రోబో గురించి కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

రోబో గురించి కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!Robotics అంటే ఏమిటి..? Robots గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని Robotics అంటారు.వాటిని డిజైన్ చేయడం ,ఆపరేట్ చేయడం ఇంకా ఇతర అప్లికేషన్లను

Posted By:
Subscribe to Boldsky

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.


రోబోల గురించి చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. కాని తనను తయారుచేసిన సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారుచేసి విధ్వంసానికి కాలుదువ్వుతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనం. ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది. అలాగే టివిల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మరమనిషిని చూస్తున్నాం. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ రోబో అంటే ఏమిటి , దీని స్రుష్టికర్త ఎవరు?

Robotics అంటే ఏమిటి..?
Robots గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని Robotics అంటారు.వాటిని డిజైన్ చేయడం ,ఆపరేట్ చేయడం ఇంకా ఇతర అప్లికేషన్లను అంటే కంప్యూటర్ల ద్వారా Robot ల యొక్క Sensory feedback ని తీసుకోవడం..కంట్రోల్ చేయడం వంటివి దీనిలో భాగంగా చెప్పవచ్చును.పరిశ్రమలలో ,పరిశోధనాశాలల్లో ..ఇళ్ళలో వీటి వాడకం పెరుగుతుండటం తో రోబోటిక్స్ శాస్త్రం చాలామందిని నేడు ఆకర్షిస్తోంది.మనుషులు చేయడానికి ప్రమాదకరంగా ఉండే కొన్ని పనులను చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.

ఉదాహరణకి బాంబుల్ని డిఫ్యూజ్ చేయడం,గ్యాస్ ట్యాంకుల్లో,అగ్ని పర్వతాల్లో,గనుల్లో ప్రమాదకరమైన పనులు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.అంగారక గ్రహం పైకి కూడా Robot లని పంపించి కొన్ని పరిశోధనలకి ఉపయోగించడం జరిగింది. రోబో గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా

రోబో క్రియేషన్

1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ తొలి "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసినా అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేశారు.

గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ క్రియేట్ చేసిన ఒక 'మరపక్షి'

క్రీ.పూ 450 సంవత్సరంలోనేని తయారుచేసి (ఆవిరి ద్వారా) ఎగరేశాడట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్‌లో కూడా రోబో ప్రత్యక్షమయింది.

రోబోకు పేరు పెట్టింది ఎవరు?

మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించాడు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్ అట.

రోబో తయారీకోసం రోటిక్స్ అనే సైన్స్

ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది.

డొమెస్టిక్ రోబోలు :

మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు (బాంబ్ డిప్యూజింగ్), లేదంటే మనిషితో అవసరం లేని పనులకు (ఫ్యాక్టరీల్లో కార్మికుల్లా) రోబోలను ఉపయోగించసాగారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చాయి.

ఇంటి పనులు చేయడంలో ఫేమస్ అయిన డొమస్టిక్ రోబోలు

అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది.

శస్త్రచికిత్సలో టోనీ రోబోట్స్

కాని రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నారు.

2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు

ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటున్నాడట. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతాయని ఒక అంచనా.

రోబోలకు స్పర్శాజ్ఞానం

ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది.

సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది...

కొంత కాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్‌లలో జరిగినట్టుగా మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి ఒడిగట్టవచ్చు సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది. రోబోల వల్ల మంచే జరగాలని కోరుకుందాం.

English summary

Amazing and Interesting Facts About Robots,

Amazing and Interesting Facts About Robots, 1 “Robot” comes from the Czech word robota, meaning“drudgery,” and first appeared in the 1921 play R.U.R. (Rossum’s Universal Robots). The drama ends badly when the machines rise up and kill their creators, leaving a sole lonely survivor.
Story first published: Wednesday, November 9, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter