జీవితంలో ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు, తప్పులు..!!

మనం చేసే పనులే మన కర్మను డిసైడ్ చేస్తాయి. కాబట్టి.. మన కర్మ సిద్ధాంతాలను బట్టే మన మరణం ఆధారపడి ఉంటుంది. అందుకే.. జీవితంలో, జీవితకాలంలో ఎట్టిపరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు.

Posted By:
Subscribe to Boldsky

మనందరం మరణం అంటే భయపడతాం. అది అనివార్యమైనది. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా రావచ్చు. కొన్నిసార్లు ఊహించని పరిణామంలా మరణం వస్తుంది. అయితే మరణం అనేది ఎప్పుడూ ప్రశాంతంగా, బాధాకరమైనదిగా ఉండదు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. వాళ్ల వాళ్ల కర్మలను, చేసిన మంచి చెడులను బట్టి ఉంటుంది.

Never do these things in your lifetime

మరణాన్ని మనం వాయిదా వేయలేం. అయితే అది బాధాకరంగా లేకుండా చేసుకోవచ్చు. ప్రశాంతమైన మరణం అంటే.. డైరెక్ట్ గా మోక్షం పొందడం, దేవుడి ఇంట్లోకి ప్రవేశించడంతో సమానం. మరి బాధాకరంగా, అత్యంత నరకం అనుభవించకుండా, మరణాన్ని ప్రశాంతంగా పొందాలంటే జీవితంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు.

మనం చేసే పనులే మన కర్మను డిసైడ్ చేస్తాయి. కాబట్టి.. మన కర్మ సిద్ధాంతాలను బట్టే మన మరణం ఆధారపడి ఉంటుంది. అందుకే.. జీవితంలో, జీవితకాలంలో ఎట్టిపరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు. ఎలాంటి పనులకు దూరంగా ఉంటే.. ప్రశాంతమైన మరణాన్ని పొందుతామో చూద్దాం..

నిద్రపోయే అలవాట్లు

రాత్రిళ్లు లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్రలేవడం వంటి అలవాట్లు.. చంద్రుడు, సూర్యుడి ఇద్దరికీ ఆగ్రహం తెప్పిస్తాయి. దీనివల్ల మరణించిన తర్వాత శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టడానికి ఇబ్బందిగా మారుతుంది. అలా మరణం బాధాకరంగా మారుతుంది. కాబట్టి.. నిద్రపోయే అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండాలి.

యువతరం

మనుషుల జీవితంలో యువతరం చాలా మంచి దశ. ఒకవేళ ఈ సమయంలో చెడు అలవాట్లు, ఎక్కువ శారీరక సంబంధాల కారణంగా పెయిన్ ఫుల్ డెత్ పొందాల్సి వస్తుంది. కాబట్టి యూత్ గా ఉన్నప్పుడు.. చాలా మంచి అలవాట్లు అలవరుచుకోవాలి.

ఆల్కహాల్

ఆల్కహాల్ కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. ఆత్మకు కూడా హాని చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ని పరిమితిగా తీసుకున్నప్పుడే.. ఆ వ్యక్తి మరణం ప్రశాంతంగా ఉంటుంది.

నమ్మకస్తులు

నాక్తికుడిగా ఉండవచ్చు. కానీ అలాంటివాళ్లను అవమానించడం మంచిది కాదు. దేవుడిని నమ్మేవాళ్లను అవమానించేవాళ్ల మరణం చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు జీవితంలో చేయకూడదు.

తల్లిదండ్రులను గౌరవించడం

తల్లిదండ్రులను గౌరవించకుండా, వాళ్లను పట్టించుకోకుండా ఉండేవాళ్లను చాలామందినే చూసుంటాం. కానీ.. వాళ్లను గౌరవించడం చాలా ముఖ్యం. మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినవాళ్లకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.

ఎక్కువ డబ్బు సంపాదించాలనుకోవడం

అత్యాశ ఉండటం, కోరిక ఉండటం చాలా విభిన్నం. డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే ఓకే. కానీ కొంతకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ ఉండటం మంచిది కాదు. ఇలాంటి ఆలోచన మీ మరణాన్ని భయంకరంగా మారుస్తుంది.

నవ్వు

ఇతరులను చూసి నవ్వడం గౌరవించడం, ప్రేమను చూపించడం, విలువ ఇవ్వడంతో సమానం. కాబట్టి నవ్వడం వల్ల ఖర్చు ఏమీ కాదు. కాబట్టి నవ్వుతూ పలకరించడం అలవాటు చేసుకోండి. అది మీకు మంచి కర్మను తీసుకొస్తుంది.

సహాయం

ఇతరులకు సహాయపడటం వల్ల మంచి కర్మను పొందవచ్చు. మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది.

నిజాయితీ

మిమ్మల్ని తప్పు పట్టేవాళ్లు, మీ నిర్ణయాన్ని జడ్జ్ చేసేవాళ్లు మీ చుట్టూ లేకపోయినా.. మీరు నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అనేది.. మంచి కర్మ పొందడానికి అత్యంత ముఖ్యమైనది.

దానం

దానం చేయడం అంటే డబ్బులు దానం చేయాల్సిన అవసరం లేదు. పాత పుస్తకాలు, బట్టలు, ఆహారం కూడా దానం చేయవచ్చు. ఇలాంటి పనులు మీకు సంతోషాన్ని, ప్రశాంతతను, మంచి కర్మను అందిస్తాయి.

ప్రేమ

మీ ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, ఫ్రెండ్స్ ని ప్రేమించండి. కొంత సమయాన్ని మీకు ఇష్టమైనవాళ్ల కోసం కేటాయించండి. ఇది మీకు సంతోషాన్ని, మంచి కర్మను తీసుకొస్తుంది.

మంచి కర్మ పొందడం

చూశారుగా జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనులేంటో. ఇప్పుడే.. మీరే మీ పనుల ద్వారా కర్మను డిసైడ్ చేసుకోవచ్చు.

English summary

Never do these things in your lifetime

Never do these things in your lifetime. Do you know that death does not always have to be painful and that you can leave this world in peace ?
Please Wait while comments are loading...
Subscribe Newsletter