మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ లక్కీ నెంబర్ ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి ?

మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి జ్యోతిష్యం, న్యూమరాలజీ తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు పుట్టిన రోజుని బట్టి మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలుసుకుందాం. అదృష్ట సంఖ్యను తెలుసుకోవడాని

Posted By:
Subscribe to Boldsky

న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన డేట్ చాలా విషయాలను, మీ వ్యక్తిత్వాన్ని చాలా వివరంగా సూచిస్తుంది. అయితే మీరు పుట్టిన డేట్ ని బట్టి.. మీరు వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే.. ముందుగా మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది ఏ సంఖ్యలో గమనించాలి.

డేట్ ని, మంత్ ని, ఇయర్ ని మూడింటినీ సపరేట్ గా కూడిన తర్వాత వచ్చే అంకెను బట్టి.. మీరు ఎంత లక్కీనో తెలుసుకోవచ్చు. మీరు ఎలా ఉంటారు, మీకు ఏ విషయం కలిసొస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు.

Know Lucky Number according to Your Date of Birth.

సంపద, ఆర్థిక పరిస్థితులు, మీ విజయం గురించి అన్ని రకాల విషయాల గురించి.. సంఖ్యాశాస్త్రం చాలా క్లియర్ గా చెబుతుంది. రకరకాల కలలు, రకరకాల ఆలోచనలతో జీవితాన్ని విజయవంతంగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేకపోతారు.

మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి జ్యోతిష్యం, న్యూమరాలజీ తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు పుట్టిన రోజుని బట్టి మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలుసుకుందాం. అదృష్ట సంఖ్యను తెలుసుకోవడానికి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ని తెలుసుకోవాలి. మరి మీ డెట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీ అదృష్టాన్ని పరిష్కరించుకోండి.


లక్కీ నెంబర్

ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 సెప్టెంబర్ 1985 అయితే.. 1+9+1+9+8+5= 33= 3+3= 6. అంటే మీ అదృష్ట సంఖ్య 6 అన్నమాట.

1 అయితే

మీరు పుట్టిన డేట్ ని బట్టి వచ్చిన నెంబర్ 1 అయితే మీరు చాలా అదృష్టవంతులు. మీ చుట్టూ ఉన్నవాళ్లను సంతోషంగా ఉంచుతారు. వీళ్లు ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

2 అయితే

ఒకవేళ మీరు పుట్టిన డేట్ ని మొత్తం కూడిన తర్వాత 2 వచ్చిందంటే.. వాళ్లు సోమవారం ఉపవాసం ఉంటే మంచిది. లేదా సోమవారం రోజు ఉప్పు తీసుకోకపోతే మంచిది.

3 అయితే


పుట్టిన డేట్ ని కూడితే.. 3 వచ్చిందంటే.. వాళ్లు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. దీనివల్ల వీళ్ల అదృష్టం రెట్టింపు అవుతుంది.

4 అయితే

డేట్ ఆఫ్ బర్త్ ని కూడితే.. 4 వచ్చిందంటే.. వాళ్లు వినాయకుడిని పూజించాలి. దీనివల్ల జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

5 అయితే

పుట్టిన తేదీలో 5 అంకె వచ్చిందంటే.. వాళ్లు ప్రతి బుధవారం ఆవులకు బెల్లం, పచ్చిగడ్డి తినిపించాలి. అలాగే వినాయకుడి స్తోత్రాన్ని స్మరిస్తే జీవితంలో విజయాలు వరిస్తాయి.

6 వచ్చిందంటే

పుట్టిన డేట్ లో 6 వచ్చిందంటే.. గురువారం స్వీట్ లేదా చక్కెర పదార్థాలు తీసుకుంటే.. లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరిస్తే.. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.

7 అయితే

డేట్ ఆఫ్ బర్త్ ని కూడినప్పుడు 7 వచ్చిందంటే.. వాళ్లు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం, శివుడికి అభిషేకం చేస్తే.. మంచి జరుగుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

8 వచ్చిందంటే

మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి.. మీ అదృష్ట సంఖ్య 8 వచ్చినవాళ్లు రావిచెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. దీనివల్ల మంచి జరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి.

9 అయితే

మీ డేట్ ఆఫ్ బర్త్ ని కూడిన తర్వాత అదృష్ట సంఖ్య 9 వచ్చిందంటే.. ప్రతి మంగళవారం ఆంజనేయకుడిన భక్తితో పూజించి, హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచి జరుగుతుంది.

English summary

Know Lucky Number according to Your Date of Birth.

Know Lucky Number according to Your Date of Birth
Please Wait while comments are loading...
Subscribe Newsletter