చనిపోయిన ప్రేయసి.. పాముగా మారిందా ? ఇదెక్కడి ప్రేమకథ..!

తన ఇంటికి వచ్చిన పాముని చూసి.. అచ్చం చనిపోయిన తన ప్రేయసిలా ఉందంటూ.. మురిసిపోయాడు. పాముని చూడగానే పారిపోకుండా.. ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపించేశాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి కూడా చేసేసుకున్నాడండోమ్.. !

Posted By:
Subscribe to Boldsky

పాముని చూస్తే ఆమడ దూరం పరుగెత్తిపోతాం. వామ్మో అంటూ బెంబేలెత్తిపోతాం. కానీ.. తన ఇంటికి వచ్చిన పాముని చూసి.. అచ్చం చనిపోయిన తన ప్రేయసిలా ఉందంటూ.. మురిసిపోయాడు. పాముని చూడగానే పారిపోకుండా.. ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపించేశాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి కూడా చేసేసుకున్నాడండోమ్.. ! ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా.. ఈ స్టోరీ చూస్తే.. మరింత షాక్ అవుతారు.

Man Who Married A Cobra!

పెళ్లి అంటే.. ఒక అబ్బాయి అమ్మాయిని చేసుకుంటాడు. ఈ మధ్య హిజ్రాలను కూడా చేసుకుంటున్నారనుకోండి. ఇంకాస్త అప్ డేటెడ్ గా.. అబ్బాయి, అబ్బాయి లేదా అమ్మాయి, అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ వింతగా.. పామును పెళ్లి చేసుకుని.. నెటిజన్స్ కి తెగ ఎట్రాక్ట్ చేసేసి.. తనవైపు తిప్పుకుంటున్నాడు.

పాముని పెళ్లి చేసుకున్న ఈ యువకుడు ఎవరు ? పాములోనే ప్రేయసిని ఎలా కనిపెట్టాడు ? అసలు పామును పెళ్లి చేసుకున్న ఇతగాడి ప్రేమకథ, పెళ్లి కథేంటో చూసేద్దామా..

ఎవరు ?

థాయ్ లాండ్ లోని కాంచనాబౌరి అనే ప్రాంతానికి చెందిన వార్రానన్ సరసలిన్. ఇతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ.. ఆమె ఐదేళ్ల క్రితం చనిపోయింది. ఆ మరణంతో.. చాలా బాధపడ్డాడు.

ఒకరోజు

తాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి..చనిపోయిన తర్వాత.. 10 అడుగుల పాము తన ఇంటికి వచ్చింది. దాన్ని మొదటిసారి చూడగానే.. ఆ పాముతో ఏదో తెలియని కనెక్షన్ ఉందని.. తన ప్రేయసిలాగే ఉందని ఫీలయ్యాడు. అంతే.

సిద్ధాంతం

చనిపోయిన మనుషులు జంతువుల రూపంలో తిరిగి జన్మిస్తారని.. మన హిందూ పురాణాలు చెబుతాయి. ఈ విషయాన్ని ఇతను చాలా బలంగా నమ్మాడు. బుద్దిజంను ఫాలో అయ్యే ఇతను.. తన ప్రేయసి పాము రూపంలో వచ్చిందని భావించి పెళ్లి చేసుకున్నాడు.

సినిమాలు, షికార్లు

పాముని పెళ్లి చేసుకున్న ఈ యువకుడు.. తన మ్యారేజ్ లైఫ్ ని అచ్చం మనుషుల్లాగే అనుభవిస్తున్నాడు. ఇద్దరూ కలిసి సినిమాలు చూస్తారు, ఫుడ్ తింటారు, డ్రింక్స్ తాగుతారు, గేమ్స్ కూడా ఆడుకుంటారట. జిమ్ కి కూడా వెళ్లడంతో పాటు.. అనేక పనులు కలిసి చేస్తారట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. చాలా డౌట్స్ ని క్రియేట్ చేస్తోంది కదూ. కానీ.. ఇదంతా నిజమే.

వార్నింగ్

చాలామంది ఇలాంటి విషపురుగుతో సావాసం ఎందుకని ఆ యువకుడిని హెచ్చరించారు. అంత దగ్గరగా.. పాముతో జీవించడం మంచిది కాదని హెచ్చరించారు. కానీ.. తాను గాఢంగా ప్రేమించే భాగస్వామిని వదులుకోలేనని చెబుతున్నాడు.. ఈ ప్రేమికుడు.

వింత చూసేందుకు

పాముతో కాపురం చేయడాన్ని చూసి.. అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పాముతో 24 గంటలూ ఎలా గడుపుతున్నాడు రా బాబూ.. అంటూ.. చుట్టుపక్కల వాళ్లంతా ఈ విచిత్రమైన జంటను చూసేందుకు క్యూకడుతున్నారు.

ఫ్రెండ్ ద్వారా

ఈ ప్రేమికుడి ఫ్రెండ్ వీళ్లను చూసి ఆశ్చర్యపోయి.. ఈ కపుల్ ఫోటోలను ఇంటర్ నెట్ లో పెట్టాడు. అంతే.. ఇవి వైరల్ గా పాకిపోతున్నాయి. వరానన్ అనే వ్యక్తి.. ఈ ఫోటోలను నెట్ లో పెట్టడమే కాదు.. వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని వివరించాడు. ఎంతైనా నిజమైన ప్రేమ అని నిరూపించాడు.. ఈ వింత ప్రేమికుడు.

English summary

Man Who Married A Cobra!

Man Who Married A Cobra! This unidentified man married a cobra, as he believed that it resembled his dead girlfriend! Check out his interesting story, here...
Please Wait while comments are loading...
Subscribe Newsletter