For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు-పరిష్కార మార్గం

|

ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఎదగటానికి జ్యోతిషం రీత్యా పరిశీలిస్తే గ్రహముల పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు పాలు అయ్యే అవకాశం ఉంది. ఒక్కో రాశివారికి ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది.

అయితే దాని వల్ల వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రంలో కొన్ని మార్గాలున్నాయి. అనారోగ్యాన్ని నివారించుకోవడానికి భగవంతుని ధ్యానంతో పాటు మానవ ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశివలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించుకోవచ్చు ..

మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ?

మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరడటానికి ఏ దేవున్ని పూజించాలో తెలుసుకుందాం...

మేశ రాశి :

మేశ రాశి :

ఈ రాశివారు కఫ, పిత్త శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి మూత్రపిండాలు, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు గర్భాశయ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది

పరిష్కార మార్గం: ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. పసుపు తేనె మిశ్రమాన్ని పరడగడుపున తీసుకోవాలి. కుక్కకు అన్నం పెట్టాలి. అనారోగ్య సమస్యలు పెరిగినప్పుడు హనుమంతునికి మండలం (40రోజుల)పూజతో పాటు తోక పూజచేయాలి. బిల్వపత్రాలతో శివారాధన చేయాలి.

వృషభరాశి:

వృషభరాశి:

వీరికి సర్వ సంబంధమైన (గొంతుకు సంబంధించి)వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హార్ట్ సమస్యలు, అపస్మారక సంబంధ వ్యాలు, కఫం, టాన్సిల్స్, ఢిప్తీరియా, పయోరియా వంటి వ్యాధులు రావచ్చు. మూత్ర వ్యాధులు, రక్త హీనత, ఉబ్బసం వంటివి కూడా కలగవచ్చు.

పరిష్కారం: ధ్యానం, వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి . సుబ్రహ్మణ్యారాధన చేయడం శ్రేయస్కరం.

మిథున రాశి:

మిథున రాశి:

మిథున రాశి వారికి విశ్రాంతి లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురౌతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మనోవ్యాధి ప్రాణవాయువు (ఆక్సిజన్)శాతం తగ్గడం, న్యూమోనియా, క్షయ, ఫ్లూ, గర్భకోశ వ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పరిష్కారం: వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. యోగా, ప్రాణాయామాల వల్ల మనోవ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తొలగుతాయి. అలాగే నివశించే చోట గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూసుకోవాలి.

మెలకెత్తిన విత్తనాలు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అమ్మవారిని ధ్యానించాలి.

 కర్కాటక రాశి:

కర్కాటక రాశి:

వీరికి రొమ్ము, జీర్ణకోశం, హార్ట్ సంబంధిత వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కవు. నెమ్ము, కఫం, కేన్సర్, హిస్టీరియా, కీళ్ళనొప్పులు, శోష, స్వర సంబంధ వ్యాధులు, మానసిక, శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటి సమస్యలు ఎదుర్యే అవకాశం ఉంది.

పరిష్కారం:రెగ్యులర్ గా యోగా చేయడం ఉత్తమం. మరియు అనవసర విషయాలను అదుపులో ఉంచుకోవాలి. అనుమానం అపనమ్మకం వీడాలి.

శివుడుని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.

సింహరాశి:

సింహరాశి:

వీరికి హార్ట్ సమస్యలు, నడుము నొప్పి, వెన్ను నొప్పి, పండ్ల నొప్పి, పార్కింసన్ వ్యాధి మొదలగునవి సంభవించవచ్చు.

పరిష్కారం: సూర్య నమస్కారాలు, ప్రాణాయమం మీకు తప్పనిసరి. ఇతరులపై ఆధారపడటం తగ్గించాలి. మీ పనులను మీరే స్వయంగా నిర్విర్తించాలి.

అనవసర సందేహాలను పక్కన పెట్టి, మీ అభిప్రాయాలను ధైర్యంగా బైట పెట్టండి. మనసులోనే మథన పడటం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.

క్రమం తప్పకుండా సూర్యారాధన చేయాలి.

కన్య రాశి:

కన్య రాశి:

ఈ రాశి వారికి ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నాభి, తుంటి భాగాలకు అనారోగ్యం కలగవచ్చు. అజీర్ణం, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.

పరిష్కారం: మితాహారాన్ని తీసుకోవాలి. ధ్యానం చేయాలి. మొలకెత్తిన విత్తనాలను తినాలి. రక్త సుద్దికి, జీర్ణశక్తికి వైద్యుని సంప్రదించి మందులు వాడండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.

వినాయకుడిని అర్చించడం వల్ల మేలు జరగుతుంది.

 తులారాశి:

తులారాశి:

తులారాశివారికి మధుమేహ సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ. మానసిక ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్దకం, రక్తహీనత కలిగే అవకాశాలు ఎక్కువ.

పరిష్కారం: యోగా మరియు ధ్యానం చేయడం తప్పనిసరి. మెండి పట్టువీడాలి. శెనగలు తరచుగా తినాలి. సుబ్రహ్మణ్యారాధన మంచిది.

 వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు. హార్ట్ , సుఖవ్యాధులు, చర్మ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ. కాళ్ళకు లేదా తొడలకు సంబంధించిన వ్యాధులు కూడా కలగవచ్చు.

పరిష్కారం: ఆహారంలో పసుపును తరచుగా వాడాలి. చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. రక్తశుధ్దికి వైద్యుని సంప్రదించి, మందులను వాడాలి. ఇతరులతో తప్పులేంచడం మానితే మీ మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. హనుమంతుని పూజించడం వల్ల మేలు జరగుతుంది.

 ధనూరాశి :

ధనూరాశి :

స్థూల శరీరాన్ని కలిగి ఉంటారు. నరాల బలహీనతలు, తొడలు మరియు పిరుదుల భాగంలో వ్యాధులు కలగవచ్చు. రక్తదోషము, అంటువ్యాధులు చర్మ సంబంధమైన, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు కలగవచ్చు. మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ.

పరిష్కారం: వ్యాయామం, ప్రాణాయామం, తప్పనిసరిగా చేయాలి. ఆహారం తగిన మోతాదులో తీసుకోవాలి. సరైన సమయంలో భుజించాలి. పచ్చి కూరలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. ధాన్యాన్ని అలవాటు చేసుకోవాలి. శనిమహాత్మున్ని పూజించాలి.

మకరరాశి:

మకరరాశి:

వీరికి వాత పిత్త సంబంధ వ్యాధులు కలుగుతాయి. అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మ వ్యాధులు, జలుబు, చెవుడు, వెన్నెముక వ్యాధి, క్యాన్సర్ , పక్షవాతం కలిగే అవకాశం ఉంటుంది.

పరిష్కారం: ప్రాణాయామం, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయాలి. నువ్వుల నూనెను వంటికి పట్టించుకుని స్నానం చేయాలి. ఆహారంలో నువ్వుల పొడి తరచుగా వాడాలి. పచ్చికూరలు తినడం మంచిది.

కుంభరాశి: ఈ

కుంభరాశి: ఈ

రాశి వారికి కాంతి జబ్బులు, నరాల బలహీనతలు ఎక్కువ. రక్తప్రసరణ సమస్యలు కలగవచ్చు. హార్ట్ సంబంధిత సమస్యలు, నోట్లో పుండ్లు, కాళ్లు, మరియు కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు, మొదలగు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ.

పరిష్కారం: సూర్య నమస్కారం, ప్రాణాయామం తప్పనిసరి, నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసి స్నానం చేయాలి. రాత్రి సూక్తం చదువుకోవాలి. చురుకుగా ఉండాలి. బద్దకం మీ వ్యాధులను మరింత పెంచుతుంది. శివారాధన, శని మహాత్మ ఆరాధన మంచిది.

 మీన రాశి:

మీన రాశి:

మీన రాశి వారు బలహీనతలను కలిగి ుంటారు. వాత శరీరం వకావడం వల్ల కాళ్లలో పాదాలలో నీరు పడుతుంది. కీళ్ళ జబ్బులు రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి, మలకోశ వ్యాధులు కలగవచ్చు.

పరిష్కారం: ధ్యానం, వ్యాయామం చాలా అవసరం. పసుపు, మరియు మిరియాలు ఆహారంలో తరచుగా వాడాలి. మీ మనస్సులోని ఆలోచనలు సన్నిహితులతో పంచుకోవాలి. ఒక్కరే మీరు మథన పడటం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. మొలకెత్తిన శెనగలు తీసుకోవాలి. విష్ణుమూర్తి ఆరాధన చేయడం మంచిది.

English summary

How Zodiac Signs Affect Health and How to Solve them

Many people believe that astrology can not only give you an insight into who you are, it can also give you an insight into your health and the types of health problems you may have.
Desktop Bottom Promotion