For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐక్యూ టెస్ట్ : అసలు మీరు తెలివైన వారో, కాదో తెలుసుకోవడం ఎలా..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు విద్యార్థులు, యువత ఐక్యూను పరీక్షించి.. దాన్ని ప్రముఖుల ఐక్యూతో పోల్చుతున్నాయి. ఐన్‌స్టీన్‌ వంటి ప్రముఖులకన్నా ఎక్కువగా ఐక్యూ ఉన్న విద్యార్థులు.. ఏటా పదుల సంఖ్య

|

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు విద్యార్థులు, యువత ఐక్యూను పరీక్షించి.. దాన్ని ప్రముఖుల ఐక్యూతో పోల్చుతున్నాయి. ఐన్‌స్టీన్‌ వంటి ప్రముఖులకన్నా ఎక్కువగా ఐక్యూ ఉన్న విద్యార్థులు.. ఏటా పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నారు. దీంతో ఐక్యూ పరీక్షలపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వ్యక్తులకు పలు పరీక్షలు నిర్వహించి వారి ఐక్యూను కొన్ని గంటల్లో తేల్చేస్తున్నారు.

University of Pennsylvania వారి ప్రకారం మగవారికన్నా ఆడవారి IQ లెవెల్స్ ఎక్కువ. ఆడవారి మెదడులోని orange inter-hemisphere links అందుకు కారణం అట . ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారి ఐక్యు లెవెల్స్ పెరిగాయా లేక ఒకప్పుడు వున్నా గుర్తించలేదా అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు ఇంకా. ఆ విషయం తేలేదాకా, ఇప్పటికి అయితే ఈతరం ఆడవారు మగవారి కన్నా తెలివైన వారు. చదువులో, ఆటల్లో, ప్రయోగాలలో అన్నిటిలో ఇప్పటి తరం అమ్మాయిలు కూడా మగపిల్లల్ని దాటేస్తూన్నారుట.

తెలివికి ప్రామాణికం ఏమిటి ? ఏం చూసి ఒక వ్యక్తిని ఇంటెలిజెంట్ అంటారు ? ఇలాంటి సందేహాలు కామన్. మీకు కూడా ఇలాంటి సందేహాలుంటే చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ చదివి.. ఆలోచిస్తే మీరు తెలివికి ఇటువైపు ఉన్నారా? లేదా అటువైపు ఉన్నారా? అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.. సో టెస్ట్ యువర్ ఇంటెలిజెన్స్!

ఐక్యూ లెవల్..

ఐక్యూ లెవల్..

మనిషి తెలివిని ఇంటెలిజెంట్ కోషియంట్ (ఐక్యూ)తో లెక్కిస్తారు. మీరు ఎంత తెలివైన వారో మీ ఐక్యూ పాయింట్స్‌తో తెలుసుకోవచ్చు. 108 ఐక్యూ పాయింట్స్‌తో హాంగ్‌కాంగ్ టాప్‌లో ఉంటే.. 82 ఐక్యూ లెవల్స్‌తో మనం ఇతర దేశాలకు పోటీనిస్తున్నాం. ఇంతకి మీ ఐక్యూ ఎంత? చెక్ చేసుకున్నారా?

ఒకటి కన్నా ఎక్కువ భాషలు వస్తే :

ఒకటి కన్నా ఎక్కువ భాషలు వస్తే :

ఒక భాష కన్నా ఎక్కువ భాషలు మాట్లాడగలిగితే మీరు బాగా తెలివైనవారు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాన్ని నిర్ధారించారు నిపుణులు. ఒక భాష మాట్లాడే వారి కన్నా రెండు మూడు భాషలు మాట్లాడే వ్యక్తుల మెదడు చురుగ్గా పనిచేస్తుందట. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు ఏకంగా పదహారు భాషల్లో మాట్లాడేవారు. మరి ఆయన ఇంటెలిజన్స్ ఏపాటిదో కదా!

ఇంటికి పెద్దా..?

ఇంటికి పెద్దా..?

మీరు ఇంటికి పెద్ద కొడుకా, కూతురా? అయితే మీకు తెలివి ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు. కుటుంబ సభ్యుల ఐక్యూ లెవల్స్ కోసం టెస్ట్ చేసినప్పుడు అన్నాదమ్ముళ్లలో... అన్నలకు, అక్కా చెల్లెళ్లలో.. అక్కలకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయట. ఇంటికి పెద్దకొడుకు అంటే తండ్రి తరువాత ఆ పొజిషన్‌లో ఉంటారని.. అందుకే కుటుంబం కోసం తపన పడుతుంటారు. అమ్మాయిలయినా అంతే! వీళ్లు.. మంచి చెడును బేరీజు వేసి ఫ్యామిలీని మెయింటేన్ చేస్తుంటారని తేల్చారు పరిశోధకులు. పెద్దల మాట వినాలని పెద్దలనడం వారి పెద్దరికానికి నిదర్శనం.

డిగ్రీ పూర్తి

డిగ్రీ పూర్తి

డిగ్రీ పూర్తి చేసిన వాళ్లలో 35 శాతం మంది ఇంటెలిజెంట్ అంటున్నారు పరిశోధకులు. అయితే మిగతా 65 శాతం గురించి చెప్పలేదు. ఎందుకంటే వీళ్లలో చాలామంది కేవలం సర్టిఫికెట్ కోసమే డిగ్రీలు చేస్తున్నారని.. వాళ్లలో సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్లు తక్కువంటున్నారు.

ఎడమచేతి వాటం:

ఎడమచేతి వాటం:

ప్రపంచ జనాభాలో ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు 10 శాతం ఉంటారు. వీళ్లకు తెలుసుకోవాలనే కసి ఎక్కువ. అందుకే కుడి చేతి వాటం ఉన్న వాళ్లతో పోల్చితే వీళ్లలో తెలివైన వారి సంఖ్య కూడా ఎక్కువట. అయితే చేతి వాటం ఎలా వస్తుందో అనే విషయం ఇంకా తేలలేదంటున్నారు.

తెలియదని తెలుసా...

తెలియదని తెలుసా...

తెలిసింది గోరంత... తెలియంది కొండంత.. సూపర స్టార్ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ తెలివైన వాళ్లే చెబుతారట. ప్రముఖ గ్రీక్ తత్తవేత్త సోక్రటీస్ కూడా మనకు ఏమి తెలియదు అని తెలుసుకోవడమే వివేకం అన్నారు. మనకు తెలిసింది కొంతే.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనే వాళ్లు ఎక్కవ విషయాలు నేర్చుకుని మిగతా వారికన్నా ముందుంటారట.

 దిగులు పడతారా..?

దిగులు పడతారా..?

బాధపడితే ఏం బోధపడదు అంటారు. కానీ బాధపడే వాళ్లు తెలివైన వాళ్లట. ఈ విషయం తెలుసుకోవడానికి 125 మంది విద్యార్థులకు ఒక ప్రశ్నాపత్రం ఇచ్చి నింపమన్నారు పరిశోధకులు. రోజుకు ఏ అంశాల గురించి ఎంత సేపు ఆలోచిస్తారో నోట్ చేయమన్నారు. వాళ్లు రాసిన అంశాలను బట్టి బాధపడే వాళ్లలో తెలివైన వాళ్లు ఉంటారని తేల్చారు.

పెట్స్ అంటే ఇష్టమా..?

పెట్స్ అంటే ఇష్టమా..?

ఇష్టం అయితే మీరు ఇంటెలిజెంట్ అంటున్నారు పరిశోధకులు. కుక్కలను, పిల్లులను పెంచేవారి ఐక్యూ లెవల్ మిగతా వారికన్నా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఒక విశ్వవిద్యాలయంలో 600 మంది విద్యార్థులకు కొన్ని టెస్ట్‌లు పెట్టారు. వాళ్లలో పెంపుడు జంతువులను ఇష్టపడే వాళ్లలో తెలివి తేటలు ఎక్కువని తేలింది. సో జంతు ప్రేమికులు తెలివైనవాళ్లే..!

లేజీగా ఉంటారు

లేజీగా ఉంటారు

లేజీగా ఉండే వాళ్లు తెలివైన వాళ్లట. ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంత మంది పరిశోధకులు నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని కనుగొన్నారు. తెలివైన వాళ్లు ఆలోచనలో మునిగిపోతారని.. బయటి ప్రపంచాన్ని పట్టించుకోరు. అందుకే వాళ్లను చూసిన వాళ్లు బద్దకస్తులు అని అంటారట. కానీ చాలా మంది చురుకుగా ఆలోచిస్తారని.. అందుకే తెలివైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారని చెబుతున్నారు.

సరదాగా ఉంటారా:

సరదాగా ఉంటారా:

సరదాగా ఉండే వాళ్లను అంత తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్లు మంచి మాటకారులు. మనసులోని భావాలను చక్కని పదాలతో వ్యక్తపరుస్తారని చెబుతున్నారు పరిశోధకులు.

మద్యపానం:

మద్యపానం:

ఈ విషయం మందు బాబులకు సంతోషం కలిగించొచ్చు. ఎందుకంటే తెలివైన వాళ్లలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందట. అయితే వాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కవేనండోయ్.

English summary

How do you know if you're intelligent?

Many scientific studies have been conducted to determine the cause of high IQs, and a lot of it boils down to genetics. According to researchers, psychologists and scientists, personal beliefs and physical appearance can also indicate intelligence.
Story first published: Wednesday, October 26, 2016, 17:00 [IST]
Desktop Bottom Promotion