For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన పూర్వీకులు రాగి పాత్రలనే ఎందుకు వాడేవాళ్లు ?

|

మన పూర్వీకులు బంగారు, వెండి, రాగి పాత్రలలోనే ఎందుకు భోజనం చేసేవాళ్లు ? వండేవాళ్లు ? అని ఎప్పుడైనా ఆలోచించారా ? అలా వాడటం వెనక ఆరోగ్య రహస్యాలే కాదు.. సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి.

READ MORE: రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

మనకంటే మన పూర్వీకులు చాలా ముందుచూపుతో ఉండేవాళ్లు. ఆ విషయం వాళ్లు ప్రతి దాంట్లోనూ నిరూపించుకుంటున్నారు. శారీరకంగా, మానసికంగా, టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు పూర్వీకులు. ఎక్కువగా రాగి పాత్రలలను వంటింట్లో వాడటం వెనక అమోఘమైన ప్రయోజనాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే...

పూర్వపు ఆలోచనలు ఉట్టివి కాదు. వాటి వెనక చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాళ్లు కష్టపడి పనిచేసినా.. రాగి పాత్రలు వాడినా.. కట్టెల పొయ్యి మీద వండినా.. అన్నీ ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలున్నవే. అందుకే ఆ ఆలోచనలన్నీ మళ్లీ ఇప్పుడు పురుడుపోసుకుంటున్నాయి. కొన్ని రెస్టారెంట్స్ లో రాగి పాత్రలలోనే సర్వింగ్ చేస్తూ.. పాత ట్రెండ్ ని మళ్లీ పరిచయం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి ప్రూవ్ అయింది. ఒకప్పటి ఆరోగ్య సూత్రాలే ఈ జనరేషన్ కి అవసరమౌతున్నాయి. ఇప్పుడున్న కాలుష్యం కారణంగా.. అప్పటి పద్ధతులతోనే ఆరోగ్యం మెరగుపడుతుంది. చిన్న ఏజ్ లోనే వచ్చే అనారోగ్య సమస్యలు, తెల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే రాగి పాత్రలే సరి. కాబట్టి రాగి పాత్రల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో తిలకించండి.

రాగి పాత్రల ప్రయోజనాలు

రాగి పాత్రల ప్రయోజనాలు

రాగి పాత్రలు వైరస్, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. రాగి పాత్రలలో నీళ్లు తాగితే మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే పురాతన ఈజిఫ్టియన్లు నీళ్లను రాగిపాత్రలలో ఉంచడం వల్ల అవి ఫ్రెష్ గా ఉంటాయని నమ్మేవాళ్లు. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని తెలుస్తోంది. అమెరికాలోని పురాతన ఇళ్లలో ఇప్పటికీ రాగి వాటర్ పైప్ లైన్లే ఉన్నాయి.

రాగి పాత్రలలో నీళ్లు నిల్వ ఉంచితే

రాగి పాత్రలలో నీళ్లు నిల్వ ఉంచితే

శరీరానికి కాపర్ చాలా అవసరం. దాన్ని కొన్ని ఆహార పదార్థాలైన బీన్స్, ఆకుకూరలు, కూరగాయలు, తేనె నుంచి పొందవచ్చు. అయితే.. రాత్రంతా రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావల్సిన కాపర్ అందుతుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీటి ద్వారా 40 శాతం కాపర్ పొందగలుగుతాం.

రాగి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

రాగి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

రూం టెంపరేచర్ లో రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో ఉండే మలినాలు తొలగిపోయి.. జీర్ణాశయాంతర నాళాన్ని శుభ్రం చేస్తాయి. అంతేకాదు జీర్ణ ప్రక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, ఒబేసిటీని తగ్గించి ఫ్యాట్ ని కరిగించడానికి ఇది సహకరిస్తుంది.

కాపర్ వాటర్ లోని రసాయన రహస్యాలు

కాపర్ వాటర్ లోని రసాయన రహస్యాలు

గర్భం పొందాలి అనుకున్నప్పుడు కొన్ని వారాల ముందు నుంచి మగవాళ్లు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజుకి 6 వేల మిల్లీగ్రాముల నుంచి 20 వేల మిల్లీ గ్రాముల వరకు విటమిన్ సి తీసుకుంటే.. స్పెర్మ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది.

రాగి నాణెలు నదిలో వేయడం వెనక ఆంతర్యం

రాగి నాణెలు నదిలో వేయడం వెనక ఆంతర్యం

ప్రాచీన భారతీయులు రాగి నాణేలను నదులు, బావులలో వేయడం ఆనవాయితీగా ఉండేది. దాని వెనకున్న ఆంతర్యం తెలియక ఈ జనరేష్ వాళ్లు అల్యూమినియం కాయిన్స్ ని గుడ్డిగా నదులలో వేస్తూ.. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. అయితే పూర్వీకులు రాగి నాణేలను ఎందుకు వేసేవాళ్లంటే.. అది నీటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని. అంతేకాదు చేపలకు శుభ్రమైన నీళ్లు అందుతాయని భావించేవాళ్లు.

రాగి ఎందుకు విలువైనది

రాగి ఎందుకు విలువైనది

బతకడానికి కాపర్ చాలా అవసరమైనది. ఇది శరీరానికి అందడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కాలేయం, గుండె, కిడ్నీ, కండరాల ఆరోగ్యానికి ఇది అవసరం. శరీరంలో శక్తిని మెరుగుపరచడానికి కూడా కాపర్ చాలా అవసరం.

ఆయుర్వేదం ప్రకారం

ఆయుర్వేదం ప్రకారం

రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచి తాగడం వల్ల వాతం, కఫం, పిత్తం వంటి దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తామర జలం అంటారు. రాగి పాత్రలో ఉంచిన నీటిని కనీసం ఎనిమిది గంటల తర్వాత తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ బ్యాక్టీరియల్

యాంటీ బ్యాక్టీరియల్

కాపర్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. కాబట్టి తలుపులకు ఉండే గొళ్లాలను రాగితో చేసినవాటిని పెట్టడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది.

వయసు ఛాయలు కనిపించకుండా

వయసు ఛాయలు కనిపించకుండా

చర్మంపై ముడతలతో బాధపడుతుంటే.. రాగి సహజంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సెల్ ఫార్మేషన్ గుణాలు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడే గుణం రాగిలో ఉంటుంది. కాబట్టి రాగి పాత్రలు వాడితే చర్మం ఆరోగ్యంగా, నిగారిస్తూ ఉంటుంది.

జాయింట్ పెయిన్స్

జాయింట్ పెయిన్స్

జాయింట్ పెయిన్స్, ఇతర నొప్పులను నివారించడానికి కాపర్ యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కాపర్ సహకరిస్తుంది.

వృద్ధాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి

వృద్ధాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి

యుక్త వయసులోనే వృద్ధాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో కాపర్ పరిష్కారం. ఎముకల్లో ఎలాంటి సమస్యలు లేకుండా.. ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహకరిస్తుంది. కాబట్టి ఇకపై రాగి పాత్రలకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది.

తెల్ల జుట్టు నివారణకు

తెల్ల జుట్టు నివారణకు

ప్రస్తుతం టీనేజర్ల నుంచి అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. పిగ్మెంటేషన్ నుంచి బయటపడటానికి కాపర్ మంచి సొల్యూషన్. ఇది చర్మం, జుట్టు, కళ్లలో వచ్చే పిగ్మెంటేషన్ సమస్యలకు సహజంగా పనిచేస్తుంది. రాగి పాత్రలలో తినడం అలవాటు చేసుకుంటే.. తెల్ల జుట్టుని నివారించవచ్చు.

థైరాయిడ్ గ్రంథులు

థైరాయిడ్ గ్రంథులు

థైరాయిడ్ గ్రంథులు క్రమబద్ధంగా పనిచేయడానికి కాపర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో కాపర్ అందినా ప్రమాదమే. కాబట్టి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.

ఎర్ర రక్త కణాలు

ఎర్ర రక్త కణాలు

ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి కాపర్ బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో బాగా సహకరిస్తుంది కాపర్. అనీమియాను నివారించడంలోనూ కాపర్ కు సాటి లేదు.

వేగంగా గాయాలు తగ్గించడానికి

వేగంగా గాయాలు తగ్గించడానికి

యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కాపర్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి గాయాలనైనా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలి

రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలి

రాగి పాత్రలకు త్వరగా మరకలు పడతాయి. అవి ఎన్ని రోజులైనా వదలవు. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం లేదా చింతపండుతో రుద్ది కొన్ని నిమిషాలు అలా వదిలేసి తర్వాత క్లీన్ చేయడం వల్ల మరకలు వదులుతాయి.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటాం. నిజమే పూర్వపు పద్దతులు చాలా ఆరోగ్యకరమైనవి. వాళ్లే ఫాలో అయిన పద్ధతుల వెనక చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కాబట్టి రాగి పాత్రలనే వాడటం అంటే ఈ జనరేషన్ కి కాస్త కష్టమే కాబట్టి. రోజుకి రెండు లేదా మూడుసార్లు రాగి పాత్రలలో నీళ్లు తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలుంటాయి. ఇంకేం వెంటనే ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్స్ గ్లాసులకు స్వస్తి చెప్పి రాగి వస్తువులకే ఇంపార్టెన్స్ ఇస్తారు కదూ.

English summary

Why was copper used by our ancestors? in telugu

Why was copper used by our ancestors.
Desktop Bottom Promotion