ఇండియాలో బ్లాక్ మనీ భరతం పట్టడం ఎలా ?

నల్లధనాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వ నిర్ణయం ఇండియాలో సంచలనంగా మారింది. ఈ సర్జికల్ స్ట్కైక్ నల్ల ధనం కుబేరులపై బ్రహ్మాస్త్రంగా మారింది.

Posted By:
Subscribe to Boldsky

నల్లధనాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వ నిర్ణయం ఇండియాలో సంచలనంగా మారింది. ఈ సర్జికల్ స్ట్కైక్ నల్ల ధనం కుబేరులపై బ్రహ్మాస్త్రంగా మారింది. ఇండియాలో మితిమీరిపోతున్న నల్లధనంను రాబట్టేందుకు రాత్రికి రాత్రి భారత ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ మూవ్మెంట్ ఇచ్చింది.

black money

ప్రభుత్వానికి పన్ను కట్టకుండా.. అక్రమంగా దాచుకున్న సొమ్ముని నల్లధనం లేదా బ్లాక్ మనీ అంటారు. ప్రాధమికంగా డబ్బు రూపంలో లేదా వ్యాపారం, రాజకీయపార్టీలు, వ్యక్తుల దగ్గర దాచుకున్న సొమ్మంతా బ్లాక్ మనీ కిందకు వస్తుంది.

అయితే ఈ బ్లాక్ మనీని రాబట్టేందుకు మోదీ ప్రభుత్వ నిర్ణయం.. నల్ల కుబేరులకు షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనక ముందస్తు జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అయితే ఈ నిర్ణయంతో.. నల్లధనాన్ని ఎలా బయటకు తీసుకురావచ్చో తెలుసుకుందాం..

నల్లధనం బయటకు తీసుకొచ్చే స్ట్రాటజీ

500, 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేసినట్లు.. హఠాత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

నల్లధనం

500 రూపాయల నోట్లను కొత్త నోట్లతో ఎక్స్ చేంజ్ చేసుకునే సదుపాయం కల్పిస్తూనే.. 2000 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. ఇండియాలో మూలుగుతున్న నల్ల ధనం ఎలా బయటకు రాబట్టవచ్చో తెలుసుకుందాం.

నోట్ల రద్దు

48గంటల పాటు బ్యాంకులు, ఏటీఎమ్ లు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 500, 1000 రూపాయల నోట్లు రద్ద కావడంతో.. వాటిని మార్చుకునే అవకాశం లేదు.

అత్యవసర ప్రదేశాల్లో

అయితే కొన్ని అత్యవసర ప్రదేశాల్లో మాత్రం ఈ నోట్లను.. కొత్తనోట్లను విడుదల చేసేంతవరకు ఉపయోగించుకునే సదుపాయం కల్పించింది ప్రభుత్వం.

ఎక్స్ చేంజ్

31 డిసెంబర్ 2016 వరకు బ్యాంకులలో ఈ పాత నోట్లను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.

ఐడీ ప్రూఫ్ కంపల్సరీ

అయితే పాత నోట్లను బ్యాంక్ లో సబ్ మిట్ చేసేటప్పుడు.. సరైన డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్ ఆధారంగా చూపించాల్సి ఉంటుంది.

నల్ల కుబేరులపై దెబ్బ

డబ్బుకి సంబంధించిన ఐడీ ప్రూఫ్ చూపించే నిబంధన ఉండటం వల్ల నల్లకుబేరులు.. తమ డబ్బును ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలా నల్లధనం బయటపడుతుంది.

హాస్పిటల్స్

పాత నోట్లను ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ బిల్స్, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాల కేంద్రాలలో పాతనోట్లను ఉపయోగించే సదుపాయం కల్పించింది.

గవర్నమెంట్ అధారిటీస్

అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన షాపులు, పెట్రోల్ పంప్స్ దగ్గర పాత నోట్లను ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్ టికెట్స్, రైల్ టికెట్స్

ఎయిర్ టికెట్స్, రైల్ టికెట్స్ కొనడానికి కూడా పాత నోట్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే పాత నోట్లను ఎయిర్ పోర్ట్ లోనే ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం నిర్ణయంపై హర్షం

ఇలా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం.. ఇండియాలోని.. మొత్తం వ్యవస్థ అంతా షేక్ అయి షాక్ అయింది. అవినీతిని, నల్లధనంను పారద్రోలడానికి చివరికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అందరిలో కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

English summary

How Will India Get Rid Of Black Money?

How Will India Get Rid Of Black Money? With a sudden ban on 500 and 1000 rupee notes in India, this is a master stroke from Narendra Modi to curb the use of black money.
Please Wait while comments are loading...
Subscribe Newsletter