ఈ రాశివారు వాక్ చాతుర్యులు..ప్రతి విషయంలో ఆచి..తూచి వ్యవహరిస్తారు..!

ప్రతి ఒక్కరు తమతమ రాశులకు సంబంధించిన విశేషాల్ని, దోషపరిహారాల్ని తెలుసుకుని, వాటిని ఆచరించి సుఖశాంతులు పొందవచ్చు. రాశి చక్రమంలో ఏడో రాశి అయిన తులరాశి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం...

Posted By:
Subscribe to Boldsky

భూలోకంలో మానవులందరి మీదా నవగ్రహాల ప్రభావం వుంటుంది. మానవులు గతజన్మలో చేసిన కర్మల ఆధారంగా వారి పాపపుణ్యాలను అనుసరించి తిరిగి జన్మిస్తూ వుంటారు. అయితే మానవ జన్మ ఎత్తిన వారందరూ ఒకే విధంగా వుండరు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలతో జన్మిస్తారు. ఇలా మానవులు జన్మించిన జనన సమయం ఆధారంగా తత్కాల గ్రహస్థితులని అనుసరించి దైవజ్ఞులు ఆ మనిషికి జాతకలగ్నాన్ని నిర్ణయిస్తారు. ఈ లగ్నాలు 12 విధాలుగా వుంటాయి. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకరం కుంభం, మీనం అని రాశులు కూడా 12 వుంటాయి. ప్రతీ మనిషీ ఈ 12 రాశులలో ఏదో ఒక రాశికి చెందినవాడవుతాడు. ఈ 12 రాశులు 12 రకాల స్వభావాలు కలిగి వుంటాయి. వీటి అనుగుణంగా ఆయా రాశులలో జన్మించినవారు ఆ రాశికి సంబంధించిన స్వరూప స్వభావాలు కలిగి వుంటారు. ఈ 12 రాశులమీద ఆదిత్యాది సప్తగ్రహాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ వుంటాయి.

ప్రతి ఒక్కరు తమతమ రాశులకు సంబంధించిన విశేషాల్ని, దోషపరిహారాల్ని తెలుసుకుని, వాటిని ఆచరించి సుఖశాంతులు పొందవచ్చు. రాశి చక్రమంలో ఏడో రాశి అయిన తులరాశి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం...

రాశిచక్రంలో తుల ఏడో రాశి.

రాశిచక్రంలో తుల ఏడో రాశి. ఇది బేసి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో నాభిని, నడుమును ఈ రాశి సూచిస్తుంది.

ఇది చర రాశి,

ఇది చర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో చిత్త 3, 4, స్వాతి పూర్తిగా, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి.

దీని అధిపతి శుక్రుడు.

దీని అధిపతి శుక్రుడు. నువ్వులు, గోధుమలు, బియ్యం, శనగలు, దూది, ఆముదం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది.

ప్రాంతాలపై ప్రభావం

ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, బర్మా, టిబెట్, అర్జెంటీనా తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.

జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు.

తులరాశిలో జన్మించిన వారు సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు.వీరి జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు, ఈ చురుకు స్వభావంవల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు.

వీరికి లౌక్యం, వాక్చాతుర్యం కూడా ఎక్కువే.

వీరికి లౌక్యం, వాక్చాతుర్యం కూడా ఎక్కువే. అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

నిత్యం జనాల మధ్య గడపటానికే ఇష్టపడతారు.

నిత్యం జనాల మధ్య గడపటానికే ఇష్టపడతారు. ఒంటరిగా ఏమాత్రం ఉండలేరు. జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తారు. అతిథులను బాగా ఆదరిస్తారు.

శ్రద్ధగా అలంకరించుకుంటారు.

ఎన్ని కష్టాల్లో ఉన్నా, శ్రద్ధగా అలంకరించుకుంటారు. గడ్డు సమస్యలను సైతం తేలికగా పరిష్కరించగలరు.

కొత్త కొత్త స్నేహాలను ఏర్పరచుకోగలరు.

చర్చలను, వాదనలను ఇష్టపడతారు. ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటారు. ఎక్కడకు వెళ్లినా తేలికగా కొత్త కొత్త స్నేహాలను ఏర్పరచుకోగలరు.

ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.

ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తమ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేస్తారు.ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తమ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేస్తారు.తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయ బద్దమైన వీరి ఆలోచనలపట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు.

వీరికి సౌందర్య దృష్టి, కళలపై ఆసక్తి, విలాసాలపై మక్కువ

వీరికి సౌందర్య దృష్టి, కళలపై ఆసక్తి, విలాసాలపై మక్కువ ఉంటాయి. శాంతి సామరస్యాలను కోరుకునే వీరు హింసను, దండనను ఇష్టపడరు.

మాటలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతారు

సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలనైనా మాటలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతారు.

సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు.

తులారాశికి చెందినవారిలో ఎక్కువమంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు.

స్వల్ప కృషితోనే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందగలరు.

స్వల్ప కృషితోనే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందగలరు. అయితే, చొరవ చూపి సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాల్లో సైతం చర్చోపచర్చలతో కాలయాపన చేయడం వీరి బలహీనత.

వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు.

వీరు న్యాయ సంబంధిత వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. దౌత్యవేత్తలుగా, పాత్రికేయులుగా, మధ్యవర్తులుగా అందరి మన్నన పొందుతారు.

పర్యాటక, ఆతిథ్య రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి.

 

జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోతారు.

గ్రహగతులు అనుకూలించకుంటే వీరు తమ తాత్సార ధోరణి వల్ల జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోతారు.

పగటి కలల్లో విహరిస్తూ కాలహరణం చేస్తారు.

పగటి కలల్లో విహరిస్తూ కాలహరణం చేస్తారు. తమను తాము ప్రేమైక జీవులుగా భావించుకొని, ప్రేమ వ్యవహారాల్లో భంగపాట్లు చవిచూస్తారు.

బలహీనత

తులారాశివారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతిరాజీ స్వభావంతోపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.

కుటుంబం

కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారినుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పినమాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు.

 

 

స్నేహానికి ప్రాణం ఇస్తారు.

వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.

English summary

Negative and Positive Libra Characteristics

Just a quick glance at the Libra profile shows the stunning contradictory nature of this sign. Libra wants to stay and go. He longs to be married, yet is happy when single. He desires admiration for his stunning intelligence, but not at the expensive of his charming good looks. Welcome to the land of Libra, where it's not a question of either/or, but one of both and all.
Please Wait while comments are loading...
Subscribe Newsletter