దరిద్రం, దురదృష్టం తొలగిపోయి.. సంపన్నులయ్యే సింపుల్ టిప్స్..!

జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. చేతిలో చిల్లిగవ్వ మిగలకుండా.. ఖర్చయిపోతుంటాయి. డబ్బు సంపాదించినట్టే ఉంటుంది.. కానీ ఎప్పుడూ డబ్బులు కొరతగానే ఉంటాయి.

Posted By:
Subscribe to Boldsky

జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. చేతిలో చిల్లిగవ్వ మిగలకుండా.. ఖర్చయిపోతుంటాయి. డబ్బు సంపాదించినట్టే ఉంటుంది.. కానీ ఎప్పుడూ డబ్బులు కొరతగానే ఉంటాయి. ఇలాంటి సమస్య వల్ల చాలా నిస్సహాయ స్థితిలో ఉంటాయి. తమను దరిద్రం, దురదృష్టం వెంటాడుతున్నాయని డీలాపడిపోతుంటారు.

Cash

ఎంత డబ్బు సంపాదించినా.. జేబులో నిలవడం లేదు అని మీకు అనిపిస్తుంటే.. మీరు కొన్ని సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వాలి. అవి మీకు అదృష్టాన్ని, సంపదను తీసుకొచ్చి.. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తాయి. మీ కష్టాలన్నీ.. మీకు అనుకూలంగా మారిపోతాయి.

ఈ రెమెడీస్ అన్నీ.. పండితులు, జ్యోతిష్యులు సూచించినవి. లాల్ కితాబ్ అనే పురాతన గ్రంథంలో వివరించిన ఈ రెమెడీస్.. చాలా సింపుల్ గా ఉంటాయి. ఫలితాలు.. మీ ఆర్థికపరిస్థితులను చాలా వేగంగా మెరుగుపరుస్తాయి.

బెల్లం

పనిమీద లేదా బిజినెస్ వర్క్ మీద ప్రతిరోజూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు.. బెల్లం తినాలి. ఈ సింపుల్ రెమెడీ.. మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గరే ఉండటానికి, ఆర్థికంగా స్థిరపడటానికి సహాయపడతాయి.

అరచేతులు

ఉదయం నిద్రలేచిన వెంటనే.. ముందుగా రెండు చేతులను చూసుకోవాలి. అరచేతుల్లో ఉండే విష్ణుమూర్తి, మహాలక్ష్మీ మిమ్మల్ని అనుగ్రహిస్తారు.

రాగి పాత్రలో నీళ్లు

మీ ఆదాయం పెరగాలంటే.. ఒక రాగి పాత్రలో నీళ్లు నింపి.. రాత్రిపడుకునే ముందు తలవైపు పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని.. ఇంటి బయట పడేయాలి. అయితే ఆ నీటిని ఎవరూ తాగకుండా జాగ్రత్తపడాలి.

కాటుక

లోన్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే.. ఒక కాటుక డబ్బా కొని.. ఎక్కడైనా ఖాళీ మట్టిలో పాతిపెట్టాలి. ప్రతి నెలా మొదటి శనివారం ఇలా చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు.

రావిచెట్టు

మీ జీవితంలో డబ్బు సమస్య ఉండకూడదు, ఎప్పుడూ డబ్బులు పొందాలి అంటే.. రావి చెట్టు మొదళ్లకు పవిత్రమైన రోజులలలో నీళ్లు పోయాలి. ఇలా చేస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. విష్ణుమూర్తిని ఆరాధించినట్టు అవుతుంది.

శనివారాలు

11 శనివారాలు.. పేదవాళ్లకు పూరి, కూరను లేదా అన్నదానం చేయాలి. ఇలా క్రమంతప్పకుండా చేయడం వల్ల.. మీరు సంపాదించిన డబ్బు రెట్టింపు అవుతుంది.

రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్ లో నష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే.. ఒక రాగి ముక్కను పారుతున్న నదిలో వేయాలి. ఇలా 40 రోజులపాటు.. క్రమం తప్పకుండా వేయాలి.

వ్యాపారంలో ఆదాయం

వ్యాపారంలో ఎక్కువ ఆదాయం పొందాలంటే.. ఖాళీ మట్టి కుండను బుధవారం నీటిలో పడేయాలి. ఇలా ఆరువారాలపాటు.. క్రమం తప్పకుండా చేస్తే.. పురోగతి సాధిస్తారు.

పాలు, నువ్వులు

పాలు, నువ్వులు మిక్స్ చేసి.. రావిచెట్టుకి ప్రతిరోజూ పోయడం వల్ల డబ్బు సమస్యలు దూరమవుతాయి.

కొబ్బరికాయ

కొబ్బరికాయను పారుతున్న నదిలో లేదా కాలువలో 44 రోజులపాటు ప్రతిరోజూ వేయడం వల్ల.. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే లక్ష్మీ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు లేదన్న సమస్య దూరమవుతుంది.

English summary

Are You Facing Cash Shortage? Try these Powerful Remedies

Are You Facing Cash Shortage? Try these Powerful Remedies. Here, we bring you simplest of the remedies that you can do easily at home and improve your financial situation.
Please Wait while comments are loading...
Subscribe Newsletter