For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి ?

By Swathi
|

సూసైడ్ !! ఇది మనం సాధారణంగా వినే పదం. చాలా మంది తమ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను, ఇబ్బందులను, మానసిక ఆందోళనలను తట్టుకోలేక తమ జీవితానికి చరమగీతం పాడే క్రియ. అంటే ఈ లోకంతో సంబంధం లేకుండా.. తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుంటారు.

ఒక వ్యక్తి.. బాగా డిప్రెషన్ కి లోనయినప్పుడు.. సమస్యకు పరిష్కారం లభించనప్పుడు.. తమకు ఏం చేయాలో, సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు.. ఆత్మహత్యకు పాల్పడతారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొన్ని నిమిషాలు తమ గురించి, తమ కుటుంబం గురించి ఆలోచిస్తే.. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం కనిపించదు.

ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ ఏమవుతుందో తెలుసా ?

ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఏదో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే.. ఎంతమంది తమలో మానసిన స్థైర్యాన్ని కోల్పోతున్నారో అర్థమవుతోంది. అలాగే రోజురోజుకీ ఆత్మహత్య చేసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి తేలికగా బయటపడవచ్చు.

ఆశ కలిగి ఉండటం

ఆశ కలిగి ఉండటం

మీరు ఎంత డిప్రెషన్ లో ఉన్నారు, మీరు ఎలా ఫీలవుతున్నారు అనేది అనవసరం. మీరు చాలా బలమైన ఆశ కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రయత్నాన్ని వదిలిపెట్టాలి. సమస్య గురించి ఆలోచించడానికి మీకు మీరు కొంత సమయాన్ని కేటాయించండి. దీనివల్ల పాజిటివ్ ఆలోచనలు బయటకువస్తాయి.

ఒంటరితనం నుంచి బయటపడాలి

ఒంటరితనం నుంచి బయటపడాలి

మీరు ఒంటరిగా ఫీలవడం వల్ల, ఒంటరిగా గడపడం వల్ల.. మిమ్మల్ని మీరు చంపుకోవాలని ఫీలవుతారు. కాబట్టి.. ఇలాంటి బలహీనమైన క్షణాల్లో స్టుపిడ్ నిర్ణయాలు తీసుకోవద్దు. కొంత సమయాన్ని కేటాయించి.. ఆత్మహత్య గురించి వదిలేసి.. మీ లక్ష్యాలు నెరవేర్చుకోవడంపై ఆలోచించండి.

మాట్లాడండి

మాట్లాడండి

మీకున్న అన్ని సమస్యల గురించి.. మీ కుటుంబ సభ్యులు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ తో చర్చించండి. దీనివల్ల.. మీకు భారం తగ్గిపోతుంది. మాట్లాడటం వల్ల.. ఎప్పుడూ.. కొత్త ఐడియాలు వస్తాయి.

చుట్టూ చూసుకోండి

చుట్టూ చూసుకోండి

మీరు ఒంటిరిగా ఫీలవుతున్నప్పుడు.. మీకున్న సమస్య మరింత బాధకలిగిస్తుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు సమస్యలను ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా బయటపడుతున్నారనేది గమనించండి. నవ్వుతూ వాళ్లు సమస్యలకు పరిష్కారం ఎలా వెతుక్కుంటున్నారో గ్రహించండి.

ఆత్మహత్య ఎప్పటికీ సహాయపడదు

ఆత్మహత్య ఎప్పటికీ సహాయపడదు

సూసైడ్ చేసుకోవడం వల్ల.. మిమ్మల్ని ఇష్టపడేవాళ్లకు చాలా బాధకలిగిస్తుంది. వాళ్లకు కోలుకోలేని బాధను మిగులుస్తారు. కాబట్టి.. ఆ ఆలోచనల నుంచి బయటపడండి.

బాధ క్షణికమైనది

బాధ క్షణికమైనది

బాధ అనేది క్షణికమైనది. కానీ.. ఆత్మహత్య అనేది ఎప్పటికీ బాధపెట్టేది. కాబట్టి.. ఒకసారి ఆత్మహత్య చేసుకుంటే.. అన్నింటినీ కోల్పోయినట్టే. మీ అమ్మ, మిమ్మల్ని ఇష్టపడేవాళ్లందరికీ.. బాధ మిగిల్చినవాళ్లవుతారు.

ఆల్కహాల్ వద్దు

ఆల్కహాల్ వద్దు

ఆల్కహాల్ తీసుకోవడం లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల.. మీ ఆలోచనలు మరింత పెరుగుతాయి. మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆల్కహాల్ కి దూరంగా ఉండటమే మంచిది.

English summary

How To Cope Up With Suicidal Thoughts

How To Cope Up With Suicidal Thoughts. We all have many ups and downs in our relationships or careers. There are many things in life that can depress us.
Story first published: Saturday, August 20, 2016, 11:16 [IST]
Desktop Bottom Promotion