For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకసారి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకున్న పాపులర్ సెలబ్రెటీస్..!

By Swathi
|

తమకున్న పర్సనాలిటీ, యాక్టింగ్, టాలెంట్ లతో పాపులర్ అయ్యే సెలబ్రెటీలు పర్సనల్ విషయాల్లో కూడా చాలా పాపులారిటీ సంపాదించేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, రొమాన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన అనుభూతి. అయితే.. సెలబ్రెటీలకు మాత్రం ఇవన్నీ చాలా క్రేజ్ తెచ్చిపెట్టే విషయాలు.

<br><strong>ఏ యే సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా ?</strong>
ఏ యే సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా ?

ఎందుకంటే.. కొంతమంది లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఇద్దరి మధ్య చాలా వయసు గ్యాప్ తో పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకుని మరింత పాపులర్ అవుతారు. తమ యాక్టింగ్ పవర్ తో ఎంతో పాపులారిటీ సంపాదించిన ఫేమస్ సెలబ్రెటీస్.. ఒకసారి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకుని వార్తల్లో చక్కర్లు కొడుతున్నారు. తమ వైవాహిక జీవితానికి విడాకులతో వీడ్కోలు పలికి.. మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు. మరికొందరైతే.. మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుని.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. మరి అలాంటి సెలబ్రెటీస్ ఎవరో ఇప్పుడే చూడండి..

పవర్ కణ్యాణ్

పవర్ కణ్యాణ్

ముచ్చటగా మూడు పెళ్లిళ్లతో.. వార్తల్లో పాపులర్ అయ్యాడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి నందిని ని చేసుకుని 2008లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుని 2012లో ఆమెతో బంధానికి వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత 2013లో రష్యాకు చెందిన నటి.. అన్నా లెజ్నావెని పెళ్లి చేసుకున్నాడు.

నాగార్జున

నాగార్జున

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున దగ్గుబాటి లక్ష్మీ రామానాయుడిని పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడాకులతో.. విడిపోయారు. ఆ తర్వాత నటి అమలాను 1992లో పెళ్లి చేసుకున్నాడు.

కమల్ హాసన్

కమల్ హాసన్

కమల్ హాసన్ 1988లో సారికాను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఈ స్టార్ కి రెండో పెళ్లి. అంతకు ముందు డ్యాన్సర్ వాణీ గణపతిని పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు.

క్రిష్ణ

క్రిష్ణ

సూపర్ స్టార్ క్రిష్ణా.. కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట 1961లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు.

రాధిక

రాధిక

అలనాటి అందాల భామ రాధిక 1985లో ప్రతాప్ పోతన్ ని పెళ్లి చేసుకుంది. తర్వాత అతనికి డైవర్స్ ఇచ్చి.. లండన్ కి చెందిన రిచర్డ్ హార్డ్లీని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి ఒక కూతురు ఉంది. ఈ పెళ్లి కూడా ఎక్కువకాలం నిలవలేదు. రిపోర్ట్స్ ప్రకారం రాధిక శరత్ కుమాత్ లో ప్రేమలో పడి.. 2001లో పెళ్లి చేసుకుంది.

ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. లలితా కుమారీని పెళ్లి చేసుకుని.. 15 ఏళ్ల తర్వాత 2009లో డైవర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మాని పెళ్లి చేసుకున్నాడు.

సీనియర్ ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్ 1942లో తనకు 20ఏళ్ల వయసులో బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ.. 12మంది పిల్లలు. ఆ తర్వాత 1993లో 70ఏళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు.

ఆశా బోస్లే

ఆశా బోస్లే

సింగర్ ఆశా బోస్లే 1980లో ఆర్ డీ బూర్మాన్ ని పెళ్లి చేసుకుంది. అతను ఆశా కంటే.. 6ఏళ్లు చిన్నవాడు. అంతకుందు ఆశా.. గణపతిరావ్ బోస్లే ని పెళ్లి చేసుకుంది. 11ఏళ్ల తర్వాత విడాకులతో విడిపోయారు.

అజారుద్దీన్

అజారుద్దీన్

ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ మొదట నౌరీన్ ని పెళ్లి చేసుకుని 9 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 1996లో మోడల్, యాక్టర్ అయిన సంగీతాను వివాహమాడాడు.

బోనీ కపూర్

బోనీ కపూర్

బోనీ కపూర్ అలనాటి నటి శ్రీదేవిని 1996లో పెళ్లి చేసుకున్నాడు. అయితే తన మొదటి భార్య మోనాని పెళ్లి చేసుకున్న 13 ఏళ్లకి 1996లోనే డైవర్స్ ఇచ్చాడు.

సైఫ్ అలీఖాన్

సైఫ్ అలీఖాన్

తన కంటే 12 ఏళ్లు వయసులో పెద్దదైన నటి అమ్రితా సింగ్ ని వివాహమాడిన సైఫ్ అలీఖాన్.. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి 2012లో పటౌడీ ఫ్యామిలీకి చెందిన కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్ డైరెక్టర్ కిరణ్ రావ్ ని 2005 లో పెళ్లి చేసుకున్నాడు. కానీ అంతకు ముందు రీనా దత్తతో ఉన్న 15 ఏళ్ల పెళ్లి బంధానికి 2002లో చరమగీతం పాడాడు.

సంజయ్ దత్

సంజయ్ దత్

సంజయ్ దత్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1987లో రిచా శర్మను, 1998లో రియా పిల్లాయ్ ని పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు ఇచ్చాడు. 2008లో మాన్యతా దత్ ని పెళ్లి చేసుకున్నాడు.

ఆదిత్యా చోప్రా

ఆదిత్యా చోప్రా

ఆదిత్యా చోప్రా 2014లో అందాల తార రాణి ముఖర్జీని వివాహమాడాడు. అంతకుముందు పాయల్ కన్నాతో ఉన్న ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి 2009లో విడాకులతో వీడ్కోలు పలికాడు.

రాజ్ కుంద్రా

రాజ్ కుంద్రా

మిలీనియర్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా 2009లో పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి మెళ్లో తాళి కట్టాడు. అయితే అంతకుముందే.. రాజ్ కుంద్రా కవితా కుండ్రానికి వివాహమాడి మూడేళ్ల తర్వాత విడాకులతో వాళ్ల బంధానికి వీడ్కోలు పలికాడు.

సిద్ధార్థ్ రాయ్ కపూర్

సిద్ధార్థ్ రాయ్ కపూర్

సిద్దార్త్ విద్యాబాలన్ ని 2012లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇది సిద్ధార్థ్ కి మూడో పెళ్లి. మొదటి ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడు.

ధర్మేంద్ర

ధర్మేంద్ర

పాపులర్ యాక్టర్ ధర్మేంద్ర డ్రీమ్ గాల్ హేమ మాలినీని 1980లో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. తాను మొదట పెళ్లి చేసుకున్న ప్రకాష్ కౌర్ కి విడాకులు ఇవ్వలేదు. కానీ.. రెండో పెళ్లి చేసుకున్నాడు.

English summary

Celebs who married more than once

Celebs who married more than once. Love and romance has always been an indispensable part of celebrities' life, making for headlines since time immemorial. A look at some of the famous people and their even famous marriages over the years.
Desktop Bottom Promotion