ఒకవేళ మీరు పుట్టిన డేట్ బేసి సంఖ్య అయితే ఏమవుతుంది ?

మీరు పుట్టిన డేట్ ని బట్టి.. మీరు వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే.. ముందుగా మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది ఏ సంఖ్యలో గమనించాలి. అంటే బేసి(odd) సంఖ్యలా, సరి(even)సంఖ్యలా అనేది తెలుసుకోవాలి.

Posted By:
Subscribe to Boldsky

న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన డేట్ చాలా విషయాలను, మీ వ్యక్తిత్వాన్ని చాలా వివరంగా సూచిస్తుంది. అయితే మీరు పుట్టిన డేట్ ని బట్టి.. మీరు వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే.. ముందుగా మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది ఏ సంఖ్యలో గమనించాలి. అంటే బేసి(odd) సంఖ్యలా, సరి(even)సంఖ్యలా అనేది తెలుసుకోవాలి.

date of birth

అయితే డేట్ ని, మంత్ ని, ఇయర్ ని మూడింటినీ సపరేట్ గా కూడిన తర్వాత వచ్చే అంకెను బట్టి.. బేసి సంఖ్యా, సరి సంఖ్యా అనేది డిసైడ్ చేయాలి. ఉదాహరణకు మీరు 14 నవంబర్ 1988న జన్మించారు అనుకుంటే..

1+4=5
1+1=2
1+9+8+8=26=2+6=8

ఏ డేట్ లో పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?

దీని ప్రకారం మీ ఫైనల్ కాంబినేషన్ 5, 2, 8. ఇది బేసి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీ డేట్ ఆఫ్ బర్త్ ని క్యాల్యుకులేట్ చేసి.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ కింద వివరించిన వాటిని బట్టి తెలుసుకోండి.

బేసి, బేసి, బేసి

ఒకవేళ మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది.. మూడు బేసి సంఖ్యలే వస్తే.. మీ జీవితంలో ఎప్పుడూ బ్రైట్ సైడ్ నే చూస్తారు. చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఆధ్మాత్మికంగా ఉంటారు. తెలివైనవాళ్లై ఉంటారు. ప్రేమ కోసమే బతుకుతారు. కానీ తరచుగా దానివల్ల బాధపడుతారు. బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందిపడతారు.

మూడ్ విషయంలో

ఎలాంటి కారణం లేకుండా ఫీలవడం వీళ్లకు అలవాటు. దీనివల్ల వాళ్ల మూడ్ పై ప్రభావం చూపుతుంది. వీళ్లు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. చాలా సానుభూతి కలిగి ఉంటారు. కానీ వీళ్ల మూడ్ ఎప్పుడూ బాగుండేలా మెయింటెయిన్ చేయడం కష్టం. ఇతరులపై కోపంగా ఉన్నప్పుడు దాన్ని మరొకరిపై చూపే అవకాశం ఉంటుంది.

బేసి, బేసి, సరి సంఖ్య

ఒకవేళ మీరు పుట్టిన తేదీ, నెల బేసి సంఖ్యలై, ఏడాది మాత్రం సరి సంఖ్య అయితే.. ఇలాంటి వాళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ ఈ విషయాన్ని ఇతరులతో చెప్పరు. ముఖ్యంగా వీళ్ల ప్లాన్స్, అభిప్రాయాల గురించి ఎవరితో చెప్పరు. ఎంత క్లోజ్ గా ఉండేవాళ్లకు కూడా చెప్పరు, ఎక్కువగా వాటి గురించి మాట్లాడరు.

సక్సెస్ సీక్రెట్

సక్సెస్ అవడానికి సైలెన్స్ మంచి ఫార్ములా అని నమ్ముతారు. మరో ముఖ్యవిషయం ఏంటంటే.. వీళ్లు ముసుగులో ఉంటారు. వీళ్ల అసలు పర్సనాలిటీని గుర్తించడం చాలా కష్టం.

బేసి, సరి, బేసి

ఒకవేళ మీరు పుట్టిన డేట్ బేసి సంఖ్య, నెల సరి సంఖ్య, ఏడాది బేసి సంఖ్య అయితే.. ఈ కాంబినేషన్ చాలా ఫేమస్ వ్యక్తులు కలిగి ఉన్నారు. సైంటిస్ట్ లు, ఆర్కిటెక్ట్స్, ఇన్నోవేటర్స్ ఈ కాంబినేషన్ కలిగి ఉన్నారు. వీళ్లు జీవితంలో సక్సెస్ అవుతారు.

ఓపెన్ మైండెడ్

వీళ్లు ఇతరులు ఇష్టపడే చాలా ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు. కాబట్టి వీళ్లను ఇతరులు బాగా ఇష్టపడతారు. వీళ్లు చాలా డైనమిక్ గా ఉంటారు. అలాగే వీళ్లతో ఉండే .. ఇతరులకు ఏమాత్రం బోర్ అనిపించదు.

సరి, బేసి, బేసి

ఈ కాంబినేషన్ లో పుట్టినవాళ్లు చాలా ఎక్స్ పర్ట్స్. క్షుద్రపూజలు నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది. స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు. వీళ్లు గ్రేట్ పెయింటర్స్, బిల్డర్స్ అవుతారు. ఇలాంటి ఉద్యోగాలు వీళ్లు వాస్తవ వ్యక్తిత్వాన్ని వివరిస్తాయి.

బేసి, సరి, సరి

ఈ కాంబినేషన్ లో పుట్టినవాళ్ల పిల్లలు కూడా ఇదే కాంబినేషన్ కలిగి ఉంటే.. జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్లు జీవితంలో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. సక్సెస్ అవుతారు.

లక్ష్యంపై గురి

వీళ్లు పుట్టుకతోనే గణితశాస్త్రం, వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. కానీ ఫైనాన్స్ రంగంలో మరింత ఎక్కువ సక్సెస్ అవుతారు. వీళ్లు లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత పెద్ద సమస్యలనైనా.. తేలికగా.. తొలగించుకుంటారు. జీవితాన్ని చాలా సింపుల్ గా, ప్రశాతంగా అనుభవించాలని కోరుకుంటారు.

సరి, బేసి, సరి

ఈ కాంబినేషన్ బర్త్ డిటెయిల్స్ కలిగినవాళ్లు చాలా స్మూత్ గా ఉంటారు. ఎలాంటి పరిస్థితులకైనా.. చాలా నెమ్మదిగా రియాక్ట్ అవుతారు. దీనివల్ల వీళ్లు ఏది కావాలనుకుంటే అది పొందుతారు. కంపెనీలలో కావాలనుకున్న జాబ్ పొందుతారు. దీనివల్ల వీళ్లకు చాలా సంతృప్తి కలుగుతుంది.

సమస్యలు

సమస్యలను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వీళ్లకు బాగా తెలుసు. అలాగే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ.. ఆధ్యాత్మికం సంక్షోభం ఎదుర్కోరు. ఎలాంటి సమస్యలనైనా చాలా తేలికగా పరిష్కరించుకునే సత్తా ఉంటుంది.

సరి, సరి, బేసి

ఈ కాంబినేషన్ లో పుట్టిన వాళ్లు సర్జన్స్, డాక్టర్స్, సైకాలజిస్ట్ లు అవుతారు. వీళ్లకుండా స్కిల్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. వీళ్లకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. వీళ్లకు ఉండే ఆసక్తులకు అనుగుణంగా కొత్త విషయాలను చేస్తారు. వీళ్లు అందరినీ సమానంగా చూస్తారు. పాత స్నేహితులైనా, కొత్త వ్యక్తులనైనా.. అందరినీ ఒకేలా చూస్తారు. ఒకేరకంగా ట్రీట్మెంట్ చేస్తారు.

సరి, సరి, సరి

ఈ కాంబినేషన్ లో పుట్టినవాళ్లు.. అంత అందమైన ఆర్ట్ క్రియేట్ చేయలేరు. కాబట్టి.. వీళ్లకున్న టాలెంట్ కే.. వీళ్లు సంతృప్తి చెందుతారు. చాలా అరుదుగా అడ్వెంచర్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

English summary

If Your Date of Birth Is An Odd Number What it Means

If Your Date of Birth Is An Odd Number What it Means. According to numerology, your date of birth can reveal a lot about your personality. In order to find out more.
Story first published: Friday, November 11, 2016, 12:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter