మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే..ఏయే రాశివాళ్లు పెళ్లిచేసుకోవాలి..!

మీ రాశిని బట్టి మీకు మ్యాచ్ అయ్యే రాశి ఏంటి ? అసలు ఏ రెండు రాశులు మ్యారేజ్ లైఫ్ లో సక్సెస్ అవుతాయో తెలుసుకుందాం..

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా పెళ్లి చేయాలంటే.. అమ్మాయి, అబ్బాయి జాతకం చూస్తారు. జాతకంలో కీలకపాత్ర పోషించేవి పుట్టిన తేదీ, పుట్టిన సమయంతో పాటు రాశులు, తిథులు, నక్షత్రాలు. వీటన్నింటి ఆధారంగా.. ఇద్దరి జాతకాలు చూసి.. వాళ్ల వైవాహిక బంధం సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది తెలుసుకుంటారు.

14 Zodiac Matches That Make The Absolute BEST Couples

మీ గురించి, మీ భాగస్వామి గురించి ఆస్ట్రాలజీ చాలా విషయాలను వివరిస్తుంది. ముఖ్యంగా.. మీరు ఇద్దరూ సరైన జోడీయేనా, కాదా అన్నది తెలుపుతుంది. అయితే కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో హ్యాపీగా ఉంటారు. తర్వాత మనస్పర్ధలు, గొడవలతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.

మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏ రెండు రాశులు కలవకూడదు ?

అలా కాకుండా.. మీ మ్యారేజ్ లైఫ్.. జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే.. సరైన వ్యక్తిని పెళ్లిచేసుకోవాలి. అదేనండి.. మీ రాశిని బట్టి.. మీకు మ్యాచ్ అయ్యే రాశికి చెందిన వ్యక్తిని పెళ్లాడాలి. మరి మీ రాశిని బట్టి మీకు మ్యాచ్ అయ్యే రాశి ఏంటి ? అసలు ఏ రెండు రాశులు మ్యారేజ్ లైఫ్ లో సక్సెస్ అవుతాయో తెలుసుకుందాం..

తులారాశి, సింహరాశి

తులారాశి, సింహరాశి వాళ్లు చాలా ప్రేమగా ఉంటారు. త్వరగా కలిసిపోయే తత్వం ఉంటుంది. అలాగే ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా సింహరాశి వాళ్లు పార్టీలలో ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారు. సింహరాశి వాళ్లకు అవసరమైన వాటిపై అటెన్షన్ అందించడంలో.. తులారాశి వాళ్లు చాలా గ్రేట్ గా ఉంటారు.

మిధున రాశి, తులారాశి

మిధునరాశి వాళ్లు, తులారాశి వాళ్లు.. ఇద్దరిలోనూ చాలా గొప్ప సెక్సువల్ కనెన్షన్ ఉంటుంది. దీనివల్ల వీళ్ల రిలేషన్ చాలా బలపడుతుంది. చాలా అన్యోన్యంగా మారుతుంది. ఈ రెండురాశుల వాళ్లు.. చాలా మంచి ఏకాభిప్రాయం కలిగి ఉంటారు. కాబట్టి.. వీళ్లది సరైన జోడి.

మేషరాశి, కుంభరాశి

ప్రతి ఒక్కరూ కోరుకునే రిలేషన్ షిప్ ఈ రెండు రాశుల వల్ల సాధ్యమవుతుంది. వీళ్లు సాహసాలను ఇష్టపడతారు. వీళ్లు నిరంకుళమైన వాళ్లు. ఈ రెండురాశుల వాళ్ల అభిప్రాయాలు, అభిరుచులు కలవడం వల్ల.. వీళ్ల వైవాహిక బంధం సక్సెస్ అవుతుంది.

మేష రాశి, కర్కాటక రాశి

మేషరాశి వాళ్లు చాలా ధైర్యవంతులు, చాలా డేరింగ్ గా ఉంటారు. వీళ్లు చాలా ప్రశంసలు అందుకుంటారు. ఈ రెండు రాశుల వాళ్లు కలవడం వల్ల కూడా.. జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.

మేషరాశి, మీనరాశి

మీనరాశి వాళ్లు సాధారణంగా చాలా ఎదురుతిరగని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ భాగస్వామి మేషరాశి వాళ్లు.. తన లీడర్ స్థానాన్ని కూడా ఇచ్చేసే తత్వం ఉంటుంది. మేషరాశి వాళ్ల సంతోషం కోసం మీనరాశి వాళ్లు ఏమైనా చేస్తారు. కాబట్టి.. ఈ రెండు రాశులు చాలా బెస్ట్ కపుల్.

కర్కాటక రాశి, మీనరాశి

ఈ రెండు రాశులను సూచించేవి నీటికి సంకేతాలు. చాలా సెన్సిటివీగా ఉంటారు. వీళ్లిద్దరిలో ఎవరు ఏం చేసినా.. మరో వ్యక్తిని ఏ మాత్రం బాధపెట్టదు. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు బాగా కలుస్తాయి. కాబట్టి.. వీళ్లిద్దరూ బెస్ట్ కపుల్.

వృషభ రాశి, కర్కాటక రాశి

ఈ రెండు రాశుల వాళ్లు.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. ఇద్దరూ ఒకే రకమైన అభిరుచులు కలిగి ఉంటారు. ఫ్యామిలీ, ఇల్లు, స్థిరత్వం విషయంలో.. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కాబట్టి.. వీళ్లిద్దరూ పర్ఫెక్ట్ జోడీ.

వృషభ రాశి, మకర రాశి

మకరరాశి వాళ్లు వృషభ రాశి వాళ్లలో ఉండే జాలి, సున్నిత మరస్తత్వాన్ని చాలా ఇష్టపడతారు. అలాగే మకర రాశి వాళ్లలో ఉండే.. పనిపై ఆసక్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని వృషభ రాశి వాళ్లు ఇష్టపడతారు.

ధనస్సు రాశి, మేషరాశి

ఈ రెండు రాశుల వాళ్ల సోషలైజింగ్ ని ఇష్టపడతారు. ఒకవేళ ఏ విషయాన్నైనా ధనస్సు రాశివాళ్లు ఇష్టపడకపోతే.. అది డ్రామా అని తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఈ రెండురాశులవాళ్లు పర్ఫెక్ట్ మ్యాచ్.

సింహ రాశి, ధనస్సు రాశి

సింహరాశి వాళ్లలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ధనస్సురాశి వాళ్లు బాగా ఇష్టపడతారు. టైం గురించి అననుకూలంగా ఉంటారు. అయితే సమస్యలకు చాలా తెలివిగా, సున్నితంగా పరిష్కారాలు కనుక్కోవడం సింహరాశి వాళ్ల ప్రత్యేకత. అందుకే.. వీళ్లిద్దరూ చాలా పర్ఫెక్ట్ జోడి అవుతారు.

కన్యారాశి, మకర రాశి

మకర రాశివాళ్లు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. కన్యారాశివాళ్లు చాలా నిజాయితీగా ఉంటారు. చాలా ఆలోచనా శక్తి ఉంటుంది. వీళ్లిద్దరూ మ్యాచ్ చాలా అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి, మిధున రాశి

కుంభరాశి వాళ్లు చాలా క్రియేటివ్ గా ఉంటారు. మిధునరాశి వాళ్లు దాన్ని ఆరాధిస్తారు. ఈ జంట చాలా ఒడిదుడుకులను.. సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొంటారు.

సింహ రాశి, మిధున రాశి

సింహరాశి, మిధున రాశి వాళ్లు అభిరుచులు బాగా కలుస్తాయి. అందుకే.. వీళ్లిద్దరూ కలిసి మెలసి.. జీవితాంతం ఉంటారు. వీళ్ల వైవాహిక బంధం చాలా బలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి, సింహరాశి

సింహరాశి వాళ్లు సెంటర్ ఆఫ్ అటెన్షన్ గా ఉండాలనుకుంటారు. వృశ్చిక రాశి వాళ్లు పదునైన నాలుక కలిగిన వాళ్లు. అలాగే తరచుగా అసూయకు లోనవుతారు. దీనివల్ల ఇద్దరి రిలేషన్ బలపడుతుంది.

English summary

14 Zodiac Matches That Make The Absolute BEST Couples

14 Zodiac Matches That Make The Absolute BEST Couples. Here we give you the best zodiac matches. Go through them and see whether it’s true for you.
Story first published: Wednesday, November 23, 2016, 13:16 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter