ఇంట్లోకి పక్షి వస్తే ప్రాణగండం..!! మనుషుల్లో ఉన్న అపోహలెన్నో..

నమ్మకాలు, అపోహలు ఎంతవరకు వాస్తవాలు. వీటిని నిజంగా నమ్మవచ్చా ? మెయిన్ డోర్ నంబర్ నుంచి, వంటింట్లో స్టవ్ పెట్టే యాంగిల్ వరకు.. రకరకాల నమ్మకాలు ఉన్నాయి.

Posted By:
Subscribe to Boldsky

ఇంట్లోకి పక్షి వస్తే.. ప్రాణగండం, ఇంట్లో తేనెటీగలు తిరిగితే.. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి ప్రాణాలు గల్లంతు.. ఇంట్లో అద్దం పగిలితే.. దురదృష్టం.. వామ్మో వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా, విడ్డూరంగా అనిపిస్తున్నాయి కదూ.

myths

పక్షికి ప్రాణానికి, తేనెటీగలకు మరణానికి, అద్దం పగలడానికి, దురదృష్టానికి ఏమాత్రం పొంతనలేదు. కానీ.. వీటిని చాలామంది నమ్ముతారు. వీటిలో ఏ ఒక్కటి జరిగినా.. చాలా ఆందోళనకు గురవుతారు. పరిహారాల కోసం.. పంతుళ్లు, జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతారు.

అయితే ఈ నమ్మకాలు, అపోహలు ఎంతవరకు వాస్తవాలు. వీటిని నిజంగా నమ్మవచ్చా ? మెయిన్ డోర్ నంబర్ నుంచి, వంటింట్లో స్టవ్ పెట్టే యాంగిల్ వరకు.. రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం మన మైండ్ సెట్ ని మార్చేస్తున్నాయా అన్నది చాలా మందిని ప్రశ్నిస్తుంది.

ఈ నమ్మకాలను నిర్లక్ష్యం చేస్తే.. బ్యాడ్ లక్ వెంటాడుతుందని, తమకు, తమ కుటుంబ సభ్యులకు మంచిది కాదనే అపోహ ఎక్కువగా ఉంటుంది. మనం నిత్యం వినే, చూసే ఈ అపోహలు, నమ్మకాల గురించి తెలుసుకుందాం..

నమ్మకం 1

తెరిచి ఉన్న కిటికీలో నుంచి ఇంట్లోకి పక్షి ఎగిరితే.. అది ఇంట్లోకి దురదృష్టం తీసుకొస్తుందని అపోహ ఉంది. అంతేకాదు.. మరణానికి సంకేతమని భావిస్తారు. మరికొంతమంది.. కాకి.. ఇంట్లోకి ఏ తలుపులో నుంచి లేదా కిటికీలో నుంచి వచ్చినా ఇల్లు వదిలిపెట్టాలని నమ్ముతారు.

నమ్మకం 2

బ్రెడ్ ని కట్ చేసినప్పుడు.. అది పైది కిందకు, కిందది పైకి అంటే రివర్స్ లో బ్రెడ్ స్లైస్ పడిందంటే.. అది ప్రాణాలు కోల్పోవడానికి సంకేతమని, దుష్ట శక్తులు రావడానికి సంకేతమని చాలామంది నమ్ముతారు. మరికొంతమందైతే.. కుటుంబ పెద్ద చనిపోతారని నమ్ముతారు.

నమ్మకం 3

తేనెటీగలను దేవ దూత అని నమ్ముతారు. అందుకే.. ఇంట్లో తేనెటీగలు సెటిల్ అయితే.. కుటుంబంలో ఎవరో ఒకరి మరణానికి సంకేతమని చాలామంది అపోహ పడుతారు.

నమ్మకం 4

కొత్త ఇంట్లో చెత్తను పాత చీపురుతో ఉడిస్తే.. నెగటివిటీ తీసుకొస్తుందట. అంటే ఆ పాత చీపురులో ఉండే పాత ఇంట్లోని దుమ్ము కొత్త ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుందని నమ్ముతారు.

నమ్మకం 5

అద్దం దానంతట అదే పగిలిపోతే.. ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం ఉంది. ఎందుకు మనుషులంతా ఇంత నెగటివ్ గా ఆలోచిస్తారు.

నమ్మకం 6

ఇంట్లో పగిలిపోయిన గడియారం ఉంటే.. అది కూడా.. కుటుంబంలోని ఎవరో ఒకరి మరణానికి సంకేతమని భావిస్తారు. అలాగే గడియారం ఆగిపోతే కూడా.. వార్నింగ్ సంకేతంగా భావిస్తారు.

అసలు వాస్తవాలు

ఇవన్నీ.. కేవలం అపోహలు మాత్రమే. వీటిని నమ్మకండి. ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తే.. వీటిని, మన మరణానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి.. జీవితాన్ని హ్యాపీగా, మరణం అంటే భయం లేకుండా.. జీవించి.. ఆస్వాదించండి.

English summary

Know These Myths About Your House

Know These Myths About Your House. People can believe in some of the most weirdest myths and here's an article to prove the same.
Story first published: Friday, October 28, 2016, 12:09 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter