For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశికి అథిపతి ఎవరో తెలుసుకుంటే? మీసమస్యలు గట్టెక్కినట్లే..!

ప్రతి మనిషీ ఏదో ఒక గ్రహ, రాశి ప్రభావంతో భూమిపై పుడతాడు. ఈ సృష్టిలో గ్రహాలు 12. రాశులు 12 అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కనుక మనుషులను 12 రకాలుగా విభజించవచ్చు. జ్యోతిషం చెప్పే ద్వాదశ రాశులను అజమాయిషీ

|

ప్రతి మనిషీ ఏదో ఒక గ్రహ, రాశి ప్రభావంతో భూమిపై పుడతాడు. ఈ సృష్టిలో గ్రహాలు 12. రాశులు 12 అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కనుక మనుషులను 12 రకాలుగా విభజించవచ్చు. జ్యోతిషం చెప్పే ద్వాదశ రాశులను అజమాయిషీ చేసే జ్యోతిర్లింగాలు కూడా 12. కనుక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శివుడు ఉన్నాడు. ఆయనను ప్రసన్నం చేసుకోడానికి ఒక్కొక్క మంత్రం ఉంది.

అలాగే విష్ణు సంబం ధమైన ప్రభావం కూడా ఈ రాశులపై ఉంది. కనుక ఒక వ్యక్తి ఏ రాశికి చెందినవాడో చూసుకొని ఆ రాశికి సంబంధించిన మంత్రాన్ని (ఉపదేశం పొందాలి), ప్రార్థనా శ్లోకాన్ని పఠిస్తూ ఉండాలి. ఆ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హరిహరులు ఆనందించి మనుగడ సజావుగా సాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి, మీరాశి ప్రకారం ఏ శివ రూపం ఆరాధిస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో తెలుసుకుందాం..

మేష రాశి

మేష రాశి

12 రాశుల్లో మొట్టమొదటిది మేషరాశి. ఈ రాశిని అజమాయిషీ చేసే శివుడు రామేశ్వరంలో ఉన్నాడు. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి ఈ శ్లోకాన్ని ప్రతి రోజూ పఠించాలి. ఈ రాశి కుజునికి స్వగృహం. 11వ ఇంటి అధిపతియైన శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర యాత్ర చేయడం శ్రేయస్కరం. శ్రీరాముడు శని బాధ తొలగించుకోడానికి ఈ లింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. రాముడు ప్రతిష్ఠించిన లింగం కనుక ఈ లింగానికి రామేశ్వరలింగమనే పేరు వచ్చింది.స్వక్షేత్రాధిపతి అయిన కుజుడికి కందులు, ఎర్ర వస్త్రాలు దానం చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశిని అజమాయిషీ చేసే దేవుడు సోమనాథుడు. వీరు పఠించవలసిన శ్లోకం సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే, జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం, తం సోమనాథం శరణం ప్రపద్యే వృషభరాశి శుక్రుడికి స్వగృహం. చంద్రుడు ఉచ్ఛ స్థ్థితిలో ఉండే రాశి ఇది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు స్థాపించాడు. ఈ రాశి వారిని నవమాధిపత్యంలో ఉండే శని బాధిస్తూ ఉంటాడు. శనిదోషాలు తొలగించు కోడానికి సోమ నాథ ఆలయానికి వెళ్ళి రావడం శ్రేయస్కరం. జన్మ నక్షత్రంనాడు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బొబ్బర్లు కానీ, బియ్యం కానీ దానం చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి

ఈ రాశిని రక్షించేది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం యామ్యే సదంగే నగరేతి రమ్యే, విభూషితాంగం వివిధైశ్చ భోగై: సద్భక్తిముక్తి ప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యెె ఈ రాశి బుధుడికి స్వగృహం. దోషాలు నివారించుకోడానికి నాగేశ్వర పుణ్యక్షేత్రం దర్శించాలి. శని సంచరించే సమయంలోనూ, జన్మనక్షత్రం నాడు కైలాస యంత్ర ప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

ఈ రాశిని అజమాయిషీ చేసేది ఓంకార జ్యోతిర్లింగం. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం.. కావేరికా నర్మదయో: పవిత్రే, సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం, ఓంకార మీశం శివమేక మీడే ఈ రాశి చంద్రుడికి స్వగృహం. ఓంకార జ్యోతిర్లింగ దర్శనం చెెసుకోవాలి. జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి

ఈ రాశికి అధిపతి ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్‌, సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యెె సింహరాశి సూర్యుడికి స్వగృహం. ఈ రాశి వారు రోజూ ఈ శ్లోకాన్ని చదువుకోవడానికి వీలు కుదుర్చుకుని ఘృష్ణేశ్వరుని దర్శించుకోవడం మంచిది. జన్మనక్షత్రం నాడు ఏకాదశ రుద్రాభిషేకం జరిపించడం ద్వారా దోషాలను పోగొట్టుకోవచ్చు.

కన్యారాశి

కన్యారాశి

ఈ రాశికి శ్రీశైలమల్లికార్జున స్వామి అధిపతి. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం

శ్రీశైలశృంగే వివిధ ప్రసంగే, తులాద్రితుంగేపి సదా వసంతం

తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్రసేతుం

ఈ రాశి వారికి బుధుడు అధిపతి. బాధల నుంచి విముక్తి పొందడానికి శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకోవాలి. అక్కడే ఉన్న భ్రమరాంబ కు కుంకుమార్చన చేయించాలి. జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేయించాలి. ఆవుకి ఆకుకూరలు, పచ్చపెసలు తినిపించాలి.

తులారాశి

తులారాశి

ఈ రాశికి అధిపతి మహాకాలెెశ్వరుడు. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన

శ్లోకం

అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం

అకాల మృత్యో: పరిరక్షణార్థం, వందే మహాకాల మహాసురేశం

ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాలెశ్వరుని దర్శించుకోవడం శుక్రవారాల లో సూర్యోదయ సమయంలో బొబ్బర్లు దానం చేయడం మంచిది. ఇలా చేస్తే గ్రహ దోషాల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

ఈ గ్రహానికి అధిపతి వైద్యనాథేశ్వరుడు. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన

శ్లోకం

పూర్వోత్తరే ప్రజ్జ్వలికానిధానే, సదా వసంతం గిరిజాసమేతం

సురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామి

ఈ రాశికి కుజుడు అధిపతి. వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకు కారణ మవుతుంది. బాధలను నివారించుకోవడానికి ఈ రాశి వారు వైద్యనాథుని దర్శించు కోవాలి. మంగళవారం రోజు, జన్మనక్షత్రం రోజు కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. రుతుక్రమ దోషాలు ఉంటే స్త్రీలు పెద్ద ముత్తయిదువలకు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

ధనూరాశి

ధనూరాశి

ఈ రాశికి అధిపతి విశ్వేశ్వరలింగం. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం

సానందమానందవనే వసంతం, ఆనందకందం హతపాప బృందం

వారణాసీనాథ మనాథనాథం, శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే

ఈ రాశి వారికి గురువు అధిపతి. గురుడికి స్వస్థానం కూడా ఇదే. వేదాంత ధోరణి, విపరీత ఆలోచనలు, వైజ్ఞానిక ఆలోచనలు వీరికి ఉంటాయి. ఆదిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన క్షేత్రం కాశి. ఈ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణను శివుడు భిక్షమడిగి తృప్తిపడతాడు. అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున శివుడు నారాయణ మంత్రంతో జీవులకు మోక్షం ప్రసాదిస్తాడు.

ఈ రాశి వారు కాశీ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం మంచిది. గురువారంనాడు, జన్మనక్షత్రం నాడు శనగలు దానం చేయడం ద్వారా శని, గురు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.

మకరరాశి

మకరరాశి

ఈ రాశికి భీమశంకరుడు అధిపతి. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం యం డాకినిశాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశనైశ్చ సదైవ భీమాది పద ప్రసిద్ధం, తంశంకరం భూతహితం నమామి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. గురుడు నీచబడినా, కుజుడు ఉచ్చస్థితికి చేరినా ఈ శనీశ్వరుడే కారకుడు. గురుడు అంటే జీవుడు అని అర్ధం. అహంకారంతో చెలరేగిన గజరాజు మొసలి బారినపడినపుడు భగవంతుని శరణుజొచ్చిన గజేంద్రమోక్ష ఘట్టాన్ని పురాణాలు ఈ రాశి ఫలితమేనని ఉదాహరిస్తున్నాయి. దోషాలను నివారించు కోవాలంటే భీమశంకరుని దర్శించుకోవాలి. భీమేశ్వరుడికి నిత్యం పూజ చేయడం, శ్లోక పారాయణం చేయడం, శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, అవిటి వారికి, ముసలి వారికి వస్త్రాలు దానం చేయడం మంచిది.

కుంభరాశి

కుంభరాశి

ఈ రాశికి అధిపతి కేదారేశ్వరుడు. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం

మహాద్రి పార్శ్వేచ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రై:

సురాసురైర్యక్ష మహోరగాఢ్యై:, కేదారమీశం శివమేకమీడే

ఈ రాశికి శని అధిపతి. దోష నివారణ కోసం కేదారేశ్వరుని దర్శించుకోవడం, పూజించుకోవడం చెప్పదగిన సూచన. రోజూ ఈ శ్లోకాన్ని పఠించడంతోపాటు శనివారం నువ్వుల దానం, అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం మంచిది.

మీనరాశి

మీనరాశి

ఈ రాశికి అధిపతి త్రయంబకేశ్వరుడు. ఈ రాశివారు నిత్యం పఠించవలసిన శ్లోకం

సహ్యాద్రిశీర్షే విమలేవసంతం, గోదావరీతీర పవిత్రదేశే

యత్‌దర్శనాత్‌ పాతకమాశునాశం, ప్రయాతితం త్రయంబకం మీశమీడే

ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు అధిక ఫలితాలను ఇస్తాడు. గ్రహదోష నివారణకు త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవాలి.

స్వామి పటాన్ని పూజా మందిరంలో ఉంచి నిత్యం పారాయణం చేయడం మంచిది.

English summary

12 Rashis Related with Dwadas Jyotirlingas

Shiva can grant life to the dying native, Example of this is Markandeya who was supposed to die at age 12, Guru can elevate any debilitated native.
Story first published: Tuesday, October 25, 2016, 7:55 [IST]
Desktop Bottom Promotion