మీ వయసుని బట్టి కనీసం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి ?

స్కాటిష్ హాస్పిటల్ లో జరిగిన అధ్యయనాల్లో ఓ ఆసక్తికర విషయం తేలింది. మనుషుల వాళ్ల వయసుని బట్టి.. ఎంత తరచుగా శృంగారంలో పాల్గొనాలో ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా శృంగారం అంటే.. భార్యాభర్తల ఇష్టాయిష్టాలు, మూడ్, ఆసక్తిని బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. శృంగారానికి సరైన సమయం కేటాయించడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోవడం వల్ల.. శృంగారంపై ఆసక్తి కోల్పోతున్నారు.

శృంగారానికీ ఓ సమయం..!! సైన్స్ ప్రకారం ఏ టైంలో సెక్స్ మంచిది ??

sex based on age

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యానికి రెగ్యులర్ సెక్స్ చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే జీవితంలో చాలా సంతోషాన్ని ఇచ్చేది కూడా ఇదే. శృంగారం యాంటీ డిప్రజెంట్ లా పనిచేస్తుంది. ఎందుకంటే.. ఇది ఒత్తిడిని తగ్గించి, రిలాక్సేషన్ ని ఇస్తుంది. చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో శృంగారం చేయకూడని ప్రదేశాలు..!

స్కాటిష్ హాస్పిటల్ లో జరిగిన అధ్యయనాల్లో ఓ ఆసక్తికర విషయం తేలింది. మనుషుల వాళ్ల వయసుని బట్టి.. ఎంత తరచుగా శృంగారంలో పాల్గొనాలో ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే 40ఏళ్లు వారంలో, ఏడాదిలో ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలనే విషయాలను వెళ్లడించారు. మరి మీ వయసుని బట్టి.. మీ సెక్స్ లైఫ్ ని ఎంత తరచుగా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి..

జీవితకాలం

రెగ్యులర్ సెక్స్ వల్ల.. మనుషుల జీవిత కాలం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడి

అనేక వ్యాధులకు కారణమయ్యే ఒత్తిడి సెక్స్ తేలికగా అడ్డుకుంటుంది. కాబట్టి.. భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొనేదాన్నిబట్టి.. వాళ్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

సెక్స్ లైఫ్

కొంతమంది వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొంటారు. మరికొందరు.. అంతకంటే తక్కువ లేదంటే ఎక్కువ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు.

18 నుంచి 29

18 నుంచి 29 వయసు వాళ్లు.. ఏడాదికి కనీసం 112సార్లు సెక్స్ లో పాల్గొనాలని.. కిన్సే ఇన్ట్సిట్యూట్ అధ్యయనాల్లో తేలింది. అంటే నెలకు కనీసం 10సార్లైనా సెక్స్ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి.

30 నుంచి 39

30 నుంచి 39 ఏళ్ల వాళ్లు.. ఏడాదికి కనీసం 86సార్లు సెక్స్ లో పాల్గొనాలని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే నెలకు కనీసం 7 నుంచి 8 సార్లు శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి.

40 నుంచి 49

40 నుంచి 49 ఏళ్ల వాళ్లు యావరేజ్ గా ఏడాదికి 69సార్లు సెక్స్ లో పాల్గొనాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎవరు ఏ కేటగిరి

ఏడాదికి కేవలం కొన్నిసార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొనేవాళ్లు 13 శాతం మంది ఉంటే, 45 శాతం మంది నెలకు అనేకసార్లు, 34 శాతం మంది వారానికి రెండు నుంచి మూడుసార్లు, 7 శాతం మంది వారానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారట.

పర్ఫెక్ట్

నెలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటే తక్కువ అని, వారానికి ఒకసారి పర్వాలేదని, వారానికి 3 నుంచి 5 సార్లు శృంగారంలో పాల్గొంటే పర్ఫెక్ట్ అని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి.

English summary

How Often You Should intimate According To Your Age

How Often Should You Have Sex According To Your Age. How Often You Should intimate According To Your Age. To know more read on..
Story first published: Tuesday, November 8, 2016, 13:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter