop Bottom Promotion