For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 20 లక్షణాలున్న అబ్బాయిని కళ్లు మూసుకుని పెళ్లిచేసుకోవచ్చట..!!

By Swathi
|

పెళ్లంటే.. తల్లిదండ్రులు సరైన భాగస్వామిని తీసుకురావాలని భావిస్తారు. మంచి ఉద్యోగం, ఆస్తి, వ్యక్తిత్వం, వ్యసనాలు వంటివన్నీ ఆలోచించి.. అన్ని కుదిరిన తర్వాతే.. పెళ్లి చేయడానికి అంగీకరిస్తారు. అయితే.. పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలని.. సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

అలర్ట్: ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు..!! అలర్ట్: ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు..!!

పూర్వకాలంలో స్వయం వరం ఏర్పాటు చేసి.. తమ గారాలపట్టికి సరిపోయే రాజకుమారుడిని ఎంచుకునేవాళ్లు. అంటే తెలివికి, బలానికి పరీక్ష పెట్టి.. అందులో నెగ్గిన వాళ్లతో పెళ్లి చేసేవాళ్లు. అయితే ప్రస్తుత రోజుల్లో అబ్బాయి రూపం, పర్సనాలిటీ, ఉద్యోగం, ఆస్తి వంటివి మాత్రం చూసి.. అన్నీ నచ్చితే పెళ్లి చేస్తారు.

పెళ్లికి ముందు ఆడవాళ్లలో.. మగవాళ్లు కంపల్సరీ చూడాల్సిన క్వాలిటీస్..!! పెళ్లికి ముందు ఆడవాళ్లలో.. మగవాళ్లు కంపల్సరీ చూడాల్సిన క్వాలిటీస్..!!

కానీ సాముద్రిక శాస్త్రం మాత్రం అబ్బాయిలో కొన్ని లక్షణాలు ఉంటేనే అతనితో పెళ్లికి అంగీకరించాలని సూచిస్తోంది. అలాగే అబ్బాయిని తన జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు.. ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని చెబుతోంది. అయితే ఇప్పుడు చెప్పబోయే 20 లక్షణాల్లో కనీసం 12 ఉంటే చాలట. మరి ఆ లక్షణాలేంటో చూద్దామా

ధైర్యం

ధైర్యం

అబ్బాయిలు చాలా ధైర్యం కలిగి ఉండాలి. ఏదైనా, ఎప్పుడైనా.. సింహమంతటి ధైర్యంతో చేయగలగాలి. పని పెద్దది అయినా, చిన్నది అయినా.. ధైర్యంగా చేయాలి.

జాగ్రత్త ఉండాలి

జాగ్రత్త ఉండాలి

అబ్బాయిలు తమ జీవితంలో ప్రతి విషయంపై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ముఖ్యంగా..తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి. వ్యూహాత్మకంగా ఉండకపోయినా.. సమస్య పరిష్కారం విషయంలో.. కన్నేసి ఉండాలి.

ఉదయాన్నే నిద్రలేవాలి

ఉదయాన్నే నిద్రలేవాలి

ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి.. ఇతరులను కూడా.. ప్రోత్సాహపరుస్తాడు. కాబట్టి.. ఈ అలవాటు అబ్బాయిల్లో ఉండాలి. అలాగే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణం కంపల్సరీ.

హార్డ్ వర్క్

హార్డ్ వర్క్

కష్టమైన పని వచ్చినప్పుడు కష్టమని భావించకుండా, నటన చూపించకుండా.. భయపడకుండా.. హార్డ్ వర్క్ చేసే గుణం అబ్బాయిల్లో ఖచ్చితంగా ఉండాలి.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రెండింటినీ గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. అలాగే.. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. కష్టపడితే.. సంపద పొందుతామని నమ్మగలిగే వ్యక్తి అయి ఉండాలి.

భాగస్వామి అవసరాలు

భాగస్వామి అవసరాలు

భాగస్వామి అవసరాలు తెలుసుకోవడం, వాళ్ల కోరికలు తెలుసుకుని..వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. తన భాగస్వామిని అమితంగా ప్రేమించేవాడై ఉండాలి.

వర్క్, లైఫ్

వర్క్, లైఫ్

తన రిలేషన్, వ్యక్తిగతం, వర్క్ లైఫ్ అన్నింటి వల్ల వచ్చే అపాయాల రిస్క్ ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. ప్రేమ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా.. జాగ్రత్తపడగలిగేటట్టు ఉండాలి.

లవ్ లైఫ్

లవ్ లైఫ్

చాలా మంది అబ్బాయిలు.. తన లవ్ లైఫ్ గురించి.. తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ.. తన లవ్ లైఫ్ ని వ్యక్తిగతంగా భావించే లక్షణం అబ్బాయిల్లో కంపల్సరీ ఉండాలి.

వ్యాపారం

వ్యాపారం

చాలా ఓపిక కలిగి ఉండటం, వ్యాపారంలో చాలా పట్టుదల కలిగి ఉండటం అబ్బాయిలకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం.

మెమరీస్

మెమరీస్

తమ భాగస్వామితో గడిపిన స్వీట్ మెమరీస్, ఇష్టమైన విషయాలను.. గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. జీవితంలో అనవసర విషయాలను స్టోర్ చేసుకోవడం కంటే.. ఇలాంటివి స్టోర్ చేసుకోవడం చాలా అవసరమని నమ్మాలి.

ఒదిగి ఉండటం

ఒదిగి ఉండటం

అహంకారం, ఆడంబరం వంటి లక్షణాలు.. అతని విజయాన్ని, సంపదను నాశనం చేస్తాయి. కాబట్టి.. ఒదిగి ఉండే లక్షణం మగవాళ్లకు చాలా అవసరం.

వినయం

వినయం

తన చుట్టూ ఉండేవాళ్ల పట్ల వినయపూర్వకంగా, ప్రతిష్టాత్మకంగా వ్యవహరించే గుణం ఉండాలి.

ఉన్నవాటితో సంతోషం

ఉన్నవాటితో సంతోషం

తన దగ్గర ఉన్నవాటితే.. సంతోషంగా ఉన్నామని ఫీలయ్యే తత్వం ఉండాలి. అలాగే.. తన దగ్గర లేని వాటి గురించి.. బాధపడకూడదు.

తన ఆరోగ్యం

తన ఆరోగ్యం

అబ్బాయిలు తన ఆరోగ్యం గురించి పట్టించుకునే లక్షణం కలిగి ఉండాలి. డైట్ లో.. సరైన పోషకాలు ఉండేలా జాగ్రత్తపడే వ్యక్తి అయి ఉండాలి. ఇతరులు చెడు అలవాట్లకు ప్రోత్సహించినా.. తన ఆరోగ్యంపై శ్రద్ద కలిగి ఉండాలి.

అతినిద్ర

అతినిద్ర

అతిగా నిద్రపోవడాన్ని ఇష్టపడని లక్షణం అబ్బాయిల్లో ఉండాలి. అలాగే.. ఎప్పుడు తాజాగా ఉండటానికి ఇష్టపడేవాళ్లై ఉండాలి.

తోటి ఉద్యోగులతో

తోటి ఉద్యోగులతో

తోటి ఉద్యోగులు, తన కింద పనిచేసే ఉద్యోగులతో చాలా వినయంగా, దయగా, గౌరవపూర్వకంగా వ్యవహరించే లక్షణం అబ్బాయిల్లో కంపల్సరీ ఉండాలి.

పిరికితనం ఉండకూడదు

పిరికితనం ఉండకూడదు

దొంగలు, విలన్స్ ఎటాక్ చేసినప్పుడు.. తేలికగా తప్పించుకునే పిరికితనం అబ్బాయిల్లో ఉండకూడదు.

శ్రద్ధ

శ్రద్ధ

చేసే పనిలో శ్రద్ధ ఉన్న అబ్బాయి అయి ఉండాలి. లక్ష్యంతో పనిచేయగలిగే లక్షణం కలిగి ఉండే అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి.

కోపం రాకూడదు

కోపం రాకూడదు

ఎలాంటి పరిస్థితిలోనైనా.. తన ఓర్పుని కోల్పోనివాడై ఉండాలి. తన కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో గొడవపడేటప్పుడు.. హింసాత్మకంగా మారకూడదు. ఓర్పుతో ఉండాలి.

ఆశావాది

ఆశావాది

అబ్బాయిలు ఆశావాదిగా ఉండాలి. మంచి చేయాలి. తన కలలు నెరవేర్చుకోవడంలో, సక్సెస్ పొందే విషయంలో ఎప్పుడూ.. తన లక్ష్యాన్ని, పట్టుదలని వదులుకోకూడదు.

English summary

Blindly Marry a Man who has These Characteristics

Blindly Marry a Man who has These Characteristics. Read on to know more.
Story first published: Thursday, October 6, 2016, 12:25 [IST]
Desktop Bottom Promotion