మీ రాశిని బట్టి కోపంలో లేదా బాధలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు...!!

కొంత మంది బాధను రోజుల తరబడి, నెలల తరబడి, ఇంకొందరు మహానుభావులు సంవత్సరాల తరబడిగా కొనసాగిస్తూనే వుంటారు. ఇది చాలా ప్రమాదకరం బాధతో జీవనం కొనసాగిస్తే దానివల్ల స్ట్రెస్, బిపి, షుగర్ లేదా డిప్రెషన్ వచ్చే అవ

Posted By:
Subscribe to Boldsky

అసలు మనకు బాధ ఎందుకు కలుగుతుంది...? సూటిగా చెప్పాలంటే ..మనం అనుకున్నదానికి విరుద్దంగా జరిగినపుడు , కోరుకున్నది దక్కనప్పుడు, మన ప్రణాళిక తప్పినప్పుడు ,విద్యార్ధి పరీక్షా తప్పినప్పుడు,ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కానపుడు, కోరుకున్న కాలేజిలో సీటు రానపుడు,ఇతరులు తనని గుర్తించనపుడు,తనని తాను తక్కువగా అంచనా వేసుకున్నపుడు, ఆత్మ విశ్వాసం లోపింఛినపుడు, ఇంట్లో బయట తనని అర్థం చేసుకోవడం లేదని భావించినపుడు, అవమానం కలిగినపుడు, ప్రేమలో విఫలమైనపుడు ఇంకా ఎన్నో ఎన్నెన్నో........రకాలుగా మనిషి బాధపడుతుంటాడు.

కొంత మంది బాధను రోజుల తరబడి, నెలల తరబడి, ఇంకొందరు మహానుభావులు సంవత్సరాల తరబడిగా కొనసాగిస్తూనే వుంటారు. ఇది చాలా ప్రమాదకరం బాధతో జీవనం కొనసాగిస్తే దానివల్ల స్ట్రెస్, బిపి, షుగర్ లేదా డిప్రెషన్ వచ్చే అవకాశం వుంది. అందుకనే మనలోని బాధని ఎంత త్వరగా పుల్ స్టాప్ పెడితే అంత మంచిది. త్వరగా బాధ నుండి విముక్తి పొందాలంటే సమస్యను బర్డ్ యాంగిల్లో చూసే అలవాటు చేసుకోవాలి.


బాధ పదునైన ఆయుధం
బాధ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కత్తితో పళ్ళు కోయవచ్చు, ప్రాణాలు తీయవచ్చు. అంటే మనకు కలిగిన బాధను తలచుకుని క్రుంగి కృశించి పోవచ్చు లేదా ఆ బాధ నుండి వచ్చిన పౌరుషంతో అద్బుతాలు కూడా సాధించవచ్చు. అంటే మనకు కలిగిన బాధను నెగేటివ్ గా ఉపయోగిస్తే నేగేటివ్ ఫలితాలు వస్తాయి పాజిటివ్ గా ఉపయోగిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి ఈ విషయం అర్థమైతే బాదే లేదు.

సహజంగా ఎవరికైనా బాధ కలిగినపుడు ఏం చేస్తారు? ఒంటరిగా బాధపడతారు. కొంత మంది ఏడుస్తారు, కొంత మంది అరుస్తారు, కొంత మంది అలుగుతారు, కొంతమంది విపరీతంగా కోపంతో ఊగిపోతారు. ఇంకొంత మందైతే ఎవరితో మాట్లాడకుండా ఓ పక్కన కూర్చుంటారు. ఇలా వారి వారి మనస్థత్వాల స్థాయిని బట్టి బాధను ఒక్కోరకంగా బయటకు వ్యక్తపరుస్తారు.

అయితే జాతక శాస్త్రం ప్రకారం బాధను వ్యక్తపరచటం అనేది వారి జన్మరాశి ప్రభావం కూడా ఉంటుందని చెప్తోంది. జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రాశివారు ఏవిధంగా సాడ్ నెస్ ను వ్యక్తపరుస్తారో తెలుసుకుందాం..

మేషరాశి:

ఈ రాశి వారు బాధ కలిగినపుడు ఆవేశంగా బాధపెట్టిన ఆ అవతలి వ్యక్తిని ఏదైనా చేసేయాలి అనే కసితో రగిలి పోతూ ఉంటారట. ఎందుకైనా మంచిది , ఈ రాశి వారు బాధలో ఉన్నప్పుడు వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

 

వృషభ రాశి:

వృషభ రాశి వారు బాధకలిగినపుడు అందరికీ దూరంగా.. ఒంటరిగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఎవరైనా వీరిని మాట్లాడిస్తే వారిపై కోపం, చిరాకు అన్నీ చూపిస్తారు.

 

మిథున రాశి:

ఈ రాశి వారు బాధ కలిగితే ఆ బాధ కలిగించిన విషయంపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు . బయటికి చెప్పరు కానీ లోలోపల కుమిలిపోతూ మామూలుగానే కనిపిస్తారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి బాధ కలిగితే చాలా భావోద్వేగానికి లోనవుతారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని సినిమాటిక్‌గా బాధను వ్యక్తపరుస్తారట. ఇలాంటి సమయాల్లో వీరి బాధను వినేందుకు ఒకరు ఉండాలి.

 

సింహ రాశి:

ఈ వారు వారి బాధలను అందరి బాధలు చేసేస్తారు. ఈ రాశి వారికి బాధ కలిగితే ఆ విషయాన్ని అందరికీ చెప్తారు. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నావే అనేలా వ్యవహరిస్తారు. అయినా నేను తగ్గేది లేదు. అనేలా ఉంటారు.

కన్యా రాశి

కన్యా రాశి వారు బాధలో ఉంటే వారి బాధ వారి మొఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కోపాన్ని, క్రూరత్వాన్ని తమలో ఉండే అన్ని రంగులను బయటకు చూపించేస్తారు.

తులా రాశి

ఈ రాశి వారు బాధ కలిగితే చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తారు. ఏం కాలేదు. అంతా మంచికే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటారు. ఒకవేళ ఆ బాధ ఎక్కువైతే వీరు బాధపడటం మానేసి ఇతరులను బాధ పెడతారు.

వృచ్ఛిక రాశి:

వృచ్ఛిక రాశి వారు బాధలో ఉంటే ఆ బాధకు కారణమైన వారితో కోపం, పగతో రగిలిపోతారు. చాలా వయొలెంటిక్‌గా వ్యవహరిస్తారు. వీరితో గనక గేమ్స్ ఆడాలని ప్రయత్నించారో అయిపోయారు అంతే.

ధనస్సు;

ధనస్సు రాశి వారు బాధపడితే ప్రతీదానికి చిరాకు, అసహనం ప్రదర్శిస్తారట. అవసరమైతే బండ బూతులు తిట్టడానికి కూడా రెడీ.

మకర రాశి:

మకర రాశి వారికి బాధ పడితే వీరికే బాధలు ఉన్నాయి అనేలా వ్యవహరిస్తారు. ఈ జీవితం ఇంతే అనుకుంటూ ఎలాంటి ఆశలు లేకుండా మెల్లగా ఎలాగో అలా బతికేద్దామనుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బాధ కలిగితే ఆ బాధను వ్యక్తపర్చలేరు. ఎప్పట్లాగే అందరితో మామూలుగా కలిసి ఉంటారు. లోపల బాధపడుతున్నప్పటికీ పైకి సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తారు.

మీన రాశి

మీన రాశి వారు బాధలో జరిగిందిదేదో జరిగిపోయింది. ఇకపై జరగాల్సిందేంటి ? అనేలా వ్యవహరిస్తారు. వీరు గనక బాధ పడితే ఎదుటి వారికి వీరి పట్ల జాలి కలుగుతుంది. ఈ రాశి వారు బాధలో ఉంటే ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తూ ఉంటారు.

English summary

Discover How You Express Sadness Based On Your Zodiac Sign

Discover How You Express Sadness Based On Your Zodiac Sign, If you’re into astrology and zodiac signs, you know the general traits and mannerisms for each sign, especially your own. You know what makes you tick, your negative and positive tendencies, and even what kind of sex positions you enjoy.
Story first published: Thursday, November 10, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter