ఈ రాశివారు చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్: దేనికీ తొనకరు...బెణకరు

సహజంగా జన్మదిన, రాశి, నక్షత్రాలు మరియు వాటి పాదాలు వాటి యొక్క ప్రభావాలను మరియు ఫలితాలను తెలుసుకుంటుంటారు. వీటిని బట్టి, వ్యక్తిత్వాలు,ఒక్కో రాశి యొక్క స్వభావాలు, అహారపు అలవాటు, ఆరోగ్య సూచనలు తెలుసుకుం

Posted By:
Subscribe to Boldsky

మానవ జీవితంలో జ్యోతిషం చాల ప్రాముఖ్యం వహిస్తున్నది, ప్రపంచములోని అన్ని దేశాల ప్రజలు తమ తమ జాతకాలకు సంభందించిన మంచి, చెడుల గురించి తెలుసుకోవడానికి, తగిన దోష నివారణ మార్గాలు గుర్తించి ఆచరించడానికి జ్యోతిష శాస్త్రం మీదనే ఆధార పడుతున్నారు. దేశాలు, జాతులు, భాషల భేదాలను బట్టి స్వల్ప తేడాలున్నప్పటికీ ప్రపంచములోని జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా నవగ్రహాలు మరియు వాటి చలనాల ఆధిపత్యములను అనుసరించే ఫలితాలను తెలుపుతున్నాయి.

జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మానవజాతి వారి వారి జనన కాలాన్ని బట్టి 27 నక్షత్రాలకు చెందినా వారుగా విభజించారు. ఈ 27 నక్షత్రాలకీ, మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలను అంటే మొత్తం 27 నక్షత్రాలకి 108 పాదాలను నిర్ణయించారు. ఈ 108 పాదాలల్లో జన్మించిన వారిని తొమ్మిది పదాలకు ఒకరాశి చొప్పున మొత్తం 12 రాశులుగా ఏర్పరిచారు. ఈ 12 రాశులు వరుసగా మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనము అనే పేర్లతో పిలవబడుతున్నాయి.

సహజంగా జన్మదినం, రాశి, నక్షత్రాలు మరియు వాటి పాదాలు బట్టి మనుష్యుల స్వభావాలను, వ్యక్తిత్వాలు తెలుసుకుంటుంటారు. రాశులను బట్టి ఒక్కో రాశివారికి ఒక్కోవిధమైన లక్షణాలు, వ్యక్తిత్వం స్వభావాలు, అహారపు అలవాట్లు, ఆరోగ్యం సూచనలు ఉంటాయి. ఒక వేల వీటి ద్వారా ప్రమాదం లేదా కష్టలొచ్చినప్పుడు, ఈ గ్రహాలకు శాంతి చేయించుకుంటారు, ఆ రాశిని బట్టి వారు పూజించాల్సిన దేవుళ్ళకు శాంతి చేయించి, పుణ్యఫలం పొందుతుంటారు. మరి ఈ రోజు కుంబ రాశి వారి స్వభావం, లక్షణాలు, వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం..

రాశిచక్రంలో పదకొండో రాశి కుంభం

రాశిచక్రంలో పదకొండో రాశి కుంభం. ఇది బేసి రాశి. వాయుతత్వం, వైశ్య జాతి, క్రూర రాశి, కృష్ణ వర్ణం. తొడలు, కన్ను, శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థలను సూచిస్తుంది. స్థిర రాశి, పురుష రాశి.

దిశ

దిశ దక్షిణం. ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలుంటాయి.

అధిపతి శని.

అధిపతి శని. శంఖం, గవ్వలు, బొగ్గు, మినుములు, ఇనుము, నువ్వులు, పట్టు మొదలైన ద్రవ్యాలను సూచి స్తుంది.

అబిసీనియా,

అబిసీనియా, స్వీడన్, సూడాన్ తది తర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.

కుంభరాశిలో పుట్టినవారు

కుంభరాశిలో పుట్టినవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొణకరు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, ఆధునికతను స్వాగతించే విశాల దృక్పథం వీరిది. మానవతా దృక్ప థంతో వ్యవహరిస్తారు. ఆత్మసాక్షి మేరకు నడుచు కుంటారు.

వీరి సహజ లక్షణాలు

క్రియాశీలత, స్వేచ్ఛాకాంక్ష, నిష్పాక్షికత వీరి సహజ లక్షణాలు. న్యాయం విషయంలో తనపర భేదాలు పాటించకపోవడం వల్ల అయినవారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే సందర్భాలూ ఉంటాయి.

గుర్తింపు లక్షణాలు

గొప్ప జిజ్ఞాసులు, చింతనా పరులు. శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి ఎక్కువ. తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి, సున్నితత్వం, ఔదార్యం వంటి లక్షణాలు వీరికి గుర్తింపు తెచ్చిపెడతాయి.

అభిప్రాయాలను మార్చుకోరు

ఎట్టి పరిస్థితు ల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోవ డానికి ఇష్టపడరు.

సహనం ఎక్కువే

సహనం ఎక్కువే అయినా, సహనం నశిస్తే కోపతాపాలను తారస్థాయిలో ప్రదర్శిస్తారు.

ఏకాంతాన్ని కోరుకుంటారు.

ఏకాంతాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులలో ఇమడ లేరు.

ఆధ్యాత్మిక చింతన, మార్మిక విద్యలపై ఆసక్తి ఎక్కువ.

ఆధ్యాత్మిక చింతన, మార్మిక విద్యలపై ఆసక్తి ఎక్కువ. శాస్త్ర, కళా రంగాలలో అద్భు తాలను సాధించగలరు. గ్రహగతులు ప్రతి కూలిస్తే, స్వేచ్ఛాభిలాషతో అయినవారిని వదులుకునేందుకు సైతం సిద్ధపడతారు.

వెటకారాన్ని తట్టుకోలేరు

వెటకారాన్ని తట్టుకోలేరు. చిన్న చిన్న కారణాలకే శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటారు.

క వ్యసనాలు

ఆందోళనను తట్టుకోలేక వ్యసనాలకు లోనవు తారు.

సమస్యలు


రక్త పోటు, నాడి, గుండె, కంటి, జీర్ణకోశ సమస్యలతో బాధపడతారు.

English summary

Daring and Dashing capabilities of Aquarius zodiac sign

Aquarius is very intellectual, creative and analytical. Those born under this sign love a mental challenge and to discover the inner workings of people and things. The Water-bearer has a friendly nature, so he makes acquaintances easily. He's also highly compassionate and has empathy for others. Add to these salient traits his great sense of humor, and it's easy to see why he's extremely likable.
Story first published: Wednesday, November 16, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter