వారణాసిని మ్యాజికల్ ప్లేస్ గా ఎందుకు పిలుస్తారు..!?

వారణాసికి వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరూ.. ఆ ప్రాంతాన్ని మ్యాజికల్ ప్లేస్ గా అంగీకరిస్తారు. మంత్రోచ్ఛరణలు, గంగానది పరవళ్ల శబ్ధం, ఇరుకు సందుల్లో కనిపించే గందరగోళం.. ఇన్ని ఉన్నా మనసుకి ప్రశాంతత కలుగుతుంది.

Posted By:
Subscribe to Boldsky

వారణాసికి వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరూ.. ఆ ప్రాంతాన్ని మ్యాజికల్ ప్లేస్ గా అంగీకరిస్తారు. మంత్రోచ్ఛరణలు, గంగానది పరవళ్ల శబ్ధం, ఇరుకు సందుల్లో కనిపించే గందరగోళం.. ఇన్ని ఉన్నాకూడా.. మనసుకి చాలా ప్రశాంతతను కలిగిస్తుంది.

facts about varanasi

మనందరికీ తెలుసు.. వారణాసిలో కాశీ విశ్వనాధుడు కొలువై ఉన్నాడని. ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఉంది. మీరు ఊహించిన దానికంటే.. ఇంకా ఎన్నో వింతలు, వాస్తవాలు ఈ వారణాసిలో దాగున్నాయి. అవి మీకు తెలియదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వారణాసి గురించి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్, సంప్రదాయాలు, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

కప్పలకు పెళ్లి

ఎప్పుడైనా విన్నారా ? కప్పలకు పెళ్లి చేయడం. నిజమే వారణాసిలో కప్పలకు పెళ్లి చేయడం ఆచారంగా వస్తోంది. వర్షాకాలంలో ఆశ్వమేధ ఘాట్ లో కప్పలకు పెళ్లి చేస్తారు. ఈ వివాహాన్ని పండితులు దగ్గరండి జరిపిస్తారు. పెళ్లి చేసిన తర్వాత కప్పలను నదిలో వదిలేస్తారు. ఈ కార్యక్రమాన్ని వానదేవుడి అనుగ్రహం కోసం చేస్తారు.

అఘోరీలు

వారణాసి శివుడి త్రిశూలంపై బ్యాలెన్స్ అవుతోందని నమ్ముతారు. కలియుగాంతంలో భూమి నాశనం అవుతుందని.. అప్పుడు వారణాసిని రక్షించడానికే శివుడు ఇలా త్రిశూలంపై ఈ నగరాన్ని మోస్తున్నారని నమ్ముతారు.

కాశీ ఆలయంలోని శివలింగం

ఔరంగజేబ్ వారణాసిలోని ఆలయాలను నాశనం చేయాలని వచ్చినప్పుడు.. కాశీ విశ్వనాధ ఆలయ పండితుడు.. శివలింగం మొగల్ చక్రవర్తి నాశనం చేయకుండా కాపాడటానికి లోపల ఉన్న నదిలోకి తొసేశాడని చెబుతారు.

బంగారం

18వ శతాబ్ధంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఇండోర్ అహిల్యా భాయ్ హోల్కర్ అనే రాణి నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత మహారాజ రంజిత్ సింగ్ ఈ ఆలయానికి బంగారాన్ని దానం చేశారు. ఆ బంగారాన్నే గోపురానికి ఉపయోగించారు.

విజయం

అనేక విజయాలకు వారణాసి కేంద్రం. తులసీదాస్, మున్షీ ప్రేమ్ చంధ్, సితార్ ప్లేయర్ రవి శంకర్, బిల్మిల్లా ఖాన్ వంటి ప్రముఖులు వారణాసికి చెందినవాళ్లే.

నదులు

వరుణ, అశి అనేది నదులు ఈ నగరం మొత్తం ప్రవహిస్తాయి. అందుకే ఈ నగరాన్ని వరుణ, అశి లేదా వారణాసి అని పిలుస్తారు.

యోగా

యోగా, ఆయుర్వేదం వంటివి పురుడుపోసుకున్నది వారణాసిలోనే. ఈ రెండింటినీ కనుగొన్న మహారిషి పంతంజలికి ఈ వారణాసితో బలమైన సంబంధం ఉంది.

జైనులకు

23వ తీర్థఖరా, పార్శ్వనాధుడు జన్మించినది వారణాసిలోనే. అందుకే.. జైన మతస్థులకు కూడా.. వారణాసి చాలా ప్రత్యేకమైనది.

English summary

8 Things About Varanasi That Would Surprise You

8 Things About Varanasi That Would Surprise You. We are sure many of these points would be new to you!
Please Wait while comments are loading...
Subscribe Newsletter