For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని.. జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

By Staff
|
Do You Want To Become Rich? Remove These Things In Your Home Immediately || Boldsky Telugu

ఇంట్లోని కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే.. పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తారు.

ఇండియన్స్ పాటించే మూఢనమ్మకాల వెనక ఉన్న అసలు సీక్రెట్స్..!!

ఇంటి ఆవణరణలో తేనె తెట్ట పెడితే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ ఇది మంచిది కాదని కొంతమంది సూచిస్తుంటారు. అసలు వాస్తవం ఏంటి ? అలాగే.. ఇంట్లో సాలె పురుగు గూడు పెట్టినప్పుడు దాన్ని తొలగిస్తే.. లక్ష్మీదేవి ఇంటి నుంచి పోతుందని కొంతమంది అపోహపడుతుంటారు. కానీ.. ఇందులోని అసలు నిజం ఏంటి ? ఇలాంటి మరెన్నో డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడంతో పాటు, ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఏవి ఉండకూడదు అనేది తెలుసుకుందాం..

కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని.. జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. మన సంపద, ధనంపై దుష్ర్పభావం చూపే.. వస్తువులు ఏంటి, వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

పక్షిగూడు

పక్షిగూడు

ఇంట్లో పాపురం గూడు ఉండటం వల్ల.. వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి.. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడుపెట్టుకుని ఉంటే.. వెంటనే తొలగించండి.

MOST READ:పాలలో పసుపు కలిపి తాగితే పొట్ట కొవ్వు కరిగుతుంది....

తేనె తెట్ట

తేనె తెట్ట

తేనెటీగలు పేర్చే తేనె తెట్ట ఇంట్లో ఉండే చాలా డేంజర్ అని గుర్తించండి. ఇవి మనకు హానికరమే కాదు.. దురదృష్టానికి కారణమవుతుంది. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఇది ఉంటే.. వెంటనే తొలగించండి.

సాలేడు గూడు

సాలేడు గూడు

సాలేడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తారు. కానీ.. ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. కాబట్టి వెంటనే.. దాన్ని తొలగించి.. ఇంటిని శుభ్రం చేసుకోండి.

పగిలిన అద్దాలు

పగిలిన అద్దాలు

పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు.. నెగటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలాగే దారిద్య్రాన్ని ఆహ్వానిస్తాయి. కాబట్టి.. పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి.

గబ్బిలాలు

గబ్బిలాలు

గబ్బిలాలు.. అనారోగ్యానికి, దురదృష్టకర పరిస్థితులకు, పేదరికం, మరణానికి సంకేతంగా భావిస్తారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే.. సూర్యాస్తమయం తర్వాత ఖచ్చితంగా.. తలుపులు, కిటికీలు మూసేసుకోవాలి.

MOST READ:రెండు వారాల్లో రెండు ఇంచెస్ పొట్ట కరిగించే 15 మార్గాలుMOST READ:రెండు వారాల్లో రెండు ఇంచెస్ పొట్ట కరిగించే 15 మార్గాలు

గోడలు చీలిపోవడం

గోడలు చీలిపోవడం

గోడల్లో చీలిక కనిపించడం, పెయింట్ రాలిపోవడం వంటివి గమనించినట్లైతే.. వెంటనే.. దాన్ని రిపేర్ చేయించాలి. ఇవి చూడ్డానికి అసహ్యంగానే కాకుండా, బ్యాడ్ లక్ కి ఎట్రాక్ట్ చేస్తాయి.

లీక్ అవుతున్న ట్యాప్స్

లీక్ అవుతున్న ట్యాప్స్

ఇంట్లో ఉండే ట్యాప్స్ లీక్ అవడం వల్ల నీళ్లు వేస్ట్ అవడం మాత్రమే కాదు.. ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీస్, మీ అదృష్టం కూడా బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి.. మీ ఇంట్లో లీక్ అవుతున్న ట్యాప్ ని వెంటనే.. రిపేర్ చేయించండి.

టెర్రస్

టెర్రస్

చాలామంది ఇంటిపైకప్పును డంపింగ్ యార్డ్ లా మార్చేస్తుంటారు. పాత ఫర్నిచర్, పాత వస్తువులన్నింటినీ.. ఇంటి మేడపై పడేస్తారు. టెర్రస్ ని ఇలా మార్చడం వల్ల.. దురదృష్టం ఎదురవుతుంది, పేదరికం పట్టిపీడిస్తుంది. వెంటనే దాన్ని శుభ్రం చేసుకోండి.

వాడిపోయిన పువ్వులు

వాడిపోయిన పువ్వులు

ప్రతిరోజూ దేవుడిని పూజించేటప్పుడు వాడిపోయిన పూలు సమర్పించరాదు. దేవుడి గదిని శుభ్రం చేసి.. వాడిపోయిన పువ్వులను తొలగించాలి. వాడిపోయిన పూలు దేవుడికి సమర్పిస్తే.. దరిద్రాన్ని ఆహ్వానించినట్టే.

వాడిపోయిన ఆకులు

వాడిపోయిన ఆకులు

ఇంటి ఆవరణలో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడ తాజాగా ఉండాలి. వాడిపోయినవి ఉంటే.. తొలగించాలి. వాడిపోయిన ఆకులను అలాగే ఉంచడం వల్ల.. నెగటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయి. దీనివల్ల ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బ్లూ కలర్

బ్లూ కలర్

ఇంట్లోకి ధనం, అదృష్టాన్ని ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరం వైపు గది ఉంటే.. ఖచ్చితంగా అది బ్లూ కలర్ లో ఉండాలి. రెడ్, మెరూన్ షేడ్స్ లో పెయింటింగ్ లేకుండా జాగ్రత్తపడాలి.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్

పచ్చగా, తాజాగా ఉండే మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల.. ఇంట్లోకి ధనం రావడానికి ఆకర్షిస్తుంది. కావాలంటే గోడలకు దీన్ని అల్లుకునేలా చేయవచ్చు. ఇవి ఇంట్లోకి ధనాన్ని ఆహ్వానిస్తుంది.

ఎంట్రెన్స్

ఎంట్రెన్స్

అందమైన ఎంట్రెన్స్ సంతోషాన్ని, సంపదను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కాబట్టి.. ఎంట్రెన్స్ ని చాలా అందంగా అలంకరించాలి. చెక్కతో చేసిన నేమ్ ప్లేట్ పై భార్యాభర్తల పేర్లు రాసి పెడితే మంచిది.

వంటగది

వంటగది

వంటగది..ఇంటికి ఆగ్నేయంలో ఉండాలి. వంటగదికి వేసే రంగులు పింక్ లేదా ఎల్లో కలర్లు ఉండాలి. బ్లాక్, గ్రే కలర్స్ వేయకూడదు.

పడమర రూమ్

పడమర రూమ్

ఇంటికి పడమర దిక్కుగా గది ఉంటే.. ఆ గది రంగులు ఎల్లో అయి ఉండాలి. ఈ గదిని శుభ్రంగా ఉంచడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి.

క్యాష్ లాకర్

క్యాష్ లాకర్

క్యాష్ లాకర్ లేదా అలమరాను దక్షిణం గోడవైపు లేదా నైరుతి మూలలో ఉండేలా జాగ్రత్త పడాలి. లాకర్ లో కుబేరుడి విగ్రహం పెట్టడం వల్ల.. ఇంట్లోకి అదృష్టంతోపాటు, ధనం వస్తుంది.

MOST READ:సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇలా చేస్తే ఏ రోగాలు రావు!MOST READ:సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇలా చేస్తే ఏ రోగాలు రావు!

వాటర్ ఫౌంటేయిన్

వాటర్ ఫౌంటేయిన్

ఇంటికి ఈశాన్యంలో వాటర్ ఫౌంటేయిన్ పెట్టడం మంచిది. అయితే ఎల్లప్పుడూ నీళ్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రతిరోజూ నీటిని మారుస్తూ ఉండాలి. దీనివల్ల అదృష్టం వరిస్తుంది.

అక్వేరియం

అక్వేరియం

ఇంట్లోని హాలులో ఈశాన్యం వైపు ఫిష్ ఆక్వేరియం పెట్టడం మంచిది. ప్రతిరోజూ ఫిష్ కి ఆహారం పెడుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే.. మీ ఇంటికి సంతోషంతో పాటు, ధనం ఆహ్వానించబడతాయి.

English summary

If you want to be rich, remove these things from your house immediately

If you want to be rich, remove these things from your house immediately. According to Vastu, there are many things which if kept in the house, can drain you of your finances and bring in poverty.
Desktop Bottom Promotion