కాకి పదే పదే ఇంటి ముందు అరిస్తే దేనికి సంకేతం..?

జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, అశుభం కలుగుతుందని నమ్ముతారు.

Posted By:
Subscribe to Boldsky

జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, మరికొన్ని ఎదురైతే.. అశుభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు.

crows predictions

మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?

అలాగే కాకి గురించి కూడా.. ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం, మరణం.. కాకితో లింక్ అయి ఉన్నట్టు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీన్నిబట్టి.. కాకులు మన భవిష్యత్ ని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు.

బయటకు వెళ్లేటప్పుడు

ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు.. కాకి వచ్చి.. గట్టిగా అరిచి.. వెళ్లిపోయింది అంటే.. మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం.

నీటికుండపై కాకి

నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో.. వాళ్లు.. త్వరలోనే.. ధనవంతులు కాబోతున్నారని సంకేతం.

ఆహారం పట్టుకెళ్లే కాకి

ఒకవేళ కాకి తన నోట్లో.. రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని, మంచి జరగబోతోందని సంకేతం.

మనిషిపై పడేస్తే

ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా.. ఎవరిపైన అయినా.. పడింది అంటే.. అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం.. అది మరణానికి సంకేతం.

ఎగురుతున్న కాకి

ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే.. ఆ వ్యక్తి.. కాస్త అనారోగ్యానికి గురవుతారని సంకేతం.

గుంపుగా అరిస్తే

గుంపులు గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి.. అరుస్తూ ఉంటే.. అంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్లో అరిస్తే.. అది బ్యాడ్ న్యూస్ కి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం.

తలపై వాలితే

ఒక వ్యక్తి తలపై కాకి వాలితే.. వాళ్లు స్కాం లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని.. సంకేతం.

తలపై కూర్చుంటే

ఒకవేళ కాకి.. మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే.. ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది.

ద్రవ్యలాభం

ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే.. ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది.

రెక్కలు ఊపుతూ, అరిస్తే

ఒకవేళ కాకి రెక్కలు కొడుతూ.. గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే.. మరణం ఉందని.. సూచిస్తూ.. సందేశాన్ని ఇస్తోందని అర్థం.

English summary

Crows Can Predict If You Are Going to be in Trouble

Crows Can Predict If You Are Going to be in Trouble. Animals and birds are connected to various beliefs in Hindu religion.
Please Wait while comments are loading...
Subscribe Newsletter