For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో పెట్టుకోకూడని అత్యంత దురదృష్టకరమైన వస్తువులు..!!

వాస్తు దోషం ఉంటే.. ఇంట్లోది ప్రతీదీ సమస్యగా మారుతుంది. ఆర్థికపరమైనవి, సంబంధాలు, భార్యాభర్తల అన్యోన్యత, అదృష్టం, సంపద.. ఇలా అన్నింటిలోనూ సమస్యలు వస్తాయి.

By Swathi
|

కొన్ని దశాబ్ధాలుగా మనుషులు వాస్తును నమ్ముతూ వస్తున్నారు. వాస్తు అంటే.. కేవలం ఫర్నిచర్ ని సరైన క్రమంలో పెట్టడం లేదా ఇంటి ఒక డైరెక్షన్ లో కట్టించడం కాదు. ఇంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టకూడదు అనేది.. కూడా చాలా ముఖ్యం.

unlucky things

ఏ చిన్న వస్తువునైనా.. సరైన క్రమంలో పెట్టుకోకపోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషం కనిపిస్తుంది. కాబట్టి.. మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీ భవిష్యత్ మీరు ఊహించినట్టు ఉండాలన్నా, మీకు అదృష్టం వరించాలన్నా.. ఇంటి విషయంలో, ఇంట్లోని వస్తువుల విషయంలో.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

వాస్తు దోషం ఉంటే.. ఇంట్లోది ప్రతీదీ సమస్యగా మారుతుంది. ఆర్థికపరమైనవి, సంబంధాలు, భార్యాభర్తల అన్యోన్యత, అదృష్టం, సంపద.. ఇలా అన్నింటిలోనూ సమస్యలు వస్తాయి. కాబట్టి.. మీ ఇంటికి, మీకు నెగటివిటీని, దురదృష్టాన్ని తీసుకొచ్చే కొన్ని వస్తువులను ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదు. మరి అవేంటో చూద్దాం..

మురికి నీరు

మురికి నీరు

ఇంట్లోగానీ, ఇంటి చుట్టూ గానీ.. మురికి నీరు ప్రవహించకుండా జాగ్రత్తపడాలి. ఇలా మురికి నీరు ఇంట్లో ఉండటాన్ని వాస్తు దోషంగా పరిగణిస్తారు.

నెగటివిటీ

నెగటివిటీ

ఇంటి చుట్టూ మురికి నీరు ఉంటే.. నెగటివిటీకి దారితీస్తుంది. ఇంట్లోని వాళ్లకు ఈ నెగటివిటీ పరాభావం తీసుకురావడానికి కారణమవుతుంది.

ముళ్ల మొక్కలు

ముళ్ల మొక్కలు

ఇంటి చుట్టూ.. ముళ్లతో ఉండే మొక్కలు లేకుండా జాగ్రత్తపడాలి. అలాగే.. అలాంటి మొక్కలను గార్డెన్ , ఇంటి బయట కూడా పెట్టుకోకూడదు.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

ఇలాంటి ముళ్ల మొక్కలు ఇంట్లో ఉంటే.. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముళ్ల ముక్కలు ఇంట్లో ఉండే.. ఇంట్లో సమన్వయము లేకుండా ఉంటారు. ఎప్పుడూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

రాళ్లు

రాళ్లు

ఇంటి బయట తీసుకొచ్చి రాళ్లు ఇంట్లో పెట్టుకోకూడదు. ఒకవేళ మీ ఇళ్లు నిర్మించబడుతూ ఉంటే.. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. ఖచ్చితంగా.. రాళ్లు అన్నింటినీ తొలగించాలి.

సమస్యలు

సమస్యలు

ఇంటి బయట రాళ్లు ఉంటే.. సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఆ కుటుంబం విజయం సాధించే మార్గంలో చాలా పెద్ద సమస్యను ఎదుర్కోబోతుందని తెలుపుతుంది.

చెత్త

చెత్త

ఇంటి బయట చెత్తను విసిరేసే అలవాటు చాలామందికి ఉంటుంది. తర్వాత శుభ్రం చేసేవాళ్లు వచ్చి తీసుకెళ్తారని భావించి.. ఇలా ఇంటి బయట చెత్త పడేస్తారు. కానీ.. ఇంటి బయట చెత్త ఉంటే.. వాస్తు దోషాన్ని తెలుపుతుంది.

సంబంధంలో సమస్య

సంబంధంలో సమస్య

ఇంటి బయట చెత్త ఉంటే.. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. మీ కుటుంబం త్వరలోనే అప్పుల్లో కూరుకుపోతుంది. కాబట్టి.. వెంటనే చెత్త ఇంటి బయటపడేయడం మానేయండి.

కరెంటు స్తంభాలు

కరెంటు స్తంభాలు

ఇంటి బయట ఎలక్ట్రిక్ పోల్స్ ఉండటం చాలా సాధారణం. అయితే.. అవి రిస్కీ మాత్రమే కాదు.. అవి వాస్తు దోషాన్ని కూడా సూచిస్తాయి.

జీవితంలో చిక్కులు

జీవితంలో చిక్కులు

ఒకవేళ ఇంటి బయట ఎలక్ట్రిక్ పోల్ ఉంటే.. కరెంటు స్తంభంలో చిక్కులు చిక్కులుగా వైర్లు ఉన్నట్టే.. మీ జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. ఇంటి దగ్గర అలాంటి పోల్స్ లేకుండా జాగ్రత్త పడండి.

పెద్ద చెట్టు

పెద్ద చెట్టు

ఇంటి బయట చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అయితే.. అలాంటి చెట్లు.. వాస్తు దోషాన్ని సూచిస్తాయి. కాబట్టి పెద్ద పెద్ద చెట్లు ఇంటి బయట ఉండకుండా జాగ్రత్తపడండి.

ఎండపడనీయవు

ఎండపడనీయవు

పెద్ద పెద్ద ఇల్లులు ఇంటి బయట ఉంటే.. ఎండ, గాలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాకుండా.. అడ్డుకుంటాయి. కాబట్టి.. గార్డెన్ లో లేదా ఇంటి బయట చిన్న చిన్న చెట్లు పెంచుకోవడం మంచిది.

కొమ్మలు

కొమ్మలు

మీ ఇంట్లోకి పెద్ద పెద్ద కొమ్మలు లేదా తీగలు రాకూడదు. ఈ మొక్కలు వాస్తు ప్రకారం చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి.. ఇంట్లోకి వచ్చేట్టు మొక్కలు నాటుకోకూడదు. తీగలు కూడా ఇంట్లోకి పాకేలా ఉండకూడదు.

శత్రువులు

శత్రువులు

ఇలాంటి కొమ్మలు, తీగలు ఇంట్లోకి పాకేట్టు ఉంటే.. శత్రువుల సంఖ్య పెరుగుతుందట. దీనివల్ల మిమ్మల్ని మీరు సమస్యల్లో పడేసుకుంటారు.

ప్రధాన ద్వారం

ప్రధాన ద్వారం

వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం ఎప్పుడు.. రోడ్డు కంటే తగ్గులో ఉండకూడదు. ఒకవేళ మెయిన్ డోర్ కంటే.. రోడ్డు ఎత్తుపై ఉండే.. వాస్తు ప్రకారం మంచిది కాదు.

ఒడిదుడుకులు

ఒడిదుడుకులు

ఒకవేళ ప్రధాన ద్వారం అలా లేకపోతే.. మీ జీవితంలో చాలా కష్టాలు చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఇంటి తలుపు అలా నిర్మించి ఉంటే.. వెంటనే.. దాన్ని పునర్ నిర్మించుకోవడం మంచిది.

పాలు వచ్చే మొక్కలు

పాలు వచ్చే మొక్కలు

పాలు వచ్చే మొక్కలు ఇంట్లో ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. జిల్లేడు వంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు. కాబట్టి.. అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడాలి.

హానికరం

హానికరం

అలాంటి చెట్లు ఇంట్లో ఉండే.. వాస్తు దోషమే కాకుండా.. ఆ మొక్కల పాలు విషపూరితంగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో పిల్లలు వాటిని తీసుకున్నారంటే.. కష్టం. కాబట్టి.. అలాంటి మొక్కలు ఇంట్లో లేకుండా జాగ్రత్తపడండి.

English summary

Keeping these things in your House can be Unlucky

Keeping these things in your House can be Unlucky. Vastu Dosha can even be found in a needle, stored inappropriately in the house.
Story first published: Thursday, October 20, 2016, 15:25 [IST]
Desktop Bottom Promotion