సకల సంపదలు పొందడానిక దీపావళి రోజు పాటించాల్సిన వాస్తు టిప్స్..!

దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు.

Posted By:
Subscribe to Boldsky

దీపావళికి దాదాపు అంతా రెడీ అయిపోయినట్టే.. దీపాల కాంతులతో ప్రతి ఇల్లు మెరిసిపోవడానికి రెడీ అవుతున్నాయి. ఇంట్లో తయారు చేసే మిఠాయిలు, దీపాలు ఇంట్లో సిద్ధం చేసుకుని.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి అందరూ రెడీ అయిపోయారు.

diwali vastu tips

అయితే.. దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు. మరి దీపావళి లక్ష్మీని ఇంటికి ఆహ్వానించడానికి ఇంట్లో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో చూద్దాం..

శుభ్రం చేయడం

దీపావళికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని ప్రతి మూలను చాలా శుభ్రంగా చేసుకోవాలి. చెత్త వంటివాటిని ఇంట్లో లేకుండా పడేయాలి.

వెలుగు

దీపావళి పండుగ రోజు ఇంట్లోని ఏ మూల కూడా.. చీకటిగా ఉండకూడదు. ఖచ్చితంగా ఇంట్లోని ప్రతి కార్నర్ ని వెలుగులతో నింపాలి.

స్వస్తిక్

పవిత్రమైన స్వస్తిక్ గుర్తుని.. ఇంటి ముఖద్వారంపై అతికించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇలా చేస్తే కేవలం దీపావళి రోజే కాదు.. ఎప్పటికీ ఈ సింబల్ ఉండటం మంచిది.

లక్ష్మీ విగ్రహం

వాస్తు ప్రకారం లక్ష్మీ పూజను ఇంట్లో ఉత్తరంవైపు చేయాలి. ఇలా చేస్తే సంపద సిద్ధిస్తుంది. పూజ చేసేటప్పుడు.. లక్ష్మీ విగ్రహానికి ఎడమవైపు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టాలి.

ఉప్పు నీళ్లు

కొద్దిగా ఉప్పును నీళ్లలో మిక్స్ చేసి.. ఇంటి చూట్టూ చిలకరించాలి. ముఖ్యంగా.. దీపావళి రోజు కంపల్సరీ ఉప్పు నీళ్లు చల్లాలి. ఉప్పు.. ఇంట్లో, గాలిలో ఉండే నెగటివిటీని గ్రహిస్తుంది.

ముగ్గు

ముగ్గు అనేది కేవలం ఆకర్షణకు మాత్రమే కాదు.. ముగ్గు వేయడం వల్ల సంపద, శ్రేయస్సు మీ ఇంటికి కలుగుతుంది. ముగ్గులో వేయడానికి గ్రీన్, బ్లూ, పింక్ కలర్స్ ఉపయోగించాలి. ఇంటికి ప్రధాన గేట్ ముందు.. మీరే ఖచ్చితంగా ముగ్గు వేయాలి. దీనివల్ల శ్రేయస్సు పొందుతారు.

దూపం

దూపం ఇంట్లో మంచి సువాసనను మాత్రమే కాదు.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. చందనం అగరబత్తీలనే దీపావళి రోజు ఉపయోగించాలి. ఇది.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.

మెయిన్ డోర్

దీపావళి రోజు ఖచ్చితంగా మెయిన్ డోర్ ఓపెన్ లోనే పెట్టుకోవాలి. ఇది.. మీరు ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారని సూచిస్తుంది. నిద్రపోతున్నా కూడా.. కనీసం ఒక కిటికీ తలుపునైనా తీసి ఉంచడం వల్ల.. లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది.

మంత్రం

దీపావళి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవడం వల్ల.. ఇంట్లో ఉండే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. కాబట్టి దీపావళి రోజు ఈ మంత్రాన్ని జపించడం ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోకండి.

English summary

How Vastu can help you to have happy Diwali

How Vastu can help you to have happy Diwali. How Vastu can help you be happier this festive day.
Please Wait while comments are loading...
Subscribe Newsletter